Posts

Image
Videsi Vyamoham కళ్ళల్లో వెలుగు ! విప్పారిన ముఖబింబం ! మాటల్లో చెప్పలేనంతగా ఆనందం !. గెంతులు ! చిందులు ! పిల్లలకే కాదు ! తల్లితండ్రులు కూడా !. ఎందుకు ఇదంతా అంటే ! వీసా వచ్చేసింది !. అవధిలేని సంతోషం ! ఇహ పార్టీలు , బంధుదర్శనాలు , షాపింగులు ! ఓ ..! హడావిడి అంతా ఇంతానా ! విదేశీ ప్రయాణం ! విదేశాల మోజు !. తమ స్వప్నం నెరవేరిన వేళ !. సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాం ! ఇంక ఎదురులేని   జీవితం !. ఇంతకంటే ఏం కావాలి ! ఇదే ఆలోచన !. కడుపు కట్టుకొని ఏడు ఇరుకుల్లో దాచిపెట్టిన సొమ్ములు తీసే తండ్రి ! కడుపు చూసి అన్నం పెట్టి , పువ్వుల్లో పెట్టి చూసుకున్న తల్లి ! ఎంతో వ్యయప్రయాసలకోర్చి , పిల్లలే సర్వస్వము అనుకోని , పెంచుకున్న తల్లి తండ్రులను వదలి , వెళ్ళిపోయి ! అక్కడే సెటిల్ ఐపోతామని ఇంకో ఆలోచన ! ఏవండీ ! మన దేశం చదువుకోండమ్మా అంటూ , ప్రాధమిక విద్య మొదలు ఉన్నతస్థాయి విద్య వరకు .... పాఠశాలలు ఏర్పాటు చేయటమే కాకుండా ... బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి .... బాగా చదువుకున్న వాళ్లకి , నగదు బహుమతులిచ్చి   ప్రోత్సహించి ... ఆర్ధికంగా ...
Image
జానపద గీతం,రచన: జయప్రభాశర్మ. గాజులోడప్పో మా యింటికొచ్చినాడప్పో గాజులోడప్పో మా యింటికొచ్చినాడప్పో రబ్బరు గాజులన్నడు రంగు రంగుల గాజులన్నడు ఓరకంట సూసిండు ఒయ్యారి ఏస్కొ అన్నడు మలరము తీసినాడు మంచిరకములన్నాడు మా గాజులేస్తే నీకు మంచ్చి జరుగునన్నాడు మాట మాట కలిపినాడు మా వూరు ఎల్దుమన్నడు ఎర్రగాజులేతీసి ఏటేటోఅన్నాడు పసుపుగాజులే చూసి పడి పడి పడి నవ్వినాడు ఆకుపచ్చ గాజులేస్తే అదిరేనని అన్నాడు తెల్లగాజులే తీసి నీకు నప్పవన్నాడు నల్లగాజులేసి నీకు దిష్టి తగలదన్నాడు
Image
నేనొచ్చి ఎన్నిరోజులైందో! నా వాళ్ళని పలకరించాలని ఎంత ఆత్రుత పడ్డానో! పుడమితల్లిని తాకిన వేళ ఎంత సంబరమేసిందో! నన్ను చూసిన వాళ్ళు ఎంత గంతులేసారో! హాయి గొలిపే గాలినాస్వాదిస్తు ఎంత మైమరచిపోయారో! నాపై అలిగినవాళ్లంతా ఎంత పండగ చేసుకున్నారో! నవ్వుతూ నన్ను ఎంత బాగా చూసారో! చెప్పలేనంతఆప్యాయత కురిపించి స్వాగతం పలికారో! వారి అభిమానం చూసి నన్ను నేనే తిట్టుకున్నా! ఏవైపోయాను ఇన్నాళ్లు అనీ! కానీ!ఇప్పటికైనా వచ్చినందుకు ఆనందపడుతున్నా! మీ చినుకు చిత్తడినై పుత్తడి చెయ్యాలని ఆశ పడుతున్నా!
నీలిరంగు చీర కట్టి ఎంత అందంగా ఉన్నావో తెలుసా! నల్లని కాటుక పెట్టుకున్నప్పుడు ఇంకా అందంగా ఉంటావు కానీ! అంతలోనే తుడిచేస్తావు ఎందుకని! నీ రాకకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాము స్వాగతం పలకాలని సన్నాహాలు చేస్తుంటే రావెందుకని! మా ఆనందం నీ ఆనందం కాదా! ఇంతగా ఏడిపించటం భావ్యమా! రా!దిగిరా! చల్లని చినుకై కురిసేవానజల్లై!...........jayaprabhasharma.
జానపద గీతం,రచన: జయప్రభాశర్మ. టెర్లీను కోకా కట్టీ ముఖమల్లు రయికా తొడిగీ  ఒయ్యారి నడిచొస్తుంటే మనసంతా పరుగులు తీసే సిలుకూ పంచెనూ కట్టీ కద్దారు సొక్కా తొడిగీ మీసం మెలిపెడుతొస్తుంటే మదిలోన అలజడి రేగే గున్నమావి తోటావుంది గుబురు కంది సేనూఉంది నీలాటి రేవూవుంది నిమ్మసెట్టు నీడా వుంది అందాలా మరదలు పిల్లా పోదాం పద మరి అటు అల్లా నువ్వే నా పనసాపండు నీపై నా మోజే మెండు నువ్వే నా మల్లెచెండు నేనే నీ అత్తరు సెంటూ సొగసైన పాలా ఎండి పూసేస్తా గూడూబండి
Image
జానపద యుగళ గీతం. రచన:జయప్రభాశర్మ. పల్లవి: అతడు: రాయే సిన్నమ్మి నా యెంట రాయె అమ్మీ న యెంట రాయె అమ్మీ నిన్నేలుకుంట సుమ్మీ ఆమె: పోరా సిన్నోడా యెంట రాదు అమ్మీ ని యెంట రాదు అమ్మీ నువ్వంటే మంట సుమ్మీ చరణం: అతడు: ఆదోరం జాతరలో రబ్బరుగాజులే కొంటా బుదోరం సంతలోన రంగులరాట్నమెక్కిస్తా ఆమె: ని మాటలే బొంకు ఎయ్యమాకులే టముకు నే రానులే జంకూ నాకేమోలే బెరుకూ అతడు: ఉమ్మెత్త పువు తెస్తా మెట్టపైన ముడిచెడతా ఆమె: ఆ మాటలాపమంటా తేమాకులే తంటా "రాయె: చరణం: అతడు: మద్దేరు దాటిస్తా పూలకొక కొని యెడతా మా వూరు సూపిస్తా ఇంటికాడ ఒండెడతా ఆమె: నన్నేలు వాడంట మానసిస్తే సాలంటా నాతోనె నీవంటా నీతోనే నేనంటా అతడు: నీ జడగంటలంటా న ఊసులేనంటా ఆమె: నేను నీ జంటవుతా నువ్వు నా ఎంటంటా "రాయె" అతడు: రాయె సిన్నమ్మి యెంట రాయె అమ్మీ యెంట రాయె అమ్మీ న జంట నీవే సుమ్మీ ఆమె: పదరా సిన్నోడా యెంట వుంటదమ్మీ యెంట ఉంటదమ్మీ నీ జంట నేనె సుమ్మీ రచన: జయప్రభాశర్మ.
Image
NIREEKSHANA నిశీధిని తిట్టుకుంటు నీకోసం నిరీక్షిస్తూ నీకై ఎదురు చూస్తూ  నీ రూపం తలచుకుంటూ నీ మాటలు పలవరిస్తూ నీ జ్ఞాపకాలు వెంటాడుతూ నీ ధ్యానమై జీవిస్తూ వలపుల తలపుల చంద్రమా! ఒకపరి నను చూడుమా! నీ ప్రేమకై పరితపిస్తున్నా! దరహాస చంద్రికవై దరి చేరుమా! దయార్ద్రహృదయినివై కరుణించుమా! మూటలడిగితినా! ముద్దులడిగితినా! మురిపాల ముఖము చూడనైతీనా! ముగ్ధ నినుగాంచ నోచుకోనైతీనా!