My article"Piracy"

నన్ను చూస్తే చాలు పులైపోతార్రా బాబూ.......ఎక్కడైనా కనిపించేనో.....ఓ...పండగే పండగ......మిమ్మల్ని ఆపటం ఎవరితరం కాదురా నాయనా.....ఎందరి ఉసుర్లు పోసుకుంటున్నారో......సులభంగా దోచెయ్యటమే.....మీ పని......నా గురించి చెప్పలేదు కదూ......నేనేరా తండ్రి.......సంగీత సాహిత్య, వినోదాల విందుని.....మీరు తేరగా డబ్బులు సంపాదించే మార్గాన్ని.......చ్చి......సిగ్గులేకపోతే సరి......ఎన్నో కష్ట నష్టాలకోర్చి, వ్యయప్రయాసలతో ......పగలనక, రేయనక.......ఇంటిని, ఒంటిని మర్చిపోయి......ఆకలి, దప్పిక లేక......సర్వస్వము కళే.....అనుకొని బ్రతికి......ఊహాలోకంలో విహరిస్తూ......కళే ఊపిరిగా......ఎంతో ఆశతో....కట్టుకున్న కలల సౌధాన్ని కూల్చుతార్రా.......మీకంటూ ఏమీ రాదా......పక్కోడిది కాపీ కొడతారా......వాళ్ళు మొర్రోమని ఏడుస్తుంటే ఆనందిస్తారా.....మీరే ఆ స్థానంలో ఉంటే తెలిసేది......లేకపోతె.....ఫేస్ బుక్లో ఏదైనా పోస్ట్ చెయ్యాలంటే భయం......పెట్టేమో చచ్చేమే.......సినిమాలైతే యిహ చెప్పవసరమే లేదు......కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి కదా......రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవాలంటే ఎలా మరి.......ఇదేదో బాగుంది కదా......ఫ్రీగా వొస్తే ఫినాయిల న్నట్టు....వాళ్ళ పనిలో వాళ్ళుంటారు పాపం......మిమ్మల్ని కానుకొకుండా.......మీకైతే యిదే పని.....ఒక్క అక్షరం దోచిన....తట్టుకోలేని కళా హృదయం....అలాంటిది సినిమానే దోచెయ్యటం......యెంత పతనమైపోతారు వాళ్ళు.......నీ డబ్బు జబ్బు బద్దలవా.......నీ పైశాచికానందం పాడుగాను.....కళాకారుని మనసు.....యెంత సుతి మెత్తనో నీకేం తెలుసు......తట్టుకొనే శక్తి అందరికి ఉండదు.......అనేక అనర్ధాలకి దారి తీస్తుంది.......కుటుంబాలు అస్తవ్యస్తమై.....వీధి పాలై....అలో లక్షణా అని రోదిస్తుంటే.....యెంత హృదయవిదారకంగా ఉంటుంది.......ఆలోచిస్తేనే......అయ్యో పాపం అనిపిస్తుందే.......చేతనైతే......ఎంచక్కా రాసుకోండి.......మెదడుకి పని పెట్టి......ఇంకేవైనా కళలకి సంబంధించి......చెయ్యాలంటే చెయ్యండి.....కంప్యూటర్ కనిపెట్టింది కూడా మనమేగా......అలాంటి కంప్యూటర్ని మించిన బుర్రిచ్చాడు.....భగవంతుడు......చేసుకోండి......ఒరిజినాలిటీ లేక......క్రియేటివిటీ లేక......పళ్ళీసుపెట్టుకొని.....చేతకాక....కష్టపడలేక.......కాపీ కొడతావా.........తప్పు కదూ......ఇంకెప్పుడు యిలా చేయక......ఎవర్ని ఏడిపించక.......పొరపాటుకు నాలిక కరుచుకో....లెంపలేసుకో......గుంజీలు తీసుకో........వుంటాను.   ఇట్లు,డేగ కళ్ళు పెట్టుకొని నిన్నే గమనిస్తున్న సంగీత సాహిత్య వినోదం.......జయప్రభాశర్మ.

    

Comments

Popular posts from this blog

Articles