పెళ్లి విందు

మన ఇంటి పెళ్లి విందు అదిరిపోవాలి!! చూసినవాళ్లంతా ముక్కుమీద వేలేసుకోవాలి!!లేకపోతె ...మొన్నామధ్య మన పక్కింటివాళ్ళు చూడు!!ఓ!! ఇరవై రకాల స్వీట్లు పెట్టామా!!అన్ని కూరలు పెట్టామా!!ఇన్ని కూరలు పెట్టామా!! అంటూ ఏవిటా బిల్డప్పు!! చెవులు చిల్లులు పడిపోయాయనుకో!!వినలేక చచ్చేమ్!! మనం ఓ అరవై రకాలైన పెట్టాలి సుమా!!ఎవ్వరు ఇంతవరకు ఇలా చేయలేదని చెప్పుకోవాలి!! నా సామిరంగా ...వాళ్ళు కుళ్లిపోతుంటె చూడాలి!!ఏవనుకుంటున్నారో మనమంటే!!అలా చేస్తేనే తెలిసేది మనమేంటో!!
చాలా చోట్ల జరిగేది ఇదే!!ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ....అదీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఖర్చుతో కూడినది ఈ పెళ్లి విందు.పెళ్లి అనగానే విందు భల్ పసందుగా వుండాలని అనుకోవటం...అతిదులను ఆనందపరచాలని భావించటం మన హిందూ సంప్రదాయం.కానీ!! మరీ రెట్టించే ఉత్సాహం మోతాదుమించి చేయాలనుకోవడం!! అనవసరపు వ్యయం!! బంధుమిత్రులను ఆహ్వానించి ...సంతృప్తిపరచడంలో తప్పులేదు.మనం శుభలేఖల్లోనే ...మా విందు ఆరగించి, తాంబూలం స్వీకరించి, మామ్మానందింపచేయ ప్రార్ధన అంటాము.అది మన మర్యాద.ఏది తినాలో అర్ధంకాని రీతిలో విస్తరి నిండుకోవడమే కాక....వేరే మళ్ళీ సలాడ్లు ,ఐస్క్రీములు, డ్రైఫ్రూప్ట్స్ ...అబ్బో!!ఒకటా రెండా!!ఇహ తిన్నంత తిని మిగతావి ఎంచక్కా వీధిపాలే!!పూటకి మెతుకులేని అభాగ్యులెందరో!!.
రెక్కాడితేగాని డొక్క నిండని బతుకులెన్నో!! గంజి నీళ్లతో కడుపునింపుకుని, పంచభక్ష్య పరమాన్నాలుగా భావించేవారెందరో!! కావలసినంత వేయించుకొని పోపుగింజ తప్ప ఏదీలేకుండా తిని...విస్తరి చూస్తే కడిగినట్టు ఉండేలా తింటే ఎంత బాగుంటుందో కదా!!ఒక వేళ మిగిలితే ఇలాంటి వారికోసం వెతుక్కొని వెళ్లి ఇచ్చిన తప్పులేదు. కానీ!! అలా చేసేవారెంతమంది!!అన్నం పరబ్రహ్మం!!దూషించకూడ దంటారు.నిజమే!!మరి ఇదేంటి!!అనవసరపు ఖర్చు పెట్టి, ఆర్భాటాలకు పోయి, తిన్నంత తిని అవతల పారేయటం ఎంతవరకు సమంజసం!! ఇది ఒక్కసారి ఆలోచిస్తే,నిజమే అనిపిస్తోంది కదూ!!.
అందుకే ఆమధ్య చేసిన సర్వేలో ఇండియాలోనే ఎక్కువగా ఫుడ్ వ్యర్థం చేస్తున్నారని..దక్షిణాదిన ఎక్కువగా ఉందని, అదీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మరీ విపరీతంగా ఫుడ్ పేరుతొ అత్యధిక ఖర్చు పెడుతున్నారని తెలిసి చాలా ఆశ్చర్యపోవటం జరిగింది. అందుకే!! ఎంత పెట్టాలో అంతే చూసుకొని ఖర్చు పెడితే, ఎంత బాగుంటుందో!!.ప్రతివారి జీవితంలో ఒక్కసారి జరిగేది పెళ్లి మాత్రమే!!.పండగలు,పబ్బాలు,పుట్టినరోజులు వస్తూనేవుంటాయి.కానీ!!మరువలేని రోజు!!మధురమైన రోజు!!మరి అలాంటి పెళ్లి వేడుకను....ఆనందంగా జరుపుకోవచ్చు.ఆర్భాటం మాత్రం తగదు!! ఒకవేళ అన్నిరకాల వంటలతో ఆనందపరచాలని చూసిన...దయచేసి ప్రతీ మెతుకు విలువతెలుసుకొని .....పారవేయకుండా...పేదవారి కడుపునింపితే బాగుంట్టుందని నా అభ్యర్ధన....ఇటుపైన ఆచరిస్తారని అందరు ఆశిస్తూ.....సోదరి జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles