రైతు వ్యధ
జీన్స్ పేంట్లు, టీషర్టులు, కళ్లద్దాలు, షూలు, చేతిలో ఖరీదైన ఫోను మాకు తెలీదు.మాకు తెలిసిందల్లా...మావూరు,మాభూమి,మాగాలి,మానీరు మాత్రమే.మనసు నిర్మలం.మాటల తీపితనం. కష్టనష్టాలెదురైనా నవ్వుతు తిరిగే నైజం. ఉపకారమంటే మేమున్నాం అనే తత్వం. మరి అలాంటి మాకు....ఎంత ఓర్పు వహిస్తున్నా,జరుగుబాటులేని పరిస్థితి. కడుపునిండా తిండి, కట్టుకొన బట్ట ఉంటే చాలనుకున్నా, అదే కరువంటే నమ్ముతారా!!. తాతలనాటి నుంచి మట్టిని నమ్ముకొని బతుకు వెళ్లదీస్తున్న వాళ్ళం. మాకు హంగులు ఆర్భాటాలు తెలియవు.ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తున్న రైతుబిడ్డలం.ఇంటిల్లిపాది రాత్రనక, పగలనక కష్టపడి, అప్పులు చేసి మదుపు పెట్టి, ఎప్పుడు పంట చేతికొస్తుందా, అని వేయికళ్లతో ఆశగా ఆకాశంవైపు చూస్తుంటే....కరుణించని వరుణుడు.గుండెలో ఒకటే గుబులు. ఆకలివేయక,నిద్రపట్టక రేపన్నది ఎలా గడుస్తుందో తెలియని అయోమయం.వాన చినుకు రాకకై అలుపులేని చూపులు.కనిపించిన దేవుళ్ళకు,మొక్కులు,పూజలు. ఇంటి యిల్లాలు సైతం బిందెలతో నీళ్లు తెచ్చి పంటను తడిపే ప్రయత్నం.అలసట తెలియని కష్టం..వాళ్ళు పడుతున్న యాతన చూస్తే ఒక్కోసారి కళ్లనీళ్లు ఆగవు.ఒడిదుడుకులు తట్టుకొనే ఇల్లాలు,పిల్లలు. కనీసం మంచి రోజుల సంగతి ఎలా వున్నా...అప్పులపాలవకుండా,ఉల్లిపాయతో గంజన్నం అయినా పెట్టగలనా? అన్న అనుమానం.అదే వర్షాలు బాగా పడితే? నా అంత ధనవంతుడు ప్రపంచంలోనే ఉండడేమో అన్నంత ఆనందం కదా!!పంట చేతికిరాగానే ...పట్నం తీసుకెళ్లి పిల్లలకి సినిమా చూపించాలి,ఇంటావిడకి మంచి పువ్వుల కోక కొనాలి, ఆల్లు నవ్వుతుంటే చూడాలి.అదే నా ఆశ.ఈ చిన్న కోరిక కూడా ఆ భగవంతుడు తీరుస్తాడా?అన్న అనుమానం.పల్లం భూముల్లోళ్ళని చూస్తే....ఎంత అదృష్టవంతులో అని అనిపిస్తుంది.లేకపోతె మరేంటి....కాల్వని చూస్తుంటే నిండుగర్భిణి గుర్తొస్తుంది. అంత అందంగా ఉంటుంది.మెట్టభూమి బతుకులింతే కదా మరి!
చూస్తుండగా రోజులు గడచిపోయాయి.ఒక్క వాన చినుకు పడితే ఒట్టు.భూమి బీటలువారి, పంట నాశనమై,ఏమి తోచని స్థితిలో....అప్పులు ఎలా తీర్చాలో బెంగ పెట్టుకుంటున్న తరుణంలో... తెలిసిన దూరపు బంధువు, భుజం తట్టి ఇచ్చిన సలహా.....పట్నానికి పయనమవమని....ఏదైనా పని దొరుకుతుందని,భయమేది లేదని, నేనున్నానని భరోసా ఇచ్చేసరికి,ఒక్కసారి దైర్యం వచ్చి,అంతలోనే మాయమైంది.కారణం.....మావూరు,మామట్టి, మామనుషులు...గుర్తుకొచ్చి కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి.అక్కడెవరున్నారని?ఎవరుచూస్తారని?.ముక్కు మొహం ఎరుగని వాళ్ళ మధ్య ఎలా ఉండగలం.
అయినా తప్పదు కదా!!కట్టుకున్న ఇల్లాలి కోసం,కన్నబిడ్డల ఆకలి తీర్చడం కోసం....ఏదో ఒకటి చెయ్యాలి!! సరే అనక తప్పలేదు!!ఉన్న సామానంతా గొనె సంచుల్లో మూట కట్టి...అయినవారు ఆప్యాయంగా ఇచ్చిన బియ్యం,పప్పులు,మిరపకాయలు,చింతపండు సరుకులు తీసుకొని వెళ్లొస్తానంటూ....ఇంటిని ఒకటికి పదిమార్లు, తనివితీరా చూసుకొని.....నేలతల్లిని ప్రేమగా ముద్దాడి....తన్నుకొస్తున్న దుఃఖ్ఖాన్నిఆపుకుంటూ....నవనాడులు కుంగిపోతుంట్టే....ఎక్కలేక ఎక్కాల్సొచ్చింది బస్సు.మళ్ళీ అంతలోనే నాకు నేనే సముదాయించుకొని,తమాయించుకొని....అనుకున్నా!!మళ్ళీ రాకపోతానా!!పంటలు పండించకపోతానా!!అని!!.వరుణ దేవుడు కరుణించకపోడు!!వానలు కురియకపోవు!!.....నే నమ్మిన భూమి ఎప్పటికి అన్యాయం చేయదు!!....ఇది వాస్తవం.ఈ కష్టాలు అశాశ్వతం.శాశ్వతం కాదు.ప్రభుత్వ పధకాలు ఎన్నో వచ్చాయి.మా బాధలు తీరుస్తాయి....మళ్ళీ మా ఊరెళ్ళే రోజుకు ఎదురుచూస్తూ.....మీ రైతుబిడ్డ.....జయప్రభాశర్మ.

Comments
Post a Comment