Videsi Vyamoham కళ్ళల్లో వెలుగు ! విప్పారిన ముఖబింబం ! మాటల్లో చెప్పలేనంతగా ఆనందం !. గెంతులు ! చిందులు ! పిల్లలకే కాదు ! తల్లితండ్రులు కూడా !. ఎందుకు ఇదంతా అంటే ! వీసా వచ్చేసింది !. అవధిలేని సంతోషం ! ఇహ పార్టీలు , బంధుదర్శనాలు , షాపింగులు ! ఓ ..! హడావిడి అంతా ఇంతానా ! విదేశీ ప్రయాణం ! విదేశాల మోజు !. తమ స్వప్నం నెరవేరిన వేళ !. సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాం ! ఇంక ఎదురులేని జీవితం !. ఇంతకంటే ఏం కావాలి ! ఇదే ఆలోచన !. కడుపు కట్టుకొని ఏడు ఇరుకుల్లో దాచిపెట్టిన సొమ్ములు తీసే తండ్రి ! కడుపు చూసి అన్నం పెట్టి , పువ్వుల్లో పెట్టి చూసుకున్న తల్లి ! ఎంతో వ్యయప్రయాసలకోర్చి , పిల్లలే సర్వస్వము అనుకోని , పెంచుకున్న తల్లి తండ్రులను వదలి , వెళ్ళిపోయి ! అక్కడే సెటిల్ ఐపోతామని ఇంకో ఆలోచన ! ఏవండీ ! మన దేశం చదువుకోండమ్మా అంటూ , ప్రాధమిక విద్య మొదలు ఉన్నతస్థాయి విద్య వరకు .... పాఠశాలలు ఏర్పాటు చేయటమే కాకుండా ... బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి .... బాగా చదువుకున్న వాళ్లకి , నగదు బహుమతులిచ్చి ప్రోత్సహించి ... ఆర్ధికంగా ...