కొరోనా హైరానా
రచన,ప్రభాశర్మ.
ఒడ్డున పడ్డ చేపపిల్లలా!!
ఎందుకలా గింజుకుంటున్నావు గిల గిలా!!
కొన్నాళ్ళు ఓర్మి వహించి చూడు!!
ఆపైన సంతోషం నీ సొత్తు ఆలోచించు!!
రాకాసి కొరోనా కాటువేయుటకు!!
మాటు వేసి ఉందని గమనించు!!
సరదాల కన్నా శ్వాస గొప్పదని తెలుసుకో!!
నిర్లక్ష్యాన్నివిడనాడి నీ లక్ష్యాన్ని గుర్తుచేసుకో!!
నీ ఇల్లే సరిహద్దని విసుగు చెందమాకు!!
కరిగిపోయే కాలాన్ని ఒడిసిపట్టె వీలులేదు!!
అరనిమిషం జారనీక ఆనందం పట్టుకో!!
ఉరుకు పరుగు జీవితాన విశ్రాంతికి దూరం!!
అనురాగపు ఊయలలో ఊగులాడు అవకాశం!!
వదులుకోకు సంతసాన్ని ఇది నీ క్షేమం కోసం!!
కబళించే కొరోనాకి చెప్పాలి గుణపాఠం!!
అందుకే మనముండాలి ఇంటికే పరిమితం!!
సమర్థతతో సాధించు కబళించే కొరోనాని!!
గజ గజ వణుకుతు పోదా కొరోనా మన దేశాన్ని!!
హమ్మయ్య అని చేస్తావులే సంబరాన నాట్యాన్ని!!


Comments

Popular posts from this blog

Articles