Posts

Image
"Nakkalollu" అయ్యా నమస్కారం!.బాగున్నారా!. మరేంలేదు! నాగురించి చెప్పుకుందామని వచ్చానయ్యా!. కాస్త ఓపిగ్గా వినాలిమరి.మేము నక్కల కులస్తులం.నక్కలోళ్లు అంటారు మమ్మల్ని. మావృత్తి వేటాడ్డం. మేముకూడా సంచారజాతి కులస్తులమే. ఒకేదగ్గర నివాసముండకుండా ఊర్లు మారుతుంటాము.తెల్లారి లేచిన మొదలు మళ్ళీ చీకటి  పడేవరకు చెట్లనక,పుట్లనక తిరిగి అలసి వస్తుంటాము.  ఒంటిమీద చిన్న గోచీగుడ్డతప్ప,ఇంకేమి ధరించము. చేతిలో గునపము,బొరిగి మా ఆయుధాలు.మేము ఆడ,మగా అనీ లేకుండా ఇంటిల్లిపాది వేటకి వెళ్లి వస్తుంటాము. మా వేటలో ఎక్కువగా పాముల్ని వేటాడి పట్టుకుంటుంట్టాము. అందులో ప్రత్యేకంగా నాగుపాములు,జెర్రిపోతుల జాతికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తాము. అవి దొరికిన రోజు మా ఆనందానికి హద్దే ఉండదు. అంత సంబరపడిపోతాము.అవి ఎక్కడున్నా ఒడిసి  పట్టుకోవడంలో సిద్ధహస్తులం మేమె. మేము కచ్చితంగా ఎక్కడఉన్నాయి కూడా చెప్పగలం.మానుంచి తప్పించ్చుకోవడం వాటి తరం కాదంటే నమ్ముతారా!. అందుకే పాము ఎవరింటికి వచ్చిన పల్లెల్లో మమ్మల్ని పిలిచి తీసుకెళ్లేవారు. మరి మాకు ఇలాంటి పాములు దొరికితే యెగిరి గంతులేస్తాము. వీటి చర్మాన్ని ఒలిచి ఊరబెట్టి ఉప్పుల...
Image
"Malle Puvvu" బొండుమల్లి,దొంతిమల్లి, సిరిమల్లి,మరుమల్లి, కొండమల్లి, అడివిమల్లి, పందిరిమల్లి,జాజిమల్లి కాడమల్లి.  మధుమాస వేళ!మరుమల్లి రాక!........ఆహ! ఓహో!. వసంతం వహ్వా! వాసనల హేల!......ఆబ్బబ్బబ్బా! ఆపవమ్మా గోల!.     ఏవిటీ! గోలా! నా పేర్లు ఎన్నున్నాయో చెబుతుంటేను!విసుగా!. ఫిబ్రవరి వచ్చిన దగ్గరనుంచి నాకోసం యెంత పరితపించిపోయి, ఎదురుచూస్తుంటారో! పల్లీసుపెట్టుకొని! మరెందుకమ్మా!. పోదురూ, మీరు మీ బడాయీను!. అంత పరిమళం వెదజల్లే కుసుమాన్ని నేనే గనక!. వేసవి చెమటకి తడిసి ముద్దయిపోతున్నా నన్ను మాత్రం వదిలితే ఒట్టు. సాయంకాలం ఎప్పుడవుతుందా, పూలు అమ్మకానికి వస్తాయా, ఎంచక్కా అలా షికారు చేసి వద్దామా, అనీ ఇవే ఆలోచనలు. యిహ!  పరిమళ ద్రవ్యాల వాళ్ళైతే మరి చెప్పటానికి లేదు.విపరీతంగా తీసుకెళ్లి వాడుతుంటారు.అగరుబత్తి తయారీదారులు అసలు వదిలేది లేదు. అంత మోజన్నమాట. సబ్బులు,క్రీములు,పౌడర్లు యిలా ఎన్ని వ్యాపారాలు నావల్ల జరిగి లబ్ది పొందుతున్నారో. అసలు నేనంటే ఇష్టపడని వారు ఎవరు చెప్పండి! మన లెక్కే వేరు.పెళ్లిళ్ల సీజను వస్తే, మనదే హడావిడి, ఎక్కడ చూసినా.    పెళ్ళికొడుకు,పెళ్లికూతురు మెడ...
Image
Visakha Sagara Theeram హాయ్ అండీ! నేను! విశాఖ సాగర తీరాన్ని!.ఆసియాలోనే అతి వేగంగా అబివృద్ది చెందుతున్న ఈ నగరానికి మరింత వన్నెతెచ్చిన గొప్పతనాన్ని.. నన్ను చూస్తే చూపు తిప్పుకోగలరా?. ఊహు!చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది.వదిలి రాబుద్ధి కాదు.ఎంత సేపైనా అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఎందరో పర్యాటకుల మనసు దోచిన దాన్ని. రామకృష్ణ తీరం, రుషికొండతీరం, యారాడ తీరం,భీమిలి తీరం,గంగవరం తీరం ఇలా మరెన్నో తీరాలు మా విశాఖ సొంతమండి. డాల్ఫీన్స్ నోస్ కొండల్ని తాకుతూ,ఎంత ఉత్సాహంగా ఉరకలేస్తుంటానో రోజు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులొస్తుంటే, ఆనందంతో పొంగి పొరలి,యింకా ఎగసి, ఎగసి పడుతుంటాను. నన్ను చూసిన సంతోషంలో చిన్న,పెద్ద అనకుండా కేరింతలు కొడుతూ,నేనొచ్చి పాదాలు తడుముతుంటే,మైమరచిపోయి ఇంకొచెం ముందుకు వచ్చేయడం అదీ చేస్తుంటారు. పాపం గల్లంతవుతుంటే నేను మాత్రం ఏం చెయ్యగలను! బాధపడటం తప్ప!. అప్పటికీ హెచ్చరిస్తుంటారు. వింటేనా!. పాపం నన్ను చూడ్డానికి వచ్చి నా పాల పడిపోయారంటే చెప్పలేని మనోవేదన అనుభవిస్తుంటాను. గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటూ రక్షించే ప్రయత్నం చేస్తున్నా,ఒక్కోసారి విఫలమవుతుంటుంది. ఎక్కడో పుట్టి, నాలో ఐక్యం కావటం మ...
Image
Povvaaku పొవ్వాక్కాడా!ఎవులికి తెలుసునో సెప్పండి! అచ్చే తెలుస్తాది. ఎలాగ తెలుస్తది. ఒలమ్మ! నను సెబుతాను యినండి.యి మాటంటే  సాలు మా ఆడోళ్లకి, మొగోల్లకి గొప్ప యిట్టము. మా కాసి బాగా పండిత్తాము. ఏటనుకుంటన్నారు! మరేటి కాదు బాబు! మీరు సదువుకున్నోళ్ళు, అంసేత,పొగాకు అంటరు. మాకేటి సదువా ఏటా? మోటోల్లము పొవ్వాకు అంతము. అదన్న మాట! పోవ్వకు బాగా పండిన తర్వాత ఎండబెట్టి, ఎండలోన అనుకుంట్టన్నారు! కాదమ్మో!ఎండబెట్టికండిమా! పాడైపోద్ది! మన యింట్లోన ఆరబెట్టినట్టు, ఏలాడగట్టాల. అప్పుడు తీసి సుట్టలు సుట్టుకొని, నోట్లోనెట్టి వూదితే,ఎలాగుంటాది, అంటననుకుంటన్నారు. నీనలపింటి మాట్లాడతాను.తప్పుకదూ! యిప్పుడికే ఎలాగంటే అలాగున్నారు.యిలపింటివి ఆలకిస్తే తిన్నగుంట్టారు. అప్పుడైతే మావోల్లు అదే పని.అడ్డపోగనెట్టుకొని గుప్పు గుప్పుని కాలిస్తే,గొప్పగుండేది.అలేటైనారందుకే!. అదేటమ్మ!ఆ జబ్బు!కేన్సరట!. ఒలమ్మ! నీకేటి పట్టుకున్నాది! యిన్రా నాయన! అని తల బాదుకున్నా యిన్నారా! ఎటైనాది. ఎప్పుడు సూడో, సుట్టలు కట్టడం, ఎట్టడం!  సుట్టలు కట్టడం, ఎట్టడం!. పోవ్వకు పంట ఎలాగ పండించొలు. ఎటుకాసనుకుంటన్నారు! మాది!. వోయిజాక్కి దెగ్గిరే! నాగ...
Image
Pani Puri బండి,ముచ్చిసంచి, సిల్వర్ బిందె, ఓ ప్లాస్టిక్ బకెట్టు! కనిపిస్తే!టక్కున కాళ్ళు ఆగిపోవడమే.ఏవంటే!పానీపూరి సీను అదంతా. చంపేస్తున్నార్రా బాబు. భరించలేక చస్తున్నాను.ఇంట్లొ చేసుకు తగలడచ్చు కదా!.అబ్బే! వాళ్ళావిడ కందిపోదూ. ఇది బావుంది!. అనారోగ్యలొచ్చాయంటే రావా మరి!. ఎక్కడో నీళ్లు పట్టేసి,ఆ బిందైనా తోవకుండా,ఎప్పుడో చేసిన గుల్లలు, వాటిలో కుక్కేసి కూర, ప్లేటులో పెట్టేసి ఇస్తే,ఎగరేసుకు తినెయ్యడమే. ఆత్మారాముణ్ణి క్షోభ పెట్టవన్నమాట. ఆకలేస్తే ఏదో గడ్డి కడుపులో తోసెయ్యడమే. అదే! "మమతా మోహన్ దాసు" పాట, ఏంటది! ఆ! గుర్తొచ్చింది,"ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే" వద్దులెండి, బాగోదు! ఓయబ్బో! ఏం హుషారొచ్చేసిందో గురుడుకి. తగ్గు!తగ్గు! చిందులేసేవో మీ ఆవిడ చేతిలో ఐపోతావు సుమీ!. అసలు విషయం మరచిపోయాము.ఆ చెయ్యి బిందెలో ముంచేసి యిస్తుంటే ఏవి అనిపించిందా. అందులో ఆషాడం, ఈగలు ముసురుతుంటే జబ్బులెందుకు రావు. మనం కోరి తెచ్చుకున్నవే అన్నీను. శుభ్రత, పరిశుభ్రత అని ఎందుకన్నారు. మాకు తెలుసులేవమ్మా! ఈ డైలాగు. "అసెంబ్లీ రౌడీలో" బ్రహ్మానందం గారు అన్నారు, పాకీజాతో.....అనీ అంటారని నాకు త...
Image
vanaprastha ashram నవమాసాలు మోసి, పెంచి పెద్దచేసి, పిల్లలే సర్వస్వంగా భావించి, ఎన్నో త్యాగాలు చేసినా,గుర్తించని స్థాయికి ఎదిగి, కన్నతల్లితండ్రులే భారమని తలచి, ఎప్పుడు వదిలించుకుందామా అనీ, వెయ్యి పన్నాగాలు పన్ని, ఆఖరికి అనుకున్నంత పని చేసి చేతులు దులుపుకున్న ఘనులు మావారసులు.  అనారోగ్యంతో బాధపడుతూ,కడుపుకింత తిండిలేకా,కట్టుకోడానికి మారు బట్టలేక,ఎవరికి చెప్పుకోవాలో మా బాధ తెలియక, ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాక, అందరు వున్నా,ఎవరు లేని అనాధల్లా ఉన్న మమ్ము ఆదుకొని అక్కున చేర్చుకున్న వృద్ధాశ్రమం మా వానప్రస్థాశ్రమం. ఇది మాలాంటి అభాగ్యుల పాలిట అదృష్ట నిలయం. మా కడుపున పుట్టకపోయిన, ఏ రక్త సంబంధం లేకపోయినా, ఏ జన్మలో మేము చేసుకున్న పుణ్యమో, ఏ ఋణానుబంధమో" నివాస్" అన్న పేరుతొ ఉన్న కొడుకుని మాకు భగవంతుడు ప్రసాదించాడని రోజు కనిపించని ఆ దేవుడికి , కనిపించే నివాసనే  దేవుడిని ప్రత్యక్షంగా చూస్తూ మనసులో కృతఙ్ఞతలు తెలుపుకుంటుంటాము. అందుకే అంటారు," దైవం మానుష రూపేణా" అనీ.  మనిషి రూపంలో భగవంతుడు వస్తాడని. ఆ బ్రహ్మ మనిషి బొమ్మ తయారు చేసి,ఊపిరిపోసి,అలసిపోయి,చివరిగా నుదుటి రాతరాసేవేళకి బహుశా...
Image
NAANANDI BABU "నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా".....ఏవిటీ! నువ్వు పాడితే లోకం పాడుతుందా నువ్వు ఆడితే లోకం ఆడుతుందా!....బాగుంది నాయనా బాగుంది!. " నా పాట పంచామృతం"....ఇదొకటా!........ అవును! డౌటా? శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుణ్ణి కాకపోవచ్చు! స్వరాలతో సయ్యాటలాడకపోవచ్చు! కానీ! సామాజిక గీతాలతో ఆకట్టుకున్నవాణ్ణి.    ఓహో! తమరి నామధేయము?.....దేవిశ్రీ!.  అయ్యా! మీ జన్మస్థలం?.......విజయనగరం జిల్లా, పార్వతీపురం తాలూకా, పెద్దింపేట అను గ్రామము......మీయొక్క విద్యాభ్యాసము ఎచట కొనసాగినది?. పార్వతీపురం పట్టణంలో కొనసాగినది. అటులనా! ప్రస్తుతము మీ నివాస స్థలము?.......విశాల హృదయులున్న విశాఖపట్టణము. ఓహో! విశాఖయా!.   మీరు ఏరకమైన పాటలు ఆలపించుచుంటిరి?.......సమాజహితం కోరి రచనలు చేస్తూ, ప్రజాగాయకుడినై,అన్ని ప్రదేశములు చుట్టి, పాటే ప్రాణంగా బతుకుచుంటిని.   ఆనందము!   మీవంటి గాయకుల పరిచయము మా మనసునకెంతో సంతసము.  అంతటితో ఆగవలదు! భవదీయుడు "దేవిశ్రీ"  మిక్కిలి పేరు గాంచిన ఒక జానపదగీతాల కార్యక్రమానికి "న్యాయనిర్ణేతగా" వ్యవహరించిన తీరు బహు ప్రశంసనీయము.  వహ్వా! వ...