నాగులచవితి,రచన,జె.పీ.ఎస్.

కార్తీక మాసం వచ్చింది
కన్నుల్లో వెలుగు తెచ్చింది
నాగన్న పండగ వచ్చింది
నాగులచవితి రోజు ఇది
తొలి ఝామునే నిద్ర లేచాము
తలార స్నానం చేసాము
ముంగిట కళ్ళాపి చల్లాము
ముత్యాల ముగ్గులు పెట్టాము
పూలు ఫలములు పూజాద్రవ్యాలు
ఏరికూర్చి మేముంచాము
చిమ్మిలి దంచి ఉంచాము
చలిమిడి ఉండలు చేసాము
నాగులగావంచ తెచ్చాము
నాగేంద్ర నీకు మొక్కాము
వడపప్పుపానకం నారీకేళము
పుట్టనుంచి నిను కొలిచాము

నాగేశ్వర నిన్ను తలచాము
మా మనమ్మునా నిలిపాము
చిన్న పెద్ద తరలొచ్చాము
శివాభరణ పూజించాము
అగరుబత్తులు సీమటపాసులు
కాల్చి మురిసి తరియించాము

Comments

Popular posts from this blog

Articles