My article "Gachakaya poda"

నేనేంటో, నా చరిత్ర ఏంటో....ఎంత మందికి తెలుసో చెప్పండి?...తెలియదని నాకు తెలుసు.....ఇంచుమించు మరుగైపోయినట్టే కదా!.....ఎలా తెలుస్తుంది?......నేనంటూ ఉంటే తెలిసేది...అందుకే ఇప్పటివారికి తెలియజేయాలనే తపనతో వచ్చా .....ఇంతకీ నేనెవరో చెబుతున్నా......చెప్పేస్తున్నా...అబ్బా....నసపెట్టక చెప్పూ....అనీ విసుకుంటున్నారు కదూ!....అదేనండీ మీ గచ్చపొదని... గచ్చకాయల్ని కాచే పొదని...."గచ్చకాయ" అనీ పేరైన విన్నారా కనీసం...ఆ..వింటే ఎంత...వినకపోతే ఎంత....పోవే అనకండి....వినండి చెప్పింది......నా గొప్పతనం గురించి మీకేం తెలుసు!.......నేను ఎక్కడ పుట్టి పెరుగుతానో తెలుసా?.....ఉష్ణమండల మెట్ట ప్రాంతాల్లో. నాకు వాతావరణ మార్పులతో సంబంధం లేదు.....ఎలాంటి వాతావరణం ఐనా తట్టుకొనే శక్తి నాది.....అతివృష్టి, అనావృష్టిలతో అస్సలు పని లేదు....  నే పుట్టినమొదలుకొని ......ముళ్లతోనే వుంటాను.....నా కాండం,ఆకులు,పువ్వులు అన్ని ముళ్ల మయం...నే పువ్వులు పూచి......ఆ పైన కాయ కాచి.....ఆ కాయ లోపల అసలు కాయగా తయారవుతాను.....పైనున్న కాయ కోలగా రెండు డొక్కలు కలిపినట్టుగా ఉంటుందన్న మాట.....తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉంటుందో అలా.....నే లోపల దాగి వుంటాను....ఎండాకాలం అవగానే......తొలకరి వర్షం పడగానే......ఠప్పున పేలి వెలికి వస్తాను....యింకొక విష్యం తెలుసా.....నన్ను పాతిన మూడు నెలలకి గాని....మొలవను గాక మొలవను.....నా మొక్క కానాలంటే మూడు నెలలు ఆగవలసిందే.....నే మొలవడమే తడవు.....విస్తారంగా వ్యాపిస్తాను.....డొంకలా...నా డొంక దగ్గరకు రావాలని ప్రయత్నం చేసేరో......అంతే సంగతులు.....జంతువులైన సరే ......తస్సాదియ్య....బతికి బట్ట కట్టలేవ్.......ఆఖరికి ఏనుగైనా సరే......బెదరాల్సిందే......అంత భయంకరమైన ముళ్ళతో వుంటాను......అందుకే పూర్వం శత్రువులనుంచి ......కాపాడుకోవడంకోసం....రాజ ప్రాకారాల చుట్టూ నన్ను పెంచుకొనేవారు .....ఎంతో ప్రేమతో...కాకతీయ రాజులఅభిమానం పొందిన దాన్ని.....ఎందుకంటే వారి ప్రాకారాలకు నేనే కాపలా.....అంత శక్తిశాలిని......నేను ఔషధాన్ని కూడా......గ్రామాల్లో వరిబీజ వ్యాధికి...... నా ఆకులు తీసుకెళ్లి ముద్దగా నూరి.....వాడేవారు......యిహ ఆటలైతే మరి చెప్పక్కర్లే....అదేనండీ.....గచ్చపిక్కలాటా......పల్లెల్లో ఐతే నే కనిపిస్తే చాలు......ఆటలే ఆటలు......అంత సంబరపడిపోయేవారు..నన్ను చూసి.....నా రంగు ఇష్టపడని వారంటూ వుండరు....నమ్ముతారా.......గచ్చపిక్క రంగంటే గచ్చపిక్క రంగని....తెగ ఎగబడతారు.....ఇప్పటి వారైతే మరీను....యిన్ని ఉపయోగాలున్న నన్నెందుకండి.....మరచిపోతున్నారు.....మరుగైపోయానని యెంత బాధపడుతున్నానో మీకేం తెలుసు.....ప్రభుత్వంవారు లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి .....పాఠశాలలకు,కార్యాలయాలకు.....పచ్చదనం కోసం..... అనేక రకాల మొక్కల్ని పెంచుతున్నారు.....చూడ ముచ్చటగా వుంది....కాదనను....కానీ.... నన్ను కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని......వారు ప్రేమతో నన్ను పెంచితే.......ఎంతో ఆనందపడి.....వారి కార్యాలయాలకి, పాఠశాలలకు.......యిరవైనాలుగుగంటలు....కాపలాదారుగా ఉండి... రక్షణ నిస్తానని మాటిస్తున్నాను...ఆడిన మాట తప్పను....యిది చూసిన నా స్నేహితులందరూ ...ప్రభుత్వానికి చేరేవరకు......షేర్ చేసి పుణ్యం కట్టుకోండేం...చేస్తారు కదూ.....ఇట్లు, మరుగైపోయిన గచ్చపిక్కల పొద.......జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles