My article "Duvvudu Duvvena"

కనిపించని సేవ చేస్తాను......పళ్ళు ఉంటాయి గాని.....మనిషిని కాను.....ఐతే మరెవరో నువ్వు చెప్పు!......చెబుతానూ....వుండండి...విసుక్కోకండి......మీ "దువ్వెనండీ" బాబూ......ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా......ఆడవాళ్ళైతే హ్యాండు బేగుల్లోను......మగవాళ్ళైతే జేబుల్లోనూ.....బయటకెళ్లిన కూడా.....చచ్చినట్టు ఉండాలికదా.....మూసుకొని.  ఉదయం  లేచిన మొదలు ఇదే పని ...బర బరమని ....ఆ వెంట్రుకలు దువ్వేసరికే ఐపోతుంది రోజంతా......అట్నించ్చొచ్చి,ఇట్నించ్చొచ్చి......అద్దంలో పదిసార్లు చూసుకుంటూ......తినేస్తారు నా ప్రాణాన్ని......చ్చి....న బతుకు బద్దలవ......ఎందుకు పుట్టానో తెలీదు.....దరిద్రకొట్టు జన్మాని, దరిద్రకొట్టు జన్మ.....పోనీ సుబ్రన్గా ఉంటాయా.....ఆ బుర్రలు.....కంపు ముద్ద....యాక్....చుండ్రులు, పేలు, మురికిలు, చెమటలు.......ఇన్ని, అన్ని అని చెప్పతరమా....పోనీ హమ్మయ్య.....తలంటు స్నానం చేశారనుకుంటే......నన్ను సుబ్బరమ్ చేస్తే కదా.....హబ్బే.....అంత సీన్ లేదు.....ఒళ్ళు వంగొద్దు....ఆ చెండాలాన్ని నేనే భరించాలి మళ్లీ.....ఎన్ని పాట్లో ఈ బతుక్కి....ఎవరికి చెప్పాలి నా భాధ.....ఇవేవి చాలవన్నట్లు.......వీపు గోకుడికి నేనే......ఎక్కడ దురదున్న......మనముండాల్సిందే.  యి ఘనకార్యానికి.....ముద్దగా పళ్ళు లేవని, పళ్ళు విరిగిపోయాయని....తిట్లదండకం ఒకటి.....ఇంతోటి శిరోజాల సొగసుకి.....రకరకాల దువ్వెనలు,రంగు రంగుల దువ్వెన్లును....యీమధ్య ఆన్లైన్ బుకింగులొకటి......చస్తున్నాను చూడలేక.....ఒక్కటి మాత్రం సంతోషాన్నిస్తుంది.....ఏవిటంటే.....పెళ్లిళ్లలో ఆడపెళ్ళివారు.....మగపెళ్ళివారికి ముస్తాబవమని యిస్తారు చూడండి....అలాగే సారె పెట్టినప్పుడు కూడా నే ఉంట్టాను....యెంత ఆనందమేస్తుందో....ఆ ఒక్క క్షణమే కదా నా ఆనందం.....తర్వాత మళ్లీ మామూలే.....లండన్ వెళ్లిన పిల్లి ఏం చూసింది.....చిన్నపిల్లల రైమ్స్ లో
 చెప్పినట్టు.....ఎక్కడికెళ్లినా అంతే....అలాగే మనం కూడాను......నా పుట్టుకే ఇంత...నా తండ్రి.....ఎవరు కనిపెట్టారోగాని.....అమ్మో, అమ్మో......నా వల్ల కావడం లేదమ్మ....కొందరేమో నూనె తెగ పట్టించేసి.....జిడ్డు మయం....మరికొందరేమో నూనె జోలికే వెళ్లకుండా.....నన్ను పెట్టి దువ్వుతుంటే....ఎక్కడ విరిగిపోతానో అన్న భయం....ఎప్పుడు చూసిన దువ్వుడు గోలే....అదే పనిగా దువ్వుకుంటుంటే.....ఆ రెండు వెంట్రుకలు ఊడిపోతాయర్రా బాబూ.....నా మాట విని.....రోజుకి రెండు సార్లు దువ్వుకొని సంబరపడండి చాలు.....మీరేమి సీనియాక్టర్లు కాదు..నేను వాళ్ళ చేతుల్లో ఎలాగూ బలవక తప్పదు....మీరే నన్ను అర్ధం చేసుకోవాలి.....ఓకే.....మనసు నొప్పిస్తే క్షమించండి.....ఏదో నా బాధ చెప్పుకున్నాను...నన్ను మాత్రం సుబ్బరమ్ చేస్తూండండి.....ఎందుకంటే మీ ఆరోగ్యమే నా ఆనందం.....అన్నాను  గానీ....సేవెందుకు చేయను.....వుంటాను......ఇట్లు, సదా మీ సేవలో,మీ ప్రియాతిప్రియమైన దువ్వెన......జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles