Posts

Image
"Theylu" తేలుకుట్టిన దొంగ!....ఎర్రతేలులా మొహం ఇదీనూ!.....అవునూ! ఎప్పుడు ఏదో ఒకటి వాగడమేనా!...ఇంకేం పని ఉండదా!......మీకో నమస్కారంరా బాబూ!....మీ దగ్గర వున్నన్ని మాటలు!.....ప్రపంచం మొత్తం వెదకినా ఉండవేమో!......ఓమాటడుగుతాను !....సమాధానం చెప్పండి!...మీరే గొప్పనుకుంటున్నారా?.....తప ్పు!......ఆ ఆలోచన మార్చుకోండి!....సృష్టిలో ప్రతీ ప్రాణి గొప్పదే!....ఇంత తెలివితేటలుండీ!.....గుర్తి చరేం!....ఏదో ఒకటి విమర్శిస ్తూనే వుంటారు!....దానికి తోడు సామెతలొకటి!.....అవునండి!.. ...మాకు రూపు లేకపోవచ్చు!....మేము విష పూరితం కావచ్చు!....కానీ!....మేము కుట్టాలని ఎప్పుడూ అనుకోమండి!....ఏదో మా బతుకు మేం బతుకుతాం!.....మీరే చూసుకోకుండా!....మమ్మల్ని తొక్కడం అదీ చేస్తూవుంటారు!.....దాంతో ఆ గాబరాలొ!....అనుకోకుండా కుట్టాల్సి వస్తుంది!....మీరు మాత్రం!.....ఎవరైనా మీ జోలికి!....అనవసరంగా వస్తే! ఏం చేస్తారు!..ఊరుకుంటారా!.... .తాట తియ్యరూ!.......అలాగే మేం కూడా!.....అంతేగానీ హానీ తలపెట్టాలని ఎప్పుడూ అనుకోము!.....అందుకే!.....త ెల్లారి లేచి నరుడి కంట పడకూడదనే!.....దణ్ణం పెట్టుకుంటాం!.....కంట పడినా మీరు వొదలరు గనక!....మ...
Image
"YO YO YOUTUBE" యూట్యూబునండి బాబూ......యు ట్యూబుని.....మీకు ఏది కావాలంటే అది......ఎప్పుడు కావాలంటే అప్పుడు....అందించే సత్తా గలదాన్ని.....ప్రపంచవ్యాప్త ంగా.....ఎక్కడ ఏది జరిగినా.....బ్రహ్మాండంగా చూపిస్తాను...అంత సమర్ధత వున్నవారు.....ఇంత వరకు ఎవరైనా తారసపడ్డారా.....వుండరు.... .నాకు తెల్సు....నేనెంత గొప్పదాన్నంటే....మీలో ఏ కళ వున్నా.....విశ్వవ్యాప్తంగా  తెలియబరుస్తాను.....మీరు చేసే సేవ కార్యక్రమాలకి... .వేదిక నవుతాను.....రూపాయితో పనిలేని దాన్ని.....ఇంత నిజాయితీగా.....ఈరోజుల్లో.. ...ఎవరున్నారు చెప్పండి.....ఉంటే అది నేనే......ఎప్పుడు మీరొచ్చినా.....ఆహ్వానం పలుకుతూనే వుంటాను....నాకు విసుగు, విరామం ఉండదు....విసుక్కుంటే మీరే విసుక్కోవాలి.....వింతలు, విడ్డూరాలు.....ఆధ్యాత్మిక కార్యక్రమాలు......సాంస్కృత ిక కార్యక్రమాలు.....చలన చిత్రాలు.....ప్రముఖుల ప్రసంగాలు.....విద్య బోధనలు.....మీరేదడిగినా.... .సెకెన్లలో అందిస్తాను.....యిలా ఎవ్వరైనా ఉన్నారా....అబ్బే...ఓ పని మీద...మరో పని చేబితేనే....చిర్రు బుర్రులు.....నాకు ఆకలి నిద్ర.....పగలు రాత్రి....కోపాలు, తాపాలు.....యీర్షలు, అసూయలు.....చిన్...
Image
                               గజరాజు ఆత్మ ఘోష ఏనుగమ్మ ఏనుగు... ఏవురొచ్చిందేనుగు...మా ఊరొచ్చిందేనుగు...మంచినీళ్లు తాగిందేనుగు అంటూ ఎంత బాగా లాలిస్తూ మీ బుజ్జి పాపాల్ని ఆడిస్తారో కదా.నోరులేకపోయినా, నేను మీలా పాడలేకపోయినా, నా బిడ్డకోసం ఎన్నో కలలు కన్నా.కానీ కానరాని దూరతీరాలకి నన్ను సాగనంపారు బిడ్డతో సహా.నేనేం చేశానని?.నిండు గర్భిణిని అని చూడకుండా క్రూరాతిక్రూరంగా నన్ను మట్టుబెట్టారు.పండుని ఎర చూపిప్రాణాలు తీశారు. మనసు ఎలా ఒప్పిందో.నేను వస్తే చాలు. దీవెనలందించమంటారు.నన్ను చూస్తే చాలు ముచ్చట పడి , నన్ను అదే పనిగా తడిమి,తడిమి ఎంతో ఆనందపడతారు.నన్ను దైవంశసంభూతురాలిగా కొలుస్తారు.ఆశీస్సులందించటమే కానీ హానీ తలపెట్టని నైజం నాది.అలాంటి నన్ను హతమార్చడం భావ్యమేనా?. ఆనందంగా తిందామన్న పండు ప్రాణం తీస్తుందని తెలిసుంటే,తినేదాన్ని కాదు.బాధతో నరకయాతన పడుతున్నా,ఆలోచిస్తున్నది నా కడుపులో దాగున్న నా బిడ్డకోసం, నా కడుపున ఎందుకు పడ్డావు అని.ఎవరైనా వస్తే బావుండు, రక్షిస్తే బావుండు అని ఒకటే ఎదురుచూపులు.బాధని తట్టుకోలేక నీళ్లమడుగు...
Image
వలస కార్మికుల కష్టాలు రచన:జయప్రభాశర్మ                     ఉన్నవూరిలో బతుకు భారమై పొట్టకూటికోసం పరరాష్ట్రం పరుగులు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు.కడుపుకింత తిండికోసం అష్టకష్టాలు.ఏదో మా బతుకు మేము  బతుకుతున్నాం అనుకుని తృప్తి పడుతున్నతరుణంలో ఎక్కడ్నుంచి ఊడిపడిందో, రాకాసి మహమ్మారి కరోనా అట. మా కడుపు కొట్టి,మా పిల్లాపాపల్ని ఎంత హింసకు గురి చేసిందో చెప్పలేం.మీరు ఇంక పనికి రావద్దు, అని యజమాని చెప్పిన పిడుగులాంటి వార్తతో, ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి.కాలు, చెయ్యాడక, నోటి మాటరాక దీనస్థితి.ఎంత కష్టమైనా, ఇష్టంగా భావిస్తూ, ఇంటివారికి మూడుపూటలా కడుపునిండా  అన్నం పెట్టగలుగుతున్నామన్న తృప్తితో జీవిస్తున్న మాకు ఇటువంటి పరీక్ష ఎదురవుతుందని కలలో కూడా వూహించలేకపోయాము.యజమాని ఇచ్చిన షెడ్డుల్లో కొంతమంది ఉంటే,ఇంకొంతమంది ఏ ఫుట్పాత్లమీదో,  బషెల్టర్లలోనో కాలక్షేపం చేస్తూ గడుపుకోవడం.అదికూడా ఇప్పుడు లేదు, ఉన్నపళంగా  మీ ఊళ్ళు వెళ్లిపోండి అని చెబితే ఎలా వెళ్ళేది. ఏరకమైన  వాహనాల జాడ లేదు.నిర్మానుష్యమైన రోడ్లు,మనుష సంచారం లేని నగరా...
కొరోనా హైరానా రచన,ప్రభాశర్మ. ఒడ్డున పడ్డ చేపపిల్లలా!! ఎందుకలా గింజుకుంటున్నావు గిల గిలా!! కొన్నాళ్ళు ఓర్మి వహించి చూడు!! ఆపైన సంతోషం నీ సొత్తు ఆలోచించు!! రాకాసి కొరోనా కాటువేయుటకు!! మాటు వేసి ఉందని గమనించు!! సరదాల కన్నా శ్వాస గొప్పదని తెలుసుకో!! నిర్లక్ష్యాన్నివిడనాడి నీ లక్ష్యాన్ని గుర్తుచేసుకో!! నీ ఇల్లే సరిహద్దని విసుగు చెందమాకు!! కరిగిపోయే కాలాన్ని ఒడిసిపట్టె వీలులేదు!! అరనిమిషం జారనీక ఆనందం పట్టుకో!! ఉరుకు పరుగు జీవితాన విశ్రాంతికి దూరం!! అనురాగపు ఊయలలో ఊగులాడు అవకాశం!! వదులుకోకు సంతసాన్ని ఇది నీ క్షేమం కోసం!! కబళించే కొరోనాకి చెప్పాలి గుణపాఠం!! అందుకే మనముండాలి ఇంటికే పరిమితం!! సమర్థతతో సాధించు కబళించే కొరోనాని!! గజ గజ వణుకుతు పోదా కొరోనా మన దేశాన్ని!! హమ్మయ్య అని చేస్తావులే సంబరాన నాట్యాన్ని!!
Image
ఏందిది కొరోనా  రచన,ప్రభాశర్మ. సినిమాటిక్గా రాసి ట్యూన్ చేసుకున్న సాంగ్. పల్లవి; ఇంటిపట్టునే ఉండాలంటే బోరుకొట్టుతోందే బయటికెళ్ళి తిరిగొద్దామంటే భయము పుట్టుకుందే కనిపించనట్టి కొరోనా కనిపిస్తే నన్ను చుట్టేనా కొరోనా కొరోనా ఏందిదీ కొరోనా చరణం;హర్రి వర్రిగా పరుగులిడుతు అః పనులు అసలు లేవు స్వీటు హాటులు బెటెరుఆఫు ఇహ కొసరి కొసరి వడ్డించు ఏదైన మంచికని తలచు మరి అప్పుడే హేపినెస్సు ఏమైన మనకొరకె బాసు హెచ్చరించె మనకు ఎక్సులెంటు నాకెందుకింత హైరానా ముప్పూట తింటు పడుకోనా 'ఇంటి' చరణం; నీ చేతి డబ్బులు పెట్టమంటు ఇబ్బంది పెట్టనే లేదు గొడ్డు చాకిరీ చెయ్యమంటు నీ ఊసుకసలు రాలేదు బుర్ర నోరు మొత్తుకుంటూ బాగుండమంటు పోరేరు బలదూరు తిరుగులొద్దంటు ఎహె భద్రతంటు చాటారు నీ వొంటికెక్కితే దెఖోనా మటుమాయమౌనులే కొరోనా 'ఇంటి'
Image
నేనే కొరోనా రచన, ప్రభాశర్మ. ఎన్ని దేశాలు తిరిగానో,ఎంతమందిని పొట్టన పెట్టుకున్నానో, పిట్టలు రాలినట్టు రాలుతుంటే, ఏమానందించానో, మరణమృదంగం మోగించిన ఘనత నాది.వామ్మో!! ఈ భారతదేశంలో మాత్రం నా పప్పులుడకటం లేదు.ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.వీళ్ళ శుభ్రతలేంటి, వీళ్లేంటీ, నాతరం కావడం లేదమ్మా. అడుగడుగునా నీళ్ళంటారు, చెయ్యి కడిగితే నీళ్లు,ఒళ్ళు కడిగితే నీళ్లు,మల,మూత్ర విసర్జనకు నీళ్లు. అరె!!వీళ్ళకి టిష్యులు గిష్యులతో పనిలేదు.పోనీ!! ఆ మందు, చిందులుంటాయా అంటే అబ్బే!! వాటి పొడ అంటే గిట్టని వా ళ్ళు ఎంతమందో. మాంసాహారులకంటే,శాఖాహారుల శాతమే అత్యధికంగా కనబడుతున్నారు. ఇహ మనమేం చెయ్యగలం.అప్పటికీ అల్లుకుపోదామని, ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నించా.ఫలించేటట్టులేదు.నాకు తెలుసు!!భారతీయుల సంగతి.వద్దనుకుంటునే ఈ దేశంలో అడుగు పెట్టేసా.అమ్మో!! అమ్మో!! వీళ్ళ పూజలు బంగారం కాను!!రామాయణాలట,భారతాలట, పవిత్రజలాలట, పుణ్యభూమిఅట, పుణ్యదేశమట.ఆ సమైఖ్యత,ఆ సఖ్యత చూస్తుంటే గుండె గుబులు పుడుతోంది.నన్ను వెంటతగిలేదాకా నిద్రపోరని నాకు తెలిసిపోయింది.భారతదేశ ప్రధానమంత్రి శ్రీ.మోదీగారు కంటిమీద కునుకు లేకుండా దేశప్రజల రక్షణ కోసమై పరితప...
Image
రచన; ప్రభాశర్మ. పల్లవి; కదనరంగం రణరంగం కొరోనాతోయుద్ధం కబళించే కొరోనాను తరిమి తరిమి కొడదాం మన లక్ష్యం సాధించగ భరతదేశ ధీరులమై ప్రతివారొక సైనికులై కొరోనరహిత జనహితులై మోదీజీ సూచనలను ఆచరణలో పెడదాం విజయగర్వాన ఖ్యాతి దశదిశలకు చాటుదాం చరణం; ఎంతకాలమనికాదు ఎంతైనా భరిద్దాం ఎవరికోసమో కాదు మనకోసం తలుద్దాం బాహ్యప్రపంచం మరచి భాద్యతగాభావించి విసుగుమరచి విశ్వమంత ఆదర్శంగా నిలిచి భరతదేశ కొరోనా గెలుపు జెండ ఎగరేద్దాం చరణం; అవిశ్రాంత సైనికులై వైద్యసేవ పోరాటం కొరోనయుద్ధప్రేమికులై రక్షకభట ఆరాటం సామాజిక సేనలకు గౌరవించి స్పందించి కొరోనా శత్రువుని పారద్రోల దీక్షబూని సాధిద్దాం జయంనిజం మనది పుణ్యదేశం
Image
వామ్మో కరోనా  రచన,ప్రభాశర్మ.. పల్లవి; ఎక్కడో పుట్టావు ఎక్కడో పెరిగావు ఇక్కడికి వచ్చితివి చైనా ఇది నీకు తగునా కరోనా చరణం; గబ్బిలాల సూపు లొట్టలేసుకు తాగి గబ్బు జబ్బంటించే చైనా ఇల పేరు మోగే కరోనా చరణం; కంటి కునుకూ కరువు కడుపు తిండీ మరపు నూటొకటి కొట్టించే చైనా రాకాసి నీవే కరోనా చరణం;పోలీసు అన్నలకు వైద్యులా సేవలకు విశ్రాంతి కరువులే చైనా బాగుంద ఏమే కరోనా చరణం;శానిటైజర్లంటవ్ మాస్కులనిఅంటావు ఈ బాదుడేంటే చైనా దొరక్క హైరానా కరోనా చరణం;కాళ్ళకీ బంధాలు ఇంటిలో కలహాలు పితలాటకం పెట్టె చైనా సరదాలు దూరం కరోనా చరణం;మమ్మేలు మారాజు మా మోదీసారంట మాదన్నుగా నిలిచె నాయనా మాయమవుతావే కరోనా
Image
పెళ్లి విందు మన ఇంటి పెళ్లి విందు అదిరిపోవాలి!! చూసినవాళ్లంతా ముక్కుమీద వేలేసుకోవాలి!!లేకపోతె ...మొన్నామధ్య మన పక్కింటివాళ్ళు చూడు!!ఓ!! ఇరవై రకాల స్వీట్లు పెట్టామా!!అన్ని కూరలు పెట్టామా!!ఇన్ని కూరలు పెట్టామా!! అంటూ ఏవిటా బిల్డప్పు!! చెవులు చిల్లులు పడిపోయాయనుకో!!వినలేక చచ్చేమ్!! మనం ఓ అరవై రకాలైన పెట్టాలి సుమా!!ఎవ్వరు ఇంతవరకు ఇలా చేయలేదని చెప్పుకోవాలి!! నా సామిరంగా ...వాళ్ళు కుళ్లిపోతుంటె చూడాలి!!ఏవనుకుంటున్నారో మనమంటే!!అలా చేస్తేనే తెలిసేది మనమేంటో!! చాలా చోట్ల జరిగేది ఇదే!!ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ....అదీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఖర్చుతో కూడినది ఈ పెళ్లి విందు.పెళ్లి అనగానే విందు భల్ పసందుగా వుండాలని అనుకోవటం...అతిదులను ఆనందపరచాలని భావించటం మన హిందూ సంప్రదాయం.కానీ!! మరీ రెట్టించే ఉత్సాహం మోతాదుమించి చేయాలనుకోవడం!! అనవసరపు వ్యయం!! బంధుమిత్రులను ఆహ్వానించి ...సంతృప్తిపరచడంలో తప్పులేదు.మనం శుభలేఖల్లోనే ...మా విందు ఆరగించి, తాంబూలం స్వీకరించి, మామ్మానందింపచేయ ప్రార్ధన అంటాము.అది మన మర్యాద.ఏది తినాలో అర్ధంకాని రీతిలో విస్తరి నిండుకోవడమే కాక....వేరే మళ్ళీ సలాడ్లు ,ఐస్క్రీములు, డ...
Image
వృద్ధాప్యం   ఈ అందం, ఈ బింకం, ఈ ఆరోగ్యం ఈ వయసు శాశ్వతమా!!ఊహు!! అందరం వృద్దాప్యం అనుభవించాల్సిందే.తప్పదు. కానీ!! వృద్ధులనేసరికి వాళ్లకి ఆసరాగా నిలిచేవాళ్ళెంతమంది వున్నారు!!మంచి మాటలాడి....మంచి మనసుతో ఆదరించి అక్కున చేర్చుకున్న నాడు పసిపిల్లలై ఎంత పొంగిపోతారో!! అబ్బే!! వాళ్ళు మాట్లాడితే విసుగు, వాళ్ళ చేతలు విసుగు, వాళ్ళు చేసే ప్రతీ పనికి విమర్శలు. ఎంత చిన్నబోతారో కదా!!వృద్ధులు చిన్నపిల్లలతో సమానమంటారు. వాళ్ళని అర్ధం చేసుకొని బాగా  చూసివుంటే ఈనాడు వృద్ధాశ్రమం అన్న పేరే వినిపించకపోనేమో!!ఎక్కడో పుట్టి పెరిగిన కోడలు,అభం శుభం తెలియని మనుమలు, విసుక్కున్నా అర్ధముందేమో కానీ కన్న కొడుకులే ..కఠిన పాషాణ హృదయులైనప్పుడు...ఎవరికి చెప్పుకోవాలి వారి ఆవేదన...ఆ బాధ వర్ణనాతీతం.మనసులో కుమిలిపోతూ,  కడుపు తీపి మమకారం,ఎవరికి అంతుపట్టని ఒక కావ్యం.ప్రేమావాత్సల్యపు సాగరం.ఎంత దుఃఖాన్నైనా భరించే శక్తి ఆ భగవంతుడు ఒక్క తల్లి తండ్రులకు మాత్రమే ఇచ్చాడనుటలో ఏ మాత్రం సందేహం లేదు!!                        పిల్లలే లోకంగా జీవించి, ఆశల కలలు కం...
Image
                                            అసంఘటిత కార్మికులు                                                             కడుపుకింత తిండి, కట్టుకొనబట్ట కరువై, ఆలోలక్షణా అంటూ,ఎలా బతకాలి అని ఆలోచిస్తూ,బాధపడుతుంటే,అమ్మ పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడి,యీలోకంలోకి వచ్చా. అరువుమీద తెచ్చిన సరుకులతో అమ్మ బువ్వ వొండి  వొడ్డించిందే గాని ...తినబుద్ధి కాలే. ఎలాగైనా రేపు పట్నం నుంచ్చి వస్తున్న మావయ్యను కలిసి మాటాడాలి.ఏదో ఒకటి చెయ్యాలి.ఎన్నాళ్లిలా?పంటలు పండక,పనుల్లేక పస్తులతో ఎన్నాళ్ళు?. చదువుకోవాలని వున్నా!! అది నాలాంటి వాళ్లకు జరగని పని!!. అమ్మని, అయ్యని బాధపెట్టకూడదు!! బాగా చూసుకోవాలి అంటే ఇదే మార్గం!!. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా!!మావయ్యని కలుద్దామా!!అన్న ఆలోచనతోనే తెల్లారింది.ఇంటి ముందు ఆగిన అన్ని బస్సుల్నిఅదే పనిగా చూస్తుంటే, ఆ ...
Image
మల్లెతీగ ఆక్రోశం.... రచన; జయప్రభాశర్మ నన్ను ఆకలితో మాడ్చి పండగ చేసుకుంటున్నావా!! మావూరంటూ పరుగులెత్తి వెళిపోతావా!! వినోదాలు విందులతో మునిగి తేలుతున్నావా!! పనివాళ్ళకి చెప్పాలే అనుకుంటున్నావా!! వాళ్ళుకూడా నీకుమల్లే పరుగులెత్తి వెళ్లిపోయారు తెలుసా!! దోసెడు నీళ్లు పోసేవారెప్పుడొస్తారా అని చూస్తున్నా!! ఆహ!! ఒక్కరి జాడైనా కనిపిస్తేనా!! అవును!! నా బాధ మీకెలా తెలుస్తుంది!! మీకవసరమైనప్పుడు కనిపిస్తాను తప్పా!! ఇలాంటి తరుణంలో ఏం గుర్తొస్తానులే!! కవి కలానికి నేనే!!చిత్రకారుని కుంచెకు నేనే!! కమ్మని కావ్యానికి నేనే!!చలనచిత్రానికి నేనే!! ప్రశంసలకి నేనే!! పడతి కురుల నేనే!! పుష్పమాలాంకృతులకు నేనే!!పూజకు నేనే!! పుష్ప ప్రదర్శనకి నేనే!!పుష్పగుచ్ఛాన్ని నేనే!! ప్రతి రోజు స్మరణ నేనే!!స్ఫురణ నేనే!! అటువంటి నన్ను ఏడిపించడం భావ్యమా!! అమ్మ నాకు లేదా!!ఆ కళ్ళ నీళ్లు చూడు!! సమ్మోహనభరితురాలివై మైమరచిపోతావా!! నా సువాసనని ప్రశంసిస్తావా!!ఆఘ్రాణిస్తావా!! మల్లంటే మల్లెని ఎగబడి కోస్తావా!! కనిపిస్తే కాడ విరిచి విజృంభిస్తావా!! నేనుంటే గుబాళింపు!!నేనుంటే మైమరపు!! ఇటుపైన క్షోభ పెట్టకు!! ఆవేశానికి గురి చేయకు!! చారెడు నీళ్ల...
Image
భక్తి గీతం: రచన;జయప్రభాశర్మ. విద్యా ప్రసాదినీ దేవి వీణా పుస్తకధారిణీ నిత్య నామ జప వాగ్దేవీ మనసా స్మరామి భారతీ వసంత పంచమి సరస్వతీ సత్వగుణ సదా పూజయామి "విద్యా" అక్షరాభ్యాస ముహూర్తం ఆనందాన భక్తార్పణం సకలలోక సంపూజితం సర్వకాల సంసేవితం శారదామాత జయంతోత్సవం మాఘమాస శొభోత్సవం "విద్యా" అక్షరా ప్రణవస్వరూపం భాసిల్లు బాసర క్షేత్రం వాణీ వసంత ఉత్సవం ప్రకటిత దిన ప్రాముఖ్యం రతీమన్మధుల ప్రేమోత్సవం చిగురు పూతల ప్రకృతోత్సవం "విద్యా"
Image
రైతు వ్యధ జీన్స్ పేంట్లు, టీషర్టులు, కళ్లద్దాలు, షూలు, చేతిలో ఖరీదైన ఫోను మాకు తెలీదు.మాకు తెలిసిందల్లా...మావూరు,మాభూమి,మాగాలి,మానీరు మాత్రమే.మనసు నిర్మలం.మాటల తీపితనం. కష్టనష్టాలెదురైనా నవ్వుతు తిరిగే నైజం. ఉపకారమంటే మేమున్నాం అనే తత్వం. మరి అలాంటి మాకు....ఎంత ఓర్పు వహిస్తున్నా,జరుగుబాటులేని పరిస్థితి. కడుపునిండా తిండి, కట్టుకొన బట్ట ఉంటే చాలనుకున్నా, అదే కరువంటే నమ్ముతారా!!. తాతలనాటి నుంచి మట్టిని నమ్ముకొని బతుకు వెళ్లదీస్తున్న వాళ్ళం.  మాకు హంగులు ఆర్భాటాలు తెలియవు.ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తున్న రైతుబిడ్డలం.ఇంటిల్లిపాది రాత్రనక, పగలనక కష్టపడి, అప్పులు చేసి మదుపు పెట్టి, ఎప్పుడు పంట చేతికొస్తుందా, అని వేయికళ్లతో ఆశగా ఆకాశంవైపు చూస్తుంటే....కరుణించని వరుణుడు.గుండెలో ఒకటే గుబులు. ఆకలివేయక,నిద్రపట్టక రేపన్నది ఎలా గడుస్తుందో తెలియని అయోమయం.వాన చినుకు రాకకై అలుపులేని చూపులు.కనిపించిన దేవుళ్ళకు,మొక్కులు,పూజలు. ఇంటి యిల్లాలు సైతం బిందెలతో నీళ్లు తెచ్చి పంటను తడిపే ప్రయత్నం.అలసట తెలియని కష్టం..వాళ్ళు పడుతున్న యాతన చూస్తే ఒక్కోసారి కళ్లనీళ్లు ఆగవు.ఒడిదుడుకులు తట్టుకొనే ఇల్లాలు,పిల్లలు...
డ్యూయెట్ లిరిసిస్ట్,జె.పీ.ఎస్. అతడు; ఏదోలా వుందే ఏదెదోలావుందే నిను చూసినవేళా నాలో ఇంకేదో అవుతోందే ఆమె; ఏంటో అనుకుందే యింకేంటో అనుకుందే చిరునవ్వులకర్ధం నీలో అది ఏంటో తెలిసిందే చరణం; అతడు; నా తలపుల వలపుల గమకం తియ తియ్యని తేనెల మధురం ఆమె; నా మనసున నిలిచిన ప్రణయం చల చల్లగ తాకిన పవనం అతడు; అనుకోని ఆరాటం అందిస్తా ఆహ్వానం ఆమె; ఇక లేదే ఆషాడం మరి రేపే తాంబూలం '' ఏదోలా' చరణం ఆమె; నా కనులకు కలలకు సాక్ష్యం ప్రేమాంకిత మృధు భావం అతడు; నా తనువుకు తపనకు మూలం నును సిగ్గుల నీ వదనం ఆమె; మది చేసే విన్యాసం మురిపించే రస నాదం అతడు; అరుదెంచే కార్తీకం ఆనందం మన సొంతం 'ఏదోలా'
https://www.facebook.com/prabha.sharma.756412/videos/vb.100008035569571/1991897737754726/?type=3&theater
Image
"VAMMO NORU" ఏదైనా చెయ్యగల సమర్ధత,ఎంతకైనా తెగించే దుడుకు స్వభావం, కత్తికైనా లేని పదును, మాటల తూటాని,మరో ఆయుధాన్ని. దేనికైనా తాళాలు వున్నాయి గాని...మనకి!!అబ్బే!! ఎవ్వరి తరం కాదు!!. నీ వాగుడు వరద ఆపవే బాబు!!నువ్వెవరో చెప్పి ఏడు!!....అదే మరి!!చెబుతున్నా!!వినండి!!మీ నోరుని!!అడ్డు అదుపు లేనిదాన్ని!!.నెలల పిల్ల నుంచి బెంగ పడిపోతూంట్టారు.ఎక్కడ మాటలు రావో అని.వస పోసేసేవాళ్ళు కొందరైతే,వైద్యుల దగ్గరకు మోసుకెలిపేవాళ్లు కొందరు.అమ్మ!!అని పిలుపు వింటే చాలు.ఉత్సాహంతో ఉరుకులు, పరుగులు, అడిగిన వాళ్లకి, అడగనివాళ్ళకి చెప్పుకొని...ఓ..ఎంత మురిసిపోతారో. ఇంక అక్కడ్నుంచి ఉంటాయి  రకరకాల జిమ్మిక్కులు.ఇహ వున్నత స్థానానికి తీసుకెళ్లాలన్న, పతనం చేయాలన్న, మనదే ఆపరేషన్ అంతా.మాట అన్నది మణి మాణిక్యాలకన్నా విలువైనది.మాయల ఫకీరు చిలక ప్రాణంలా మనమే మూల కారణం.పాతాళానికి తోయవేయబడ్డారంటే మనదే ఆ ఘన కార్యం. అందుకే అంటారు నోరా!!తేమాకే వీపుకి!! అని. అయినా విని ఏడిస్తేగా!!. బాధ పడితే గాని బోధపడదని!!.పదిమందిలో మాట్లాడాలంటే మామూలు విషయమా?.....చక్కని పలుకు పలికి,తీయటి మాట్లాడొద్దని అన్నానా?. అయ్యో!!అయ్యో!!ఎంత మాటనేస్...
Image
మెట్టు భూమి, రచన జె.పీ.ఎస్. వానతల్లి నీకు దండమే కరుణించి చల్లగ కురియవే జోరువాన నీకోసమే పడిగాపులూ పడుతున్నమే పరుగులెత్తి మాకోసమే కురిసి పచ్చని పంటలనివ్వవే భూమి తల్లినీ నమ్మినం చెమట ధారపోసి బతికినం కన్నీళ్ల కష్టాన్ని చూసినం కడుపుకింత తిండి మరిచినం బీటలోరి భూమి బద్దలై బాధఒడిసిపట్టి మరి ఏడ్సినం ఉన్నఊరినీ వదిలినం తప్పదంటు పట్నమెల్లినం మెట్టభూమికి దండమెట్టినం మెతుకుకోసమై వెతికినం మల్లి రావాలంటు మొక్కినం ఇహ కాని వూరు బండి ఎక్కినం
Image
నాగులచవితి,రచన,జె.పీ.ఎస్. కార్తీక మాసం వచ్చింది కన్నుల్లో వెలుగు తెచ్చింది నాగన్న పండగ వచ్చింది నాగులచవితి రోజు ఇది తొలి ఝామునే నిద్ర లేచాము తలార స్నానం చేసాము ముంగిట కళ్ళాపి చల్లాము ముత్యాల ముగ్గులు పెట్టాము పూలు ఫలములు పూజాద్రవ్యాలు ఏరికూర్చి మేముంచాము చిమ్మిలి దంచి ఉంచాము చలిమిడి ఉండలు చేసాము నాగులగావంచ తెచ్చాము నాగేంద్ర నీకు మొక్కాము వడపప్పుపానకం నారీకేళము పుట్టనుంచి నిను కొలిచాము నాగేశ్వర నిన్ను తలచాము మా మనమ్మునా నిలిపాము చిన్న పెద్ద తరలొచ్చాము శివాభరణ పూజించాము అగరుబత్తులు సీమటపాసులు కాల్చి మురిసి తరియించాము