CHIRU VYAPAARI రోజంతా కష్టపడతాను.అత్యాశకు పోను.పదో పరకో మిగిలితే చాలు, అదే పది వేలనుకుంటాను. ఇంతకీ నేనెవరో చెప్పలేదుకదూ!. ఏదో వున్నదాన్లో ఉన్నంత, కుటుంబసభ్యులను బాగా చూసుకోవాలి అని తాపత్రయ పడుతున్న చిరు వ్యాపారిని. ఎలాగోలా నానా తంటాలు పడి, డబ్బులు పోగు చేసుకొని వ్యాపారం మొదలెడితే నా పాట్లు ఇన్నీ అన్నీనా.అయ్యో! ఇలాంటి వాళ్ళదగ్గరే కొనాలని గాని, వీళ్ళనికూడా ప్రోత్సహించాలనిగాని....అబ్బే! అనిపిస్తేనా! ఊహు!. అవును! మాదగ్గర ఏముంటాయని. ఖరీదైన షాపు, ఏ.సి, పనివాళ్ళు ఇతర ఆర్భాటాలు ఉంటేగా. కనీసం ఆ మాటాడే మాటేనా చేతకాదు. అదే వాళ్ళైతేనా, ఇంగ్లీషులో స్వాగతము చెబుతారు, వచ్చేస్తుంటే వీడ్కోలు పలుకుతారు, ఫ్రిజ్లో వున్న నీళ్లు తీసుకొచ్చి పెడతారు, చక్కటి కుర్చీలేర్పాటుచేస్తారు. అడుగుపెడితే రావాలినిపించదు. అదే మేమయితేనా!చెమటతో తడిసి ముద్దైన బట్టలు, మోటు మాటలు,కొనండి, కొనండి అంటూ కాళ్ళా వేళ్ళ పడటం కాస్తంత చికాకు కలిగించినా, బాగానే వస్తారు. కాకపొతే వచ్చిన చిక్కంతా బేరాలదగ్గరే. ఏవండీ! తెలీక అడుగుతాను! ఇది ఏమైనా బాగుందా! మేము కూడాఎంతో కష్టపడి కొనుగోలు చేసి తెచ్చినవే కదా! ఎండనక, వాననకా,వొంట్లో బాగాలేకపో...