నేనే కొరోనా
రచన, ప్రభాశర్మ.
ఎన్ని దేశాలు తిరిగానో,ఎంతమందిని పొట్టన పెట్టుకున్నానో, పిట్టలు రాలినట్టు రాలుతుంటే, ఏమానందించానో, మరణమృదంగం మోగించిన ఘనత నాది.వామ్మో!! ఈ భారతదేశంలో మాత్రం నా పప్పులుడకటం లేదు.ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.వీళ్ళ శుభ్రతలేంటి, వీళ్లేంటీ, నాతరం కావడం లేదమ్మా. అడుగడుగునా నీళ్ళంటారు, చెయ్యి కడిగితే నీళ్లు,ఒళ్ళు కడిగితే నీళ్లు,మల,మూత్ర విసర్జనకు నీళ్లు. అరె!!వీళ్ళకి టిష్యులు గిష్యులతో పనిలేదు.పోనీ!! ఆ మందు, చిందులుంటాయా అంటే అబ్బే!! వాటి పొడ అంటే గిట్టని వాళ్ళు ఎంతమందో. మాంసాహారులకంటే,శాఖాహారుల శాతమే అత్యధికంగా కనబడుతున్నారు. ఇహ మనమేం చెయ్యగలం.అప్పటికీ అల్లుకుపోదామని, ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నించా.ఫలించేటట్టులేదు.నాకు తెలుసు!!భారతీయుల సంగతి.వద్దనుకుంటునే ఈ దేశంలో అడుగు పెట్టేసా.అమ్మో!! అమ్మో!! వీళ్ళ పూజలు బంగారం కాను!!రామాయణాలట,భారతాలట, పవిత్రజలాలట, పుణ్యభూమిఅట, పుణ్యదేశమట.ఆ సమైఖ్యత,ఆ సఖ్యత చూస్తుంటే గుండె గుబులు పుడుతోంది.నన్ను వెంటతగిలేదాకా నిద్రపోరని నాకు తెలిసిపోయింది.భారతదేశ ప్రధానమంత్రి శ్రీ.మోదీగారు కంటిమీద కునుకు లేకుండా దేశప్రజల రక్షణ కోసమై పరితపించుట చూస్తే, నాకే వెళిపోతే బాగుండు అనిపిస్తోంది.ఇంకా పట్టువదలకుండా చూస్తున్న.అబ్బే!! నా పని అయేటట్టు లేదు!!మర్యాద నిలబెట్టుకొని అతి తొందరలో వెళిపోతే ఉత్తమం.భవిష్యత్తులో ఇలాంటి వెర్రి పని ఎప్పుడు చెయ్యబోను. చేస్తే మాత్రం!!ఇదిగో!!ఇలాంటి పరిణామమే ఎదుర్కోవాల్సొస్తుంది!!బాబోయ్!!మీ దేశానికి శతసహస్ర దండాలమ్మ!!ఈ రాకాసి కొరోనాకి భయపడి,రైతుబజార్లని,చుట్టాలని,సరదాలని,సందళ్ళని,వెళ్ళకండి,దయచేసి నేనే చెబుతున్న రావద్దని.నే చేసిన తప్పిదానికి నేనే నాలిక్కరుచుకుంటున్న.అతి తొందరలో మరలిపోతున్న.......ఇట్లు,తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టమని చెబుతున్న, కంటికి కనిపించని, మీది కానీ కొరోనా.

Comments

Popular posts from this blog

Articles