Aluperugani Sainikudu
మీతో మాట్లాడే టైమెక్కడదండి?.మాట్లాడకపోతే బాధపడతారని వుండవలసివస్తోంది. లేకపోతె ఎప్పుడో వెళిపోయేవాడిని.మరేం లేదండి!మేము అప్రమత్తంగా లేకపోతె, దేశమంతా అతలాకుతలం అయిపోదు!అందుకని రాత్రి పగలు అని లేకుండా, డేగ కళ్ళతో శత్రువులు ఎక్కడ దాడి చేస్తారో అని కాపలా కాస్తూవుంటాము. మేము అలా కాపలా కాస్తుండబట్టి, మీరు ఇంత దైర్యంగా, హాయిగా కంటినిండా నిద్రపోతున్నారు. అందుకే మేము ఎంత శ్రమ పడినా బాధపడము. మీ సంతోషం మాకెంతో ఉత్సాహాన్నిస్తుంది. గడ్డకట్టే మంచుని సైతం అందుకే లక్ష్యపెట్టం. మన త్రివర్ణ పతాకం చూస్తూ, ఎంత దేశసేవ చేసినా ఇంకా చెయ్యాలనే తపనలో ఉంటాము. మా శ్వాస, ద్యాస, ఆశ అంతా మూడు రంగుల జెండా. మాకు ఇక్కడ పనిలో వున్నప్పుడు వేరే ఆలోచనలంటూ ఏవి వుండవు. మా కుటుంబసభ్యులను విడచి వచ్చినా, రోజులతరబడి, కనీసం ఫోన్ చేసి మాట్లాడే తీరిక కూడా మాకు ఉండదు. ఐనా యింటి వారు కూడా అర్ధం చేసుకొని, సహకరించడం ఎంతో అభినందనీయం. సంవత్సరానికి ఒక్కసారి ఇంటిని కళ్ళ చూస్తే గొప్పే. ఒకసారి సైన్యంలో చేరితే భరతమాత బిడ్డలై దేశసేవకే అంకితమవుతాం. మాకు బయట ప్రపంచం ఏవిటో తెలిసే పరిస్థితి కూడా ఉండదు. సరదాలు, సందళ్ళు, పెళ్లిళ్లు,సినిమాలు, షికార్లు, బంధుత్వాలు మరచిపోయి,మాతోటివాళ్ళతోటే మాలోకం అంతా. వేళకు తిండి, కంటినిండా నిద్ర అనకుండా శత్రువులను మట్టుబెట్టడమే మా పని. మా గుళ్లకు శత్రువు నెలకొరిగితే వచ్చే ఆనందం,
మాటల్లో చెప్పలేనిది. అలాగే ఎదురు దాడిలో సహా సైనికుడు కన్ను మూసినా, కాస్తంత బాధతోపాటు వీర మరణం పొందినందుకు ఎంతో గర్వన్గా ఉంటుంది. మా కుటుంబసభ్యులు ఎక్కడవున్నా పిలిచి, అవార్డులిచ్చి,సత్కరించి, మమ్మల్ని గౌరవించటం, మా మరణం తరువాత కూడా మమ్మల్ని గుర్తుంచుకోవడం, మన భరతమాత గొప్పతనం కదా!. మమ్మల్ని నమ్మి ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతోంది. మంచి జీత భత్యాలు, మంచి ఆహరం,పాలు, పళ్ళు, ఇళ్ల స్థలాలు మరెన్నో సమకూర్చి చూసుకుంటోంది. మా క్షేమం కోసం ఆలోచిస్తోంది. మనదేశ కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ ఇలానే వుండాలని కోరుకుంటోంది.అలాంటి తరుణంలో మనదేశానికి ఏం చేస్తే ఋణం తీర్చుకోగలమంటూ ఆలోచించి, అసువులు బాయటానికి కూడా సిద్ధంగా ఉంటాము. మరి మా వుద్యోగ ధర్మం మేము పాటించక తప్పదు కదండీ!. మేము ఇందుకు ఇష్టపడే కదా సైన్యంలో చేరింది! ఎంతమందికి ఇలాంటి అదృష్టం దక్కేది! అలాగే! అందరు మాకెందుకనుకుంటే! దేశాన్ని రక్షించే వారెవరుంటారు!. ఆ యుద్ధభూమిలో సమరానికి తలపడినప్పుడు ప్రతి సైనికుని తలపు, విజయమో, వీర మరణమో అని దైర్యంగా పోరాడటమే." వాఘా " సరిహద్దుకు వచ్చారంటే సామాన్య భారతీయునికి సైతం ఆ మట్టిలో అడుగు పెట్టేసరికి, ఒళ్ళుపులకరించి, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అలాగే కాశ్మీర్ అందాలను చూసి మీరు ముగ్దులవుతుంటే, మరోపక్క మీ గురించే ఆలోచిస్తూ, ఏ క్షణాన ఏం జరుగుతుందో, అయ్యో మీరేమైపోతారో, మేమేమైపోతున్నా, మిమ్మల్ని కాపాడే పనిలో నిమగ్నమై,మా ప్రాణాలు పణంగా పెట్టి శత్రువులను చీల్చి చెండాడుతాం. మంచులో గడ్డకట్టుకుపోతున్నా....మేము అస్సలు పట్టించుకోము.. ఎందుకంటే! మా తల్లి భరతమాత కన్నుల్లో మెదులుతుంట్టే,ఆ ఆనందమే తప్ప వేరే ఇంకేదీ కనిపించదు.....నా పుణ్యభూమి గురించి నాలుగు మాటలు చెప్పే భాగ్యం కలిగినందుకు ధన్యవాదాలు......భారత్ మాతాకీ జై!.....జైహింద్!.....వుంటాను.....ఇట్లు, అలుపెరగని సైనికుడు......జయప్రభాశర్మ.
Comments
Post a Comment