నేనంటే పెద్దగా పట్టించుకోనివారు......కార్తీకమాసం వచ్చిందంటే మాత్రం తెగ ఎగబడతారు.....ఎందుకంటే ఆ మాసంలో నా ప్రాధాన్యత అటువంటిది మరి....విరివిగా పువ్వులు పూస్తూ, ఎంతో ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా....ఆ కాలంలో బాగా ఉపయోగపడుతుంటాను.....నా కాయలు కోసుకొని కూర వండుకుంటారు తెలుసా?....ఎగపాకిరి మరీను.నే పువ్వులతో విరబూసి....తెల్ల కొంగలు వాలినట్లుగా.....యెంత సొగసుగా ఉంటానో చెప్పలేను.....దారిలో వెళిపోతున్న వాళ్ళు.....నిల్చొని చూసి వెళ్తుంటారు......అనీ .....అనుకుంటున్నారా....హబ్బే......చూడరు....చూసి కర్రలతో, కంపలతో....ఎలా దూసేద్దామా....అనే ఆలోచన...... నా పువ్వులు అంత విశిష్టమైనవి...... పూజకి తీసుకెళ్లి, కార్తీక దామోదరుడికి పెట్టేస్తే.....పుణ్యం వచ్చేస్తుందని......అంత మమకారం నాపైన....ఎందుకంటే శివునికి మహాప్రీతికరమైనదాన్నని....ఎక్కడైనా కనిపించేనా?...వదిలితే ఒట్టు.....బోల్డ్ వరాలు శివుడు కురిపించాలి కదా.....పైసాతో అసలు పని ఉండదు.....ఎంచక్కా నన్ను లాగేసి పీకేసి......నాలుగు పువ్వులు కోసేస్తే.......బోళా సెంకరుడు ....ఇచ్చేస్తాడు వరాలు......అంతటితో ఆగుతారా?......నా కాయలు కూర తింటే .....ఎంతో మంచిదట......ఎంతో ఆరోగ్యకరమట.....మరి అంత చక్కటి మొక్కని......అన్ని వేళల చూస్తుంటే యెంత పొంగిపోతాను.......మిమ్మల్ని అన్నం అడిగేనా?.....బట్ట అడిగేనా? .....ఎప్పుడైనా, ఎక్కడైనా నన్ను పెంచేరా?.....గుప్పెడు నీళ్లు పోసారా?.....ఎందుకు చేస్తారండి ....నా అవసరం ఆ ఒక్క నెలే. పెంచుకుంటే ఏంపోయింది.....చల్లటి నీడనిస్తాను......చక్కటి గాలినిస్తాను.....ఆహ్లాదాన్ని కలిగిస్తాను......ఆనందాన్ని పంచుతాను....యింకా మీకు తెలుసా.... తమలపాకు తీగ పాకడానికి అనువుగా నన్నే ఎంచుకొని పెంచుతుంటారు....ఆ తమలపాకు ఆప్యాయంగా .....నన్ను పెనవేసుకొని అల్లుకు పోతుంటే.......నా కెంతో సంతోషమనిపిస్తుంది......ఎందుకంటే మా ఇద్దరిది .......భక్తిపూర్వక స్నేహబంధంమని. పశువులకు ఆహారంగా .......నా కాయలు పువ్వులు మేతగా వేస్తారు...నోరులేని మూగప్రాణులు ......సంబరంగా తింటుంటే......ఎంతో ఆనందపడతాను....మీరు మాత్రం.....ఆఖరికి ఇటుకబట్టిల్లో.....ఇటుక కాల్చడానికి కూడా నన్నే చీల్చిచెండాడతారు....కాస్త ఒక్క క్షణమైనా నా గురించి ఆలోచించమని......వేడుకొంటున్నాను.......యిటుపైన ప్రత్యేకంగా నన్ను ప్రతి యింటిలో పెంచి...నాకు ప్రత్యేక గుర్తింపు యివ్వాలని.....సంవత్సరమంతా కార్తీకంగా భావించాలని.......ఆశిస్తున్నా.....ఆశ పడుతున్నా.....ఏది ఏమైనా......ఆ శివుని పాదాల చెంత వాలిన.....నా జన్మ ధన్యం కదా.... యిట్లు,అందాల అవిసె, అందరికి అలుసే .....జయప్రభాశర్మ.
Articles
1. Aha Agakarakai వచ్చేసా.....ఎవరని అనుకుంటున్నారా.......నాకు తెల్సు......మీరనుకుంటారని.....ఆషాడం నుంచి.....నాకోసం వెతుకులాటే.....మిడిగుడ్లేసుకొని.....నే కనిపిస్తే.....పెద్ద నిధి దొరికినట్టే ఫీలింగు....అంత మోజన్న మాట ......నన్ను చూస్తే....యింకా మీకు వెలగలేదనుకుంటాను.......బాబోయ్......ఆగకరకాయనండి బాబూ.......ఉత్తరాంధ్ర పల్లెల్లో ఐతే......అంగాకరకాయ్ అని అంటారు...పొట్టిగా బుడతలా వుంటాను గాని......రుచి అద్భుతం ....అమోఘం.....తింటే వదలరు......లేకపోతె ఏంటీ......ఎక్కడో అడివి లో దుంప.....ఎవరు పాతేరని.....ఎవరు పెంచారని.....అక్కడ ...ఓ....తీగలు పాకిరేసి......కాయలు తెగ కాసేస్తుంటే.....ఏ మహానుభావుడు......డేగకళ్లు పెట్టుకొని కనిపెట్టేశాడో గాని.....తస్సాదియ్యా....అదిమొదలు నన్ను వదిలితే ఒట్టు.....పాపం నా అడివి బిడ్డల చెవిలో పువ్వులు బాగా పెట్టి.......బుట్టలు,బుట్టలు తెచ్చేసి......వ్యాపారం మూడు పువ్వులు.....ఆరు కాయలుగా చేస్తున్నారంటే.......నమ్ముతారా......అంత గిరాకీ అండి నాకు......కూరగాయాలన్నింటిలో.......ఆకాశాన్నంటే ధర నాదే......వందల్లో వుంటాను......నా రేంజె వేరు ......నన్ను తినాలంటే కాస్త
Comments
Post a Comment