మెట్టు భూమి, రచన జె.పీ.ఎస్.
వానతల్లి నీకు దండమే
కరుణించి చల్లగ కురియవే
జోరువాన నీకోసమే
పడిగాపులూ పడుతున్నమే
పరుగులెత్తి మాకోసమే
కురిసి పచ్చని పంటలనివ్వవే

భూమి తల్లినీ నమ్మినం
చెమట ధారపోసి బతికినం
కన్నీళ్ల కష్టాన్ని చూసినం
కడుపుకింత తిండి మరిచినం
బీటలోరి భూమి బద్దలై
బాధఒడిసిపట్టి మరి ఏడ్సినం

ఉన్నఊరినీ వదిలినం
తప్పదంటు పట్నమెల్లినం
మెట్టభూమికి దండమెట్టినం
మెతుకుకోసమై వెతికినం
మల్లి రావాలంటు మొక్కినం
ఇహ కాని వూరు బండి ఎక్కినం

Comments

Popular posts from this blog

Articles