మల్లెతీగ ఆక్రోశం.... రచన; జయప్రభాశర్మ
నన్ను ఆకలితో మాడ్చి పండగ చేసుకుంటున్నావా!!
మావూరంటూ పరుగులెత్తి వెళిపోతావా!!
వినోదాలు విందులతో మునిగి తేలుతున్నావా!!
పనివాళ్ళకి చెప్పాలే అనుకుంటున్నావా!!
వాళ్ళుకూడా నీకుమల్లే పరుగులెత్తి వెళ్లిపోయారు తెలుసా!!
దోసెడు నీళ్లు పోసేవారెప్పుడొస్తారా అని చూస్తున్నా!!
ఆహ!! ఒక్కరి జాడైనా కనిపిస్తేనా!!
అవును!! నా బాధ మీకెలా తెలుస్తుంది!!
మీకవసరమైనప్పుడు కనిపిస్తాను తప్పా!!
ఇలాంటి తరుణంలో ఏం గుర్తొస్తానులే!!
కవి కలానికి నేనే!!చిత్రకారుని కుంచెకు నేనే!!
కమ్మని కావ్యానికి నేనే!!చలనచిత్రానికి నేనే!!
ప్రశంసలకి నేనే!! పడతి కురుల నేనే!!
పుష్పమాలాంకృతులకు నేనే!!పూజకు నేనే!!
పుష్ప ప్రదర్శనకి నేనే!!పుష్పగుచ్ఛాన్ని నేనే!!
ప్రతి రోజు స్మరణ నేనే!!స్ఫురణ నేనే!!
అటువంటి నన్ను ఏడిపించడం భావ్యమా!!
అమ్మ నాకు లేదా!!ఆ కళ్ళ నీళ్లు చూడు!!
సమ్మోహనభరితురాలివై మైమరచిపోతావా!!
నా సువాసనని ప్రశంసిస్తావా!!ఆఘ్రాణిస్తావా!!
మల్లంటే మల్లెని ఎగబడి కోస్తావా!!
కనిపిస్తే కాడ విరిచి విజృంభిస్తావా!!
నేనుంటే గుబాళింపు!!నేనుంటే మైమరపు!!
ఇటుపైన క్షోభ పెట్టకు!! ఆవేశానికి గురి చేయకు!!
చారెడు నీళ్లు పోయి!!చాటెడు పూలిస్తా!!
చల్లని గాలిస్తా!!చక్కని దీవెనందిస్తా!!

Comments

Popular posts from this blog

Articles