డ్యూయెట్ లిరిసిస్ట్,జె.పీ.ఎస్.
అతడు; ఏదోలా వుందే
ఏదెదోలావుందే
నిను చూసినవేళా
నాలో ఇంకేదో అవుతోందే
ఏదెదోలావుందే
నిను చూసినవేళా
నాలో ఇంకేదో అవుతోందే
ఆమె; ఏంటో అనుకుందే
యింకేంటో అనుకుందే
చిరునవ్వులకర్ధం
నీలో అది ఏంటో తెలిసిందే
యింకేంటో అనుకుందే
చిరునవ్వులకర్ధం
నీలో అది ఏంటో తెలిసిందే
చరణం;
అతడు; నా తలపుల వలపుల గమకం
తియ తియ్యని తేనెల మధురం
ఆమె; నా మనసున నిలిచిన ప్రణయం
చల చల్లగ తాకిన పవనం
అతడు; నా తలపుల వలపుల గమకం
తియ తియ్యని తేనెల మధురం
ఆమె; నా మనసున నిలిచిన ప్రణయం
చల చల్లగ తాకిన పవనం
అతడు; అనుకోని ఆరాటం
అందిస్తా ఆహ్వానం
అందిస్తా ఆహ్వానం
ఆమె; ఇక లేదే ఆషాడం
మరి రేపే తాంబూలం '' ఏదోలా'
మరి రేపే తాంబూలం '' ఏదోలా'
చరణం
ఆమె; నా కనులకు కలలకు సాక్ష్యం
ప్రేమాంకిత మృధు భావం
అతడు; నా తనువుకు తపనకు మూలం
నును సిగ్గుల నీ వదనం
ఆమె; నా కనులకు కలలకు సాక్ష్యం
ప్రేమాంకిత మృధు భావం
అతడు; నా తనువుకు తపనకు మూలం
నును సిగ్గుల నీ వదనం
ఆమె; మది చేసే విన్యాసం
మురిపించే రస నాదం
అతడు; అరుదెంచే కార్తీకం
ఆనందం మన సొంతం 'ఏదోలా'
Comments
Post a Comment