My article "Salam Saab"

ఖాకి దుస్తులు ....తలపై టోపీ.....చేతిలో టార్చులైటు....విజిల్...సైకిల్.....యివి ఖచ్చితంగా ఉండాల్సిందే...ఈపాటికి అర్ధమైపోయుంటుంది.....నేనెవరో!.....నేపాల్ నుంచి వలస వచ్చిన గూర్ఖాని.....మీ అందరి రక్షణకై పాటుపడేవాణ్ణి.....రాత్రంతా మేల్కొని మీకు కాపలా కాచేవాణ్ణి.....నిశాచరుడనై తిరుగుతున్నా.....ఎలాంటివారినైనా నిలబెట్టి.....ప్రశ్నిస్తారేమో పోలీసుయంత్రాంగం.....కానీ.....మమ్మల్ని మాత్రం.....అభిమానించి.....అనుమానించని ఘనత .....మా ఒక్కరికే దక్కింది.     ప్రతీ అపార్టుమెంట్లలో.....కాలనీలలో......కార్యాలయాలలో.....కాపలాదారులున్నా......మేముండాల్సిందే......ఆ గొప్పతనం కూడా మాదే.....ఈ ఆనందమే మాకెంతో ఉత్సాహాన్నిస్తుంది...ఆర్మీజనరల్ చెప్పినట్టుగా....చావంటే భయం లేనివాడు.......ఎవరంటే.....ఒక్క గూర్ఖా మాత్రమే.....అనీ ఆనాడే సెలవిచ్చారు.....యిది నిజం....మాకు చావంటే భయం లేదు.....ఎలాంటి దోపిడీలు,దొంగతనాలు జరిగినా....ఎదుర్కొనే శక్తి మాది.....మా వృత్తి ధర్మాన్ని....నిస్వార్ధంగా,నిజాయితీగా.....అంకిత భావంతో కొనసాగటమే మా లక్ష్యం.....ప్రతీ నెల, ప్రతీ యింటివారు యిచ్చే రూపాయలే....మా జీవనోపాధి....మాపై ఆధారపడిన....మా కుటుంబసభ్యుల కడుపు నింపేదే మీ రూపాయి....కానీ....మీరేమీ అనుకోకపోతే.....చిన్న విషయమండీ.....నెల ఎప్పుడొస్తుందా....అనీ....వేయి కళ్ళతో ఎదురుచూసి.....ప్రతీ యింటికి వెళ్లి అడిగితే మాత్రం.....కొందరు విసుక్కోవటం......మరికొందరు మళ్ళీ రమ్మని చెప్పటం...ఇంకొందరైతే యివ్వనే యివ్వరు....మొహమ్మీదే తలుపులెయ్యటం....అదీ.....చేస్తూవుంటారు.....మనసు ఎంతో గాయపడుతుంది......వున్నవూరు, కన్నవాళ్ళని వదలి.....భాష అన్నది అసలు రాకా.....అమాయకంగా బతుకుతున్నవాళ్ళం....మీరిచ్చే రూపాయి కోసం.....ఎన్నో అంతస్తులు ఎక్కుతూ, దిగుతూ.....ఒంటిలో ఓపిక నిశించిపోతున్నా....పట్టించుకోకుండా.....మీ క్షేమమే.....మా క్షేమంగా భావిస్తూ.....బతుకుతున్న మాపై..కాస్త జాలి, దయ చూపించాలని......అభ్యర్ధిస్తున్నా....ఒక్క రూపాయి చొప్పున రోజు దాచినా....నెలకి ముప్పై రూపాయిలు....ఇంటికో పువ్వైతే.....ఈశ్వరుడికో  మాలన్నట్టు....విందులు,వినోదాలు......హంగులు,ఆర్భాటాలు....ఏదీ కోరుకోము....సెలవు పెట్టి సంబరాలెరగం...మాకు తెలిసిందల్లా.....కాపలా,కాపలా,కాపలా.....మా ఊపిరున్నంతవరకు.....యిదే వృత్తిలో కొనసాగుతాం.....ఈ వృత్తినే నమ్ముకున్నవాళ్ళం....కల్లా కపటమెరుగని మా హృదయం.......మా అమాయకత్వం....వృత్తినే దైవంగా భావిస్తున్న మా నైజం.....మీరు గుర్తించి.....అభిమానించి, ఆదుకుంటారని.....అర్ధం చేసుకుంటారని....పట్టెడన్నంతో కడుపునిండా తినే రోజుస్తుందని....ఎంతో ఆశపడుతూ.....మీ వీధి కాపలా కాస్తూ.....పారాహుషార్ ప్రాణంగా తలుస్తూ.....ప్రతీ నెల మీకు వంగి వంగి సలాం చేస్తున్న....ఈ నేపాలీ....ఉంట్టాను.    ఇట్లు, మీ నిరుపేద గూర్ఖ......జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles