గజరాజు ఆత్మ ఘోష

ఏనుగమ్మ ఏనుగు... ఏవురొచ్చిందేనుగు...మా ఊరొచ్చిందేనుగు...మంచినీళ్లు తాగిందేనుగు అంటూ ఎంత బాగా లాలిస్తూ మీ బుజ్జి పాపాల్ని ఆడిస్తారో కదా.నోరులేకపోయినా, నేను మీలా పాడలేకపోయినా, నా బిడ్డకోసం ఎన్నో కలలు కన్నా.కానీ కానరాని దూరతీరాలకి నన్ను సాగనంపారు బిడ్డతో సహా.నేనేం చేశానని?.నిండు గర్భిణిని అని చూడకుండా క్రూరాతిక్రూరంగా నన్ను మట్టుబెట్టారు.పండుని ఎర చూపిప్రాణాలు తీశారు. మనసు ఎలా ఒప్పిందో.నేను వస్తే చాలు. దీవెనలందించమంటారు.నన్ను చూస్తే చాలు ముచ్చట పడి , నన్ను అదే పనిగా తడిమి,తడిమి ఎంతో ఆనందపడతారు.నన్ను దైవంశసంభూతురాలిగా కొలుస్తారు.ఆశీస్సులందించటమే కానీ హానీ తలపెట్టని నైజం నాది.అలాంటి నన్ను హతమార్చడం భావ్యమేనా?. ఆనందంగా తిందామన్న పండు ప్రాణం తీస్తుందని తెలిసుంటే,తినేదాన్ని కాదు.బాధతో నరకయాతన పడుతున్నా,ఆలోచిస్తున్నది నా కడుపులో దాగున్న నా బిడ్డకోసం, నా కడుపున ఎందుకు పడ్డావు అని.ఎవరైనా వస్తే బావుండు, రక్షిస్తే బావుండు అని ఒకటే ఎదురుచూపులు.బాధని తట్టుకోలేక నీళ్లమడుగులో దిగి శోకసంద్రంలో మునిగిపోయిన నాకు.నా వేదన అరణ్యరోదనగా మిగిలిపోయింది.నాడు విష్ణుమూర్తి మొసలిభారినుంచి కాపాడగలిగిన,నేడు  ఎందుకో ఎంత వేడిన కరుణించలేకపోయాడు.ఎంత ఏడ్చానో నా బిడ్డని తలచుకొని,తలచుకొని.ఏడ్చి,ఏడ్చి ఆఖరికి నా కళ్ళు మూతలుపడ్డాయి.దూరతీరాలకి పయనమని తెలిసిపోయింది.మూసిన నా కళ్ళు మరి తెరుచుకోలే.స్వర్గంలో అడుగుపెట్టగానే స్వామివారిని ఏడుస్తూ ప్రశ్నించా.నా మొర ఆలకించలేదేమని.ఈ సృష్టిలో అన్ని ప్రాణులతోపాటు  అతి తెలివైన ప్రాణి ఐన మానవుని సృష్టించినది కూడా నేనే.మాట్లాడే శక్తి కూడా ఇచ్చిన నా తప్పిదానికి మదనపడుతున్న వేళ.  ఆ ఆలోచనలో ఉండగా రక్షించలేకపోయాను. ఇలాంటి దుర్మార్గానికి  ఒడి కడతారా?వారిని శిక్షించే రోజు వస్తుంది ఎదురుచూడుము అనీ అన్నప్పుడు కూడా ఏ విధమైన కోపం రాలేదంటే నమ్ముతారా?.అందరి బాగు కోరుకొనేదాన్ని,మీరు ఆనందపడితే పొంగిపోయేదాన్ని.క్షుద్బాధ తట్టుకోలేక ఎప్పుడైనా పంటకొచ్చి తిన్నానేమో గాని ఎటువంటి అపకారం చేయనిదాన్ని.

                     కొందరివల్ల పాపం అందర్నీ అనాల్సిన పనిలేదు.ఎందరేడుస్తున్నారో నన్ను తలచుకొని.కేరళ ప్రభుత్వం వారు ఎంత ఆగ్రహిస్తున్నారో,ఇలాంటి దారుణానికి ఒడికట్టినవారిని శిక్షించాల్సిందేనని.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరెప్పుడు జరగకూడదని కోరుకుంటున్న.నోరులేని మూగప్రాణులను హింసించి పైశాచికానందం పొందటం,మట్టుపెట్టటం చేయకూడదని వేడుకుంటున్న.మాపై ఆశతో, ధన వ్యామోహంతో, మా దంతాలను ఊడపెరుకుట చేయవద్దని మనవి చేసుకుంటున్న.సహృదయంతో అర్ధంచేసుకుంటారని ఆశీస్తున్న.పశ్చాత్తాపంతో నాకు ప్రాణహాని తలపెట్టినవారు  మారాలని,ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకూడదని ఆశ  పడుతున్నా. మమకారం చూపించకపోయిన పర్లేదు.మట్టుపెట్టకండేం.నాకోసం ఎంతో బాధపడుతూ కన్నీళ్లపర్యంతమవుతున్న వారందరికీ, ఉబికివస్తున్న కన్నీరునాపుకుంటూ, మనసారా ఆశీర్వదిస్తున్న,తిరిగిరాని లోకాలకేగిన ...మీ గుండెల్లో కొలువైన మీగజరాజు. 

Comments

Popular posts from this blog

Articles