అసంఘటిత కార్మికులు
కడుపుకింత తిండి, కట్టుకొనబట్ట కరువై, ఆలోలక్షణా అంటూ,ఎలా బతకాలి అని ఆలోచిస్తూ,బాధపడుతుంటే,అమ్మ పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడి,యీలోకంలోకి వచ్చా. అరువుమీద తెచ్చిన సరుకులతో అమ్మ బువ్వ వొండి వొడ్డించిందే గాని ...తినబుద్ధి కాలే. ఎలాగైనా రేపు పట్నం నుంచ్చి వస్తున్న మావయ్యను కలిసి మాటాడాలి.ఏదో ఒకటి చెయ్యాలి.ఎన్నాళ్లిలా?పంటలు పండక,పనుల్లేక పస్తులతో ఎన్నాళ్ళు?. చదువుకోవాలని వున్నా!! అది నాలాంటి వాళ్లకు జరగని పని!!. అమ్మని, అయ్యని బాధపెట్టకూడదు!! బాగా చూసుకోవాలి అంటే ఇదే మార్గం!!. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా!!మావయ్యని కలుద్దామా!!అన్న ఆలోచనతోనే తెల్లారింది.ఇంటి ముందు ఆగిన అన్ని బస్సుల్నిఅదే పనిగా చూస్తుంటే, ఆ పక్కనే ఆగిన లారీలోంచి దిగాడు మావయ్య.ఆప్యాయంగా పలకరించి,హత్తుకొని ఇంటిలోకి తీసుకెళ్లి,మావయ్యకిష్టమైనవి చేసిపెట్టి, దగ్గరుండి తినిపించి,కొసరి కొసరి వడ్డించి ఎంతో పొంగిపోయింది అమ్మ. అమ్మ చూపించిన అభిమానానికి,తెగ సంబరపడిపోయి,అయ్య ఏసిన నులకమంచం మీద నడుం వాల్చి, మాట్లాడుతుండగా,పడుతున్న ఇబ్బందులు గురించి చెప్పడం,అది విని మావయ్య బాధపడుతుండగా,టక్కున మధ్యలో దూరి!! మావయ్య!! నీతో నే కూడా పట్నమొస్తాను!!మేస్త్రివి కదా!! తీసుకెళ్ళావా!!పనిచేస్తాను అన్నాను.ఈ వయసులో చాలా కష్టం ఇటుకలు,సిమెంట్లు మొయ్యాలి!!వద్దు గాక వద్దు....అని చెప్పినా మొండికేసి....నే వస్తాను మావయ్య!! అనే సరికి కాదనలేకపోయాడు.అది కాదులే...వేరే వుద్యోగం సంపాదిస్తాలే.....అని అమ్మకి చెప్పేసరికి...వెర్రిబాగులది...నమ్మేసింది. ఆ మర్నాడే మావయ్యతో పయనమయేసరికి!! అమ్మ నన్ను పట్టుకేడిస్తే....ఎంతో దుఃఖంతో అమ్మని అయ్యని వదలి వెళ్లలేక...తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది.చిల్లులున్న సంచీలో నాకున్న రెండు జతలు, ముందు రోజు మావూరి దర్జీ దగ్గర చిరుగులుంటే కుట్టించుకున్నవి.ఎక్కడనుంచి తెచ్చిందో,ఎలా గిచ్చిందో అమ్మ మావయ్యకి ప్రేమగా యిచ్చిన అప్పడాలు,పిండివడియాలు,ఖారం,చింతపండు కలిపి కట్టిన మూట పట్టుకొని బస్సెక్కి మావయ్యతో....పట్నంలో దిగేసరికి...ఎప్పుడు చూడని స్వర్గంలా అనిపించి ఆనందం చెందేటంతలో.....అమ్మ,అయ్య గుర్తుకొచ్చి ఏడుపొచ్చి,గుండె బరువెక్కింది.నా మొహం చూసిన మావయ్య, గ్రహించుకొని,ధైర్యం చెప్పి,దగ్గరుండి భోజనం తినిపించి,నిద్రపొమ్మన్నాడు.రాత్రంతా కంటిమీద కునుకుంటే ఒట్టు. తెల్లారి లేవగానే బోరింగ్ దగ్గర కెళ్ళి స్నానం చేసి బువ్వ తిని మావయ్యతో వెళ్లి పెద్దాయన్ని కలిస్తే.వెంటనే పనిలోకి తీసుకొని!! వెళ్ళమంటే!!ఎప్పుడు సాయంత్రం అవుతుందా!! అని యెంత కష్టమైనా తెలీకుండా ఎదురుచూసేసరికి,పెద్దాయన పిలుపు రానే వచ్చింది. డబ్బులు చేతిలో పెట్టేసరికి,మాటల్లో చెప్పలేని సంతోషం.రోజులు గడుస్తూనేవున్నాయి.కొన్ని నెలలు తరువాత అమ్మకి డబ్బులు పంపించేసరికి,తన కొడుకు పట్నంలో,బాగా సంపండిస్తున్నాడనే భావన కలిగి,కళ్లారా చూద్దామని పట్నం వచ్చేసరికి,మావయ్యకి నోట మాట రాక, ఏం చెప్పాలో తెలియక, అయోమయంగా చూస్తూ వుండిపోయాడు.అంతలోనే తమాయించుకొని,నాగురించి బాగా చెప్పేసరికి ఎంతో తృప్తి చెంది,తెగ సంబర పడిపోయింది.పొద్దున్న లేస్తూనే చక చకా తయారై పనికి వెళ్తే ఆనందంగా చూస్తూ సాగనంపింది.మధ్యాహ్నం అయేసరికి ...మండుటెండలో చెప్పా పెట్టకుండా,నే పనిచేస్తున్న భవంతి దగ్గరకొచ్చి చూస్తే,కనిపించకపోయేసరికి,అక్కడున్న వారిని అడిగితె,చెప్పారట.అడుగో!! అక్కడ!!అని. చూస్తే!!పన్నెండవ అంతస్తు!!కేకలేసిన వినిపించని ఎత్తు!! కిందనుంచి చూస్తే చిన్న బొమ్మలా కనిపించేసరికి!!అన్ని అంతస్తుల భవంతిలో ఉద్యోగమని అనుకున్నాను గాని....యిలపింటిదని తెలవనీదు, అక్కడకానుంచి పడితే ఏటైనా ఉందా?...అని ఆలోచిస్తుండగా,నే వెళ్లేసరికి,నన్ను చూసి పట్టుకొని బోరున ఏడుస్తూ.....మనూరు వెళ్లిపోదామని ఒకటే గొడవ.లేదమ్మా!!ఇప్పుడు అసంఘటిత కార్మికుల కోసం యూనియన్లు,ఇన్స్యూరెన్సులు, ఎన్నో మరెన్నో ప్రభుత్వం కల్పించిందమ్మా!! బాధపడకు....అంటూ ఓదార్చేసరికి తమాయించుకొని, నా మాటలన్నీ సాంతం విని...నాకన్ని జాగ్రత్తలు చెప్పి మా వూరికి తిరుగు పయనం ఐంది....పండక్కోస్తాలే అని లేని నవ్వు పులుముకుంటూ సాగనంపా.కష్టమే యిష్టన్గా బతుకుతున్న కష్టజీవులం.ఒంటిలో నలతగున్నా,డబ్బులొస్తాయన్న ఆశ.కడుపుకింత తిండి దొరికితే చాలు అన్న తృప్తి. నా గోడు వెళ్ళగక్కి,విసిగించినందుకు మన్నించండి.....నా బాధ అలాంటిది మరి......ఉంటానండి....ఇట్లు..మీ అసంఘటిత కార్మికుడు. రచన,జయప్రభాశర్మ.

Comments
Post a Comment