"SUBABUL"



ఏవండోయ్! మీ దేశం చాలా ఏళ్ళక్రితం వచ్చాను. బాగా సేవ చేసి మెప్పు పొందుదామని. అలాగే! మంచి పేరు సంపాదించుకున్నాను.నేననుకున్నట్టే మీకు ఉపయోగపడుతున్నాను.ఇంతకీ! నా పేరు చెప్పలేదు కదూ!. నా పేరు" సుబాబుల్".  నేను మెట్ట ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాను. కరువు కాటకాలెదురైనా మనం లొంగం గాక లొంగం.పెరుగుతుండడమే నా పని. నాకు ఎటువంటి సేవ చేసే అవసరం లేదు. మరేంకాదండి! నీళ్లు పోయడం, గొప్పు పెట్టడం, ఎరువులు వేయటం చెయ్యక్కర్లేదన్నమాట. ఎలాగైనా పెరిగి తీరుతాను. ఆ! నీవల్ల ఉపయోగమా! పాడా! నువ్వు పెరిగితే ఎంత!పెరగకపోతే ఎంత! నీ సోది ఆపి చావు!అని మాత్రం దయచేసి అనొద్దు!. ఎందుకంటే! మన గొప్పతనం అలాంటిది. ఏదో పెరుగుతోంది అనుకుంటున్నారేమో!నన్నుకొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా పెంచుతున్నారు ఎకరాల్లో. నా గురించి మీకేం తెలుసు!వాళ్లకి మన విలువ తెలుసు కాబట్టి, ఎంచగ్గా చూసుకుంటున్నారు.నీ సుత్తి ఆపి! చెప్పవమ్మా! అని విసుకుంటున్నారు కదూ! ఆ!అక్కడికే వస్తున్నా!వినండి! కాగితం తయారీకి, సరుగుడుతోటలు పెంచి, పేపరు మిల్లుకి ఎలా పంపిస్తారో అలానే నేను కూడానన్నమాట. నన్ను ఉపయోగించిన పేపరు అత్యత్భుతంగా ఉంటుందని ప్రశంసలు పొందినదాన్ని. అందువల్ల మెట్టప్రాంతాల్లో రైతులు నన్ను పెంచుతుంటారు. మన గిరాకీ అటువంటిది. అసలు విషయం చెప్పటం మరిచా!. నేను మీదేశంలో పుట్టలేదు. నేను పుట్టింది ఆస్ట్రేలియా దేశంలో. అక్కడ దేశస్తులు నన్ను చూస్తే చాలు! తెగ మురిసిపోతారు!. వారి పశువులకోసం గడ్డికింద ఆకుల్ని, ముదిరినకాయలోంచి వచ్చిన గింజల్నితీసి, పిండి ఆడించి దాణాగా వాడతారు. మన" మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు" ఆస్ట్రేలియా పర్యటనచేసినపుడు, అక్కడ పశు క్షేత్రాలని సందర్శించినప్పుడు చూసి, నన్ను మీ దేశానికీ పరిచయం చేశారన్నమాట. ఆస్ట్రేలియాలో నా పేరు "కుబాబుల్". ఇక్కడకు వచ్చిన తరువాత "సుబాబుల్" గ పేరు మారినదన్నమాట. ఇహ మేకలు గొర్రెలు ఐతే నన్ను చూసాయంటే,ఓ, వాటికి పండగే పండగ. అంత యిష్టం నేనంటే. అంత గొప్పదాన్ని ఐన నన్ను చూసి పట్నవాసులకి  ఏవిటా విసురు!. ఒక్క గింజ వేసి వెళ్ళిపోతే చాలు. ఎంత విశ్వాసం చూపిస్తానో!. నే పెరిగి దశ దిశలా వ్యాప్తి చెందుతాను.ఒహ్హో! అందాల విశాఖలో ఐతే నేనే ఎక్కువ ఆక్రమించేను. హూదూద్ వచ్చినప్పుడు, నా కొమ్మలు రెమ్మలు విరిగిపోయి, కళావిహీనంగా వున్ననన్ను నేనే  చూసుకొని బోరున విలపించేను. ప్రకృతివిలయతాండవం చేస్తుంటే, ఏమి చేయలేక నిస్సహాయురాలినై, మనోవేదన అనుభవించేను. మళ్ళీ ఎప్పుడు పూర్వ వైభవం వస్తుందా! అని ఎదురుచూశాను. నా ఆశ ఫలించి, గత వైభవం కంటే మిన్నగా వున్న నన్ను చూసి అందరు పొగుడుతుంటే, ఎంత గర్వన్గా ఉంటుందో!ఎందుకంటే నన్ను పొగుడుతుంటే,నా విశాఖని పొగిడినట్లే అని. విశాఖ అంటే ఏంటో చెప్పనా! "వి" అంటే విశ్వమంతా, "శా"సాష్టాంగం చేసి  మెచ్చుకున్న, "ఖ" అంటే అందాల ఖనిజం. అలాంటి విశాఖలో నా విస్తరణ, ఎందరికో ఆనందం, ఆహ్లాదం. నన్ను మీరెంతో అభిమానించాలి, ఆదరించాలి. చాల్లే!అని వదిలేయకూడదు.పర్యావరణ పరిరక్షణకై పాటుపడండి.సరేనా!. వుంటాను!.....ఇట్లు, మీ ఆనందమే నా ఆనందం అంటున్న,మీ సుబాబుల్......జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles