Posts

Image
JANAPA CHENU గోంగూరని  పోలి వుంటాను!.....కానీ గోగూరని కాను!......ఆకులు,పువ్వులు,కాండం,పులుపు.....అచ్చం గోంగూరే!....నమ్ముతారా!.....పల్లెల్లో పరిచయస్తురాలినే!.....కానీ!......అందరికి తేలియాలిగా!.....ఇంతకీ!....నా పేరు చెప్పలేదు కదూ!......జనప.   జనప చేను చూస్తే!.....గోంగూర చేనా! అన్నట్టు ఉంట్టుంది...చూడ ముచ్చటగా!......యిది చాలా లాభాలు తెచ్చి పెట్టే పంట...రైతన్నలు  యిది పండించటానికి చాల ఆసక్తి కనబరచేవారు గతంలో....ఈ చేను బాగా ముదిరిన వెంటనే తీసి......ఊరి చివర ఉన్న, ఉపయోగంలో లేని, ఎవరు నీరు వాడని చెరువులో.......ఎందుకంటే మైలు దూరం లో వూరుతున్నప్పుడు.......భరించలేని దుర్వాసన కాబట్టి!...రోజుల కొద్దీ ఊరవేసి!....బాగా ఊరి చేతికి నార వస్తుంది అనిపించినప్పుడు.....వాటిని చెరువులోంచ్చి పైకి తీసి!.....కూలీలను పెట్టి నార ఒలిపించి!....మంచి ఎండలో అదే పనిగా......బాగా ఎండేంతవరకు......ఎండబెడతారు.....ఆ తరువాత కట్టలుగా కట్టి! ......తూనికలేసి అమ్ముతుంటారు.......వీటిని వ్యాపారాలు.....జ్యూట్ మిల్లులకు చేరవేస్తుంటారు......నా ఉపయోగాలేమిటో చెప్పగలరా?....ఊహు....తెలీదు కదూ!.....చెబుతాను వినండి.....బస్త...
Image
UDUKU UPMA ఏవిటండి చూస్తున్నాను!.....అదే పనిగా యెగతాళి చేస్తున్నారు!.....మరీ ఇంత వెటకారం పనికి రాదు!...నిజంగా నా వంక మీరు చూడ్డం లేదా?.....నిలువు నిస్తారం అబద్దాలాడ్డం ఏమైనా బాగుందా?.....అమ్మో! అమ్మో!.....ఏవేక్షను!....ఘుమ, ఘుమ లాడిపోతుంటే!.....ఆగలేకా!....అదేదో సినిమాలో పాటలా!...."ఎగరేసుకుపోతా నిన్ను ఎగరేసుకుపోతా"...అన్నట్టు!.....తెగ ఎగబడి పోతారు!....అయ్యో! అయ్యో!...."నా గోల గొంగలెత్తుకెళ్లా"....అసలు విషయం మర్చిపోయాను!....నా కోపం నేనూను!....తమరి ఆత్మారాముడు ఘోషించకుండా ఉండాలంటే!.....రకరకాల టిఫిన్లు అఘోరించాలి కదా!...అదేనండి నేను!.....అలుసైన "ఉప్మాని".....ఇడ్లీలు,దోసెలు,పూరీలు.....అబ్బో సూపర్ అంటారా!....నన్ను యీసడిస్తారా!....పేస్ బుక్కుల్లో, వాట్సాప్లో.....ఎక్కడ పడితే అక్కడ గాలి తీస్తారా!....నేనంటే ఏవనుకుంటున్నారు!.....పూర్వం పెళ్లిళ్లలో నన్నే ముందు పెట్టేవారు.....వంటవాళ్లు చక్కగా తయారు చేసి!......అరిటాకులోవేసి పెడితే!.....ఎగరేసుకు తినీ!....యెంత ఆనంద పడేవారో పెళ్ళివారు!....అందుకే కొన్ని ఇళ్లలో!....యిప్పటికీ  పెళ్లి ఉప్మా చేసేయ్!.....అనీ... పతిదేవుళ్లు సత...
Image
WELCOME అతిధులు రానీ!....బంధువులు రానీ!......స్నేహితులు రానీ!.....చేతులెత్తి నమస్కరిస్తూ!.....చిరునవ్వుతో పలకరించేది నేనే!.....తరవాతే మా యింట్లో వాళ్ళు......నాకు పెద్ద ఖర్చుండదు......రూపాయలు పెట్టి తెస్తే  చాలు!...నా పని నే చేసుకుపోతాను......ఇంతకీ!...నా పేరు....."వెల్కమ్".....అదేనండీ!.....మీ యింటి ప్రవేశ ద్వారం దగ్గర వేలాడిస్తారు కదా!.......వచ్చినవాళ్ళందరికి అదేపనిగా పలకరించమని!....ఆ గతిలేని గొట్టాన్ని!......ఎప్పస్ సేవకా వృత్తిని!....మంచ్చి నీళ్లు పొయ్యకపోయినా పర్లేదు!.....నేనుంటే.    అందుకే!.....గబుక్కున కొని పడేస్తే!.......ఓ మేకు కొట్టి గోడకి......నన్ను వేలాడదీస్తే......నా ఏడుపేదో నే ఏడుస్తాను......నాతొ వాళ్లకేం పని!.....ఎవరొచ్చినా హ్యాపీ.....వస్తారు....పోతారు......ఎందుకంటే స్వాగతం బాధ్యత నాది కదా!....నా చావేదో నే చస్తాను గనకా!....పూచి, పేచీ లేదు.....ఎంచక్కా వచ్చిన వాళ్ళని.....బుర్ర వాయించేసి పంపించేయడమే.....ఫ్రిజ్లో నీళ్లడిగినా బాధే!.....మళ్ళీ సీసాల్లో నీళ్లు నింపి పెట్టాలని!....నాకైతేనా ఏమి పెట్టక్కర్లేదు....ఆకలేస్తోంది...అన్నం పెట్టమంటానా....నవకాయ పిండివంటలడుగ...
Image
ACCIDENT గిల గిలా కొట్టుకుంటుంటే.....అలా చూస్తున్నారా...ఏం చెయ్యలేరా?........మాట్లాడాలంటే......కోన ఊపిరితో వున్నాను.....ఎలా?......ఆమ్మో....భరించలేని బాధ!.....అయినా తప్పదుగా......చెప్పాలి....నా పేరు "ప్రాణమండి".....నేను పని మీద రోడ్డెక్కేసరికీ!.....వెనకనుంచి గుర్తు తెలియని వాహనం.....గుద్దేసి వెళ్లిపోయిందండీ!.......తెల్లారి లేచి ఎవరి మొహం చూశానో  ఏమో!.....అయినా ఒకర్ని ఎందుకు నిందించాలి!.......ఎవరి ఖర్మకు ఎవరు కర్తలు!.....వస్తానని  ఎంత ఎదురు చూస్తున్నారో ఏమో!....మా కుటుంబసభ్యులు!.    నేను పడగానే!.....ఎక్కడ వాహనాలక్కడే నిలిపివేసి!.....పరుగు పరుగునొచ్చి!.....నా జేబులో పర్సు తీసి! ......చిరునామా కోసం వెదకి!.....ఇంకా దొరకకపోతే!.....నా ఫోన్ తీసుకొని!.....మా వాళ్లకి తెలియజేసే ప్రయత్నం చేసి!......ఆంబులెన్సుని రప్పించి!.....ఎంతో తపన పడుతున్నారు.......నా ప్రాణం నిలపడానికి!......బానే వుంది.     అదే మీరు నన్ను సెకన్లలో .....వెనకా, ముందు ఆలోచించకుండా!.....వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి!....జాయిన్ చేసి!......అవసరమైన రక్తం.....మీలో ఎవరిది సరిపడుతుందో......వైద్యుల సలహా మేర...
Image
ACID DADI బంగారు భవితను పాడుచేశానంటారు!.....నేనంటే అసహ్యించుకుంటారు!......నా పేరు వినడానికే భయపడుతుంటారు!......ఆమ్మో చెప్పాలంటే భయమేస్తోంది.!....అయినా చెప్పాలి కదా!...నేనెవరో!...ఏంటో!...నేను అతి ప్రమాదకరమైన రసాయనాన్నండి!.......అదే "యాసిడ్ని".......ప్రేమంటూ బతుకు బుగ్గిపాలు చేసుకుంటున్నారే!......నన్ను తీసుకెళ్లి! .....నా పరువు తీసి మంట కలుపుతున్నారే!.....ఏంటండీ యిది?.....నన్ను ఒక మంచి పని కోసం పుట్టిస్తే......యి చెత్తపనులేంటి?...నేనే దొరికానా?......నేనేదో పిల్లల భవితకోసం పాటుపడుతూ ......ప్రయోగశాలలలో ఉంటూ,మీ యింటి నాచులు, ఇతర అపరిశుబ్రాలకు.....ఉపయోగపడుతూ.......నామానాన నేనుంటే!.......మీకిదేం పని?.......అసలు నాకు చిన్న సందేహం!........యి యాసిడ్ ఎలా వస్తోంది......ఎక్కడనుంచి  తెస్తున్నారు?.....మంచి నీళ్ల సీసాల్లా పట్టుకెళ్తుంటే....ఎవరికి అనుమానం కలగడం లేదా?.....ఆపటానికి ప్రయత్నం చేయలేకపోతున్నారా?.....ప్రేమ పేరుతొ జీవితం నాశనం చేసుకుంటారా?......ప్రేమ విఫలమైతే.....ఇంక బతుకు లేదా?......నిరాశా నిస్పృహలకు లోనుకావడమేనా?.....ఆలోచించండి!......క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.....భవిష్యత్...
Image
TAMALAPAAKU శుభాలకి పెట్టింది పేరు!.....ప్రశంసలజోరు!......జయాల హోరు!.... నా అందం తీరు!.....నా స్థాయే వేరు!......నీ అంత్య ప్రాస ఆపవమ్మా!......ఎవరు నువ్వు?.   తూటుబడ్డాకు,దూలగుండాకు కాదు!......ఇంకా మీకు కావాలంటే క్లూ యిస్తాను......ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారి చిత్రం.....ఒక సన్నివేశంలో......నా పేరు హల్ చల్ చేసింది.....ఆ ఆ.....గుర్తుకొచ్చింది!....  వెరీ గుడ్......వేగం వేలిగిందే!........అవును మరి!......ఎంత పెద్ద  హిట్టూ!.....నవ్వాగితేకదా!...సరే.....విషయానికొద్దాం.....నా పేరు....."తమలపాకు".....అలాగా!....క్షమించమ్మా..... ఎవరో అనుకున్నాం....".తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ".......".దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత"...డైరెక్టర్ శ్రీ.కె. విశ్వనాధ్ గారి.....".రుద్రవీణ" సినిమాలో  పాట అందుకోండర్రా! ....అద్దీ.....చూసారా.....నువ్వని  తెలియగానే......మావాళ్లు ఎంత హడావిడి చేస్తున్నారో!.....నువ్వంటే......మా ప్రాణం,మా ధ్యానం!......పూజలంటే నువ్వే!......పెళ్లంటే నువ్వే!.....పేరంటానికైతే నువ్వే.!.....అసలు నువ్వంటూ లేకపోతె ఎలా!......నువ్వుంటేనే మేము!.....తాంబూలాలు మార...
Image
"KANJEERA" " ఏవే జయప్రభా"....నీకెంత ధైర్యమే!.....ఆ డప్పు గురించి.....చాటింపేశావే!.......మరి నా గురించి చెప్పలేదేమీ !....నీ కంటికి నే కనిపించలేదా?.....గుర్తుకు రాలేదా?......నీ పొగరలావుందన్న మాట!....అయ్యో ఎంత మాట "కంజీరస్వామి".....చెబుదామని అనుకున్నంతలో.....మీరొచ్చారు.....సరే!...కానీ!.  చిత్తం, చిత్తం, మహాప్రభో!...ఆగ్రహించవలదు!....మొదలు పెట్టేస్తున్నా స్వామి!....ముఖ పుస్తక స్నేహితులారా!.....మా కంజీర వాయిద్యంవారు....ఎంత గొప్పవారనగా!....వారి గురించి ఎంత చెప్పినా.....తక్కువే అవుతుంది.   ఒక చిన్న సంచీలో....ఎంచక్కా మనవెంట.....తీసుకెళ్లే వాద్య పరికరం ఏదనగా!.....కంజీర మాత్రమే!.....మనం చేతితో వాయిస్తూ......హాయిగా యింకో చేత్తో తాళం కూడా వేసుకొనే......సదుపాయం గల వాద్య  పరికరం.....పాట పాడుతూ....ఎంతసేపైనా....మైమరచిపోతాం వీరు గనక ఉంటే.....వీరిని తీసుకెళ్ళీ.....భజనలు, గజళ్ళు, సామాజిక చైతన్యగీతాలు, జానపదగీతాలు.....ఎన్ని పాడుతుంటారో......చూస్తే ముచ్చటేస్తుంది.  మన  "గజల్ శ్రీనివాసుగారు".....అదేనండీ!....ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గజల్ గాయకులు!....వారి వెంట వీరు ...