"VAMMO NORU"
ఏదైనా చెయ్యగల సమర్ధత,ఎంతకైనా తెగించే దుడుకు స్వభావం, కత్తికైనా లేని పదును, మాటల తూటాని,మరో ఆయుధాన్ని. దేనికైనా తాళాలు వున్నాయి గాని...మనకి!!అబ్బే!! ఎవ్వరి తరం కాదు!!. నీ వాగుడు వరద ఆపవే బాబు!!నువ్వెవరో చెప్పి ఏడు!!....అదే మరి!!చెబుతున్నా!!వినండి!!మీ నోరుని!!అడ్డు అదుపు లేనిదాన్ని!!.నెలల పిల్ల నుంచి బెంగ పడిపోతూంట్టారు.ఎక్కడ మాటలు రావో అని.వస పోసేసేవాళ్ళు కొందరైతే,వైద్యుల దగ్గరకు మోసుకెలిపేవాళ్లు కొందరు.అమ్మ!!అని పిలుపు వింటే చాలు.ఉత్సాహంతో ఉరుకులు, పరుగులు, అడిగిన వాళ్లకి, అడగనివాళ్ళకి చెప్పుకొని...ఓ..ఎంత మురిసిపోతారో. ఇంక అక్కడ్నుంచి ఉంటాయి రకరకాల జిమ్మిక్కులు.ఇహ వున్నత స్థానానికి తీసుకెళ్లాలన్న, పతనం చేయాలన్న, మనదే ఆపరేషన్ అంతా.మాట అన్నది మణి మాణిక్యాలకన్నా విలువైనది.మాయల ఫకీరు చిలక ప్రాణంలా మనమే మూల కారణం.పాతాళానికి తోయవేయబడ్డారంటే మనదే ఆ ఘన కార్యం. అందుకే అంటారు నోరా!!తేమాకే వీపుకి!! అని. అయినా విని ఏడిస్తేగా!!. బాధ పడితే గాని బోధపడదని!!.పదిమందిలో మాట్లాడాలంటే మామూలు విషయమా?.....చక్కని పలుకు పలికి,తీయటి మాట్లాడొద్దని అన్నానా?. అయ్యో!!అయ్యో!!ఎంత మాటనేస్తున్నారో అని...ఎంత బాధ పడిపోతానో.సరస్వతి పుత్రులు కండి!!సభ్యత,సంస్కారాలతో మెలగండి.అసభ్య పదజాలాలు, దూషించడాలు చేయకండి.డబ్బు,ధనం లేకపోయినా కూడా ఎక్కడికో తీసుకెళ్తాను!!తెలుసా!!. మాటే మదుపు, మీ మాటే మంత్రం.ఏ రంగానైనా రాణించేవారు మాటకార్లు మాత్రమే.ఎందరో ప్రముఖులు మంచి మాటలకి ఆకర్షితులై ఆహ్వానం పలికిన దాఖాలాలెన్నో.వున్నత స్థానాల్లో వున్నా మాట వల్ల దిగజారిపోయి సమస్యలు ఎదుర్కొనేవారెందరో.నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎన్ని అనర్ధాలో!!చిన్నబోయేవాళ్లు, ఛీత్కరించేవాళ్ళు ఎందరో!!ఎంత విద్యాధికుడవైన విజ్ఞత కోల్పోయి మాట్లాడితే!!విలువుంటుందా!!అసహ్యించుకోరు!!నోరు మంచైతే వూరు మంచ్చన్నారు!! ఎందుకు?ఇందుకే!!.కాబట్టి నా మాట వినండి!!చక్కటి మాట,ఆపైన చిరునవ్వు......ఈ రెండు గుర్తుపెట్టుకోండి!! నోటి కొచ్చిన కూతలు కూయకండి.ఆత్మీయాభిమానం కనబరచకపోయిన పర్లేదు....ఇష్టానుసారంగా వాగకండి!!.తల్లి లేదు,చెల్లి లేదు భార్యలేదు,ఇరుగు లేదు, పొరుగు లేదు....కోపం వస్తే వీరు లేదు, వారులేదు.విచక్షణ జ్ఞానం కోల్పోయి మనసుని గాయపరుస్తారా?తప్పు కదూ!!ప్రతీవాళ్ళూ నన్నాడిపోసుకుంటున్నారు.కాబట్టి నన్ను నిందలకి గురి చేయకండి.ముఖ్యన్గా వయసులో పెద్దవారు, వివిధ రంగాల ప్రముఖులను కలిసినప్పుడు....ఒకటికి పదిసార్లు మననం చేసుకు వెళ్ళండి.నీ ఊక దంపుడు ఆపవే!! వినలేక చస్తున్నాం అనుకుంటున్నారు!!కదా!! మీకోసమే చెబుతున్నా!! వినండి మరి!!.....అదుపులో ఉంటే సరి!!లేకపోతె ఆందోళనకు గురి!!......ఇంతే సంగతి....జాగ్రత్త వహిస్తే!! నేనే మీ సిరి!!...ఇట్లు, అధరాన ఆనందలహరి, మీ నోరిది......రచన జయప్రభాశర్మ.
Comments
Post a Comment