My article "Aashada maasam"

ఏవిటమ్మా ఈ ఎండలు......చంపేస్తున్నాయి.....హుస్షూ,హూస్షూ.....అనుకుంటూ.....విసుక్కుంటారే......ఎప్పుడు చల్లబడుతుందా......అనీ.....రేవటి నక్కలా ఎదురుచూస్తూంటారే....వర్షాల కోసం....ఏవైందమ్మా యిప్పుడు మరి....అబ్బా....ఛస్తున్నామనుకో.....ఒకటే ముసురులంటారా.......బాగుందమ్మా,బాగుంది....అంతా మీ ఇష్టమేనా....అనుభవించాల్సిందే.....తప్పదు......ఎవరీ గయ్యాళి సూర్యకాంతం.....అనుకుంటున్నారా?...నేనండీ బాబూ ఆషాడాన్ని.....మూడు చెరువుల నీళ్లు తాగించేదాన్ని....అః..ఆరు చెరువుల నీళ్లు తాగించేదాన్ని.....లేకపోతె ఏంటీ.....నన్ను గుర్తించరా...ఆషాడం అనగానే.....చీత్కారాలా?.....ఛీదరింపులా?.....చీమలు,దోమలు,ఈగలు,పురుగులు వాలుతూ.....చంపేస్తున్నాయని అంటారా......అసహ్యించుకుంటారా..తినే పదార్ధాలమీద మూతలు పెట్టుకోండి.....శుచిగా,సుబ్బరంగా  ఉంచుకోండి...ఎవరు కాదన్నారు....అంతేగాని నన్ను నిందించ కండి....దీన్నే అంటారు" తలపాగా చుట్టుకోలేక బుర్ర వంకని"...ఆ....ఆషాడం కదండీ....ఒంట్లో అలాగే ఉంటుంది మరి.....ఈ నాల్ర్రోజులు అంతే...ఏంటా నిందలూ....మలేరియా వస్తే నేనే.....టైఫాయిడ్ వస్తే నేనే....వాంతులైతే నేనే....విరోచనాలైతే నేనే.....అన్నింటికీ నేనేనా......ఏం....తెగ మురిసిపోయి గోరింటాకు పెట్టేసుకుంటారు .....ఎక్కడున్నా మేకల్లా దూసి తెచ్చేసుకొని....ఎంత బాగా పండిందో....చూడంటే చూడండని....ఆషాడం ఆంటే ఆషాడం అనీ...పెట్టుకొని తీరాల్సిందే అనీ...అది నచ్చింది.   ఆషాడం సేల్స్ ఎక్కడున్నాయో...తెలిస్తే చాలు...బ్యాగు తగిలించేసుకొని...ఒకటే పరుగు షాపింగులని....ఇంకెప్పుడైనా ఇస్తున్నారా,ఆఫర్లు దుకాణం వాళ్ళు?....అప్పుడు మంచిదాన్నికదా!.....అప్పుడూ మీ యజమాని తిట్లకి బలైపోతాను.....అవును మరి....తిట్టరా...శ్రావణ శుక్రవారం పూజ పేరుతొ...ఫ్రైడే ఫ్రై....ఎప్పుడు ఆడవాళ్లకేగాని.....మగాళ్ళకి లేవా...నోములు, వ్రతాలూను...అయినా నేననకూడదు....అది మీ వ్యక్తిగతం.....ఏది ఏమైనా హడావిడి మసాన్నండి నేను...కొత్తగా పెళ్ళైన కోడళ్ళు పుట్టింటికి వెళ్లడం.......రాబోయే శ్రావణమాసం....కొత్త నోముల సన్నాహాలు....వియ్యాలవారి రాకకై ఎదురుచూపులు.....కొనుగోళ్ల సందళ్ళు.....ఎంత బాగుంటుంది.....మీరిలా నన్ను విసుకుంటారు గాని.....తమిళవారైతే నన్ను ఎంత బాగా ఆదరిస్తారో.....ఆడీ ఆడీ అనీ.....మీరు మాత్రం ఆషాడం అయిపోతే..... అప్పుడు చూద్దాం అంటుంటారు...ఏది చెయ్యాలన్నా...కాస్త విశ్రాన్తి  కావాలి కదా మీకు...అందుకే ఈ ఏర్పాటు ఆషాడం పేరుతో......అర్ధం చేసుకోండి.....ఆషాడాన్ని ఆస్వాదించండి....ఆహ్వానించండి.....సరేనా....వుంటా....ఇట్లు,అనుభూతుల ఆషాడం.......జయప్రభాశర్మ.



Comments

Popular posts from this blog

Articles