వామ్మో కరోనా
 రచన,ప్రభాశర్మ..
పల్లవి; ఎక్కడో పుట్టావు
ఎక్కడో పెరిగావు
ఇక్కడికి వచ్చితివి చైనా
ఇది నీకు తగునా కరోనా
చరణం; గబ్బిలాల సూపు
లొట్టలేసుకు తాగి
గబ్బు జబ్బంటించే చైనా
ఇల పేరు మోగే కరోనా
చరణం; కంటి కునుకూ కరువు
కడుపు తిండీ మరపు
నూటొకటి కొట్టించే చైనా
రాకాసి నీవే కరోనా
చరణం;పోలీసు అన్నలకు
వైద్యులా సేవలకు
విశ్రాంతి కరువులే చైనా
బాగుంద ఏమే కరోనా
చరణం;శానిటైజర్లంటవ్
మాస్కులనిఅంటావు
ఈ బాదుడేంటే చైనా
దొరక్క హైరానా కరోనా
చరణం;కాళ్ళకీ బంధాలు
ఇంటిలో కలహాలు
పితలాటకం పెట్టె చైనా
సరదాలు దూరం కరోనా
చరణం;మమ్మేలు మారాజు
మా మోదీసారంట
మాదన్నుగా నిలిచె నాయనా
మాయమవుతావే కరోనా

Comments

Popular posts from this blog

Articles