"లలిత గీతం"

"పల్లవి" : మోహన రాగమా
నవవసంత గీతమా
విరితేనెల మధురిమా
నా ప్రేయసి హృదయమా "మోహన"
" చరణం" : అరవిరిసిన మందారం
నునుసిగ్గుల బంగారం
చిరునవ్వుల సింగారం
సిరిమువ్వల పదనాట్యం
కవినై కమ్మని కావ్యం
రాయాలని మది భావం "మోహన"
"చరణం" : అలరించిన నీ అందం
నాజీవన మకరందం
నీ నుదుటను సింధూరం
నిలవాలి చిరకాలం
వలపై తీయని నాదం
పలకాలని మృదుమధురం "మోహన"
లలితగీతం, రచన, జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles