Posts

డ్యూయెట్ లిరిసిస్ట్,జె.పీ.ఎస్. అతడు; ఏదోలా వుందే ఏదెదోలావుందే నిను చూసినవేళా నాలో ఇంకేదో అవుతోందే ఆమె; ఏంటో అనుకుందే యింకేంటో అనుకుందే చిరునవ్వులకర్ధం నీలో అది ఏంటో తెలిసిందే చరణం; అతడు; నా తలపుల వలపుల గమకం తియ తియ్యని తేనెల మధురం ఆమె; నా మనసున నిలిచిన ప్రణయం చల చల్లగ తాకిన పవనం అతడు; అనుకోని ఆరాటం అందిస్తా ఆహ్వానం ఆమె; ఇక లేదే ఆషాడం మరి రేపే తాంబూలం '' ఏదోలా' చరణం ఆమె; నా కనులకు కలలకు సాక్ష్యం ప్రేమాంకిత మృధు భావం అతడు; నా తనువుకు తపనకు మూలం నును సిగ్గుల నీ వదనం ఆమె; మది చేసే విన్యాసం మురిపించే రస నాదం అతడు; అరుదెంచే కార్తీకం ఆనందం మన సొంతం 'ఏదోలా'
https://www.facebook.com/prabha.sharma.756412/videos/vb.100008035569571/1991897737754726/?type=3&theater
Image
"VAMMO NORU" ఏదైనా చెయ్యగల సమర్ధత,ఎంతకైనా తెగించే దుడుకు స్వభావం, కత్తికైనా లేని పదును, మాటల తూటాని,మరో ఆయుధాన్ని. దేనికైనా తాళాలు వున్నాయి గాని...మనకి!!అబ్బే!! ఎవ్వరి తరం కాదు!!. నీ వాగుడు వరద ఆపవే బాబు!!నువ్వెవరో చెప్పి ఏడు!!....అదే మరి!!చెబుతున్నా!!వినండి!!మీ నోరుని!!అడ్డు అదుపు లేనిదాన్ని!!.నెలల పిల్ల నుంచి బెంగ పడిపోతూంట్టారు.ఎక్కడ మాటలు రావో అని.వస పోసేసేవాళ్ళు కొందరైతే,వైద్యుల దగ్గరకు మోసుకెలిపేవాళ్లు కొందరు.అమ్మ!!అని పిలుపు వింటే చాలు.ఉత్సాహంతో ఉరుకులు, పరుగులు, అడిగిన వాళ్లకి, అడగనివాళ్ళకి చెప్పుకొని...ఓ..ఎంత మురిసిపోతారో. ఇంక అక్కడ్నుంచి ఉంటాయి  రకరకాల జిమ్మిక్కులు.ఇహ వున్నత స్థానానికి తీసుకెళ్లాలన్న, పతనం చేయాలన్న, మనదే ఆపరేషన్ అంతా.మాట అన్నది మణి మాణిక్యాలకన్నా విలువైనది.మాయల ఫకీరు చిలక ప్రాణంలా మనమే మూల కారణం.పాతాళానికి తోయవేయబడ్డారంటే మనదే ఆ ఘన కార్యం. అందుకే అంటారు నోరా!!తేమాకే వీపుకి!! అని. అయినా విని ఏడిస్తేగా!!. బాధ పడితే గాని బోధపడదని!!.పదిమందిలో మాట్లాడాలంటే మామూలు విషయమా?.....చక్కని పలుకు పలికి,తీయటి మాట్లాడొద్దని అన్నానా?. అయ్యో!!అయ్యో!!ఎంత మాటనేస్...
Image
మెట్టు భూమి, రచన జె.పీ.ఎస్. వానతల్లి నీకు దండమే కరుణించి చల్లగ కురియవే జోరువాన నీకోసమే పడిగాపులూ పడుతున్నమే పరుగులెత్తి మాకోసమే కురిసి పచ్చని పంటలనివ్వవే భూమి తల్లినీ నమ్మినం చెమట ధారపోసి బతికినం కన్నీళ్ల కష్టాన్ని చూసినం కడుపుకింత తిండి మరిచినం బీటలోరి భూమి బద్దలై బాధఒడిసిపట్టి మరి ఏడ్సినం ఉన్నఊరినీ వదిలినం తప్పదంటు పట్నమెల్లినం మెట్టభూమికి దండమెట్టినం మెతుకుకోసమై వెతికినం మల్లి రావాలంటు మొక్కినం ఇహ కాని వూరు బండి ఎక్కినం
Image
నాగులచవితి,రచన,జె.పీ.ఎస్. కార్తీక మాసం వచ్చింది కన్నుల్లో వెలుగు తెచ్చింది నాగన్న పండగ వచ్చింది నాగులచవితి రోజు ఇది తొలి ఝామునే నిద్ర లేచాము తలార స్నానం చేసాము ముంగిట కళ్ళాపి చల్లాము ముత్యాల ముగ్గులు పెట్టాము పూలు ఫలములు పూజాద్రవ్యాలు ఏరికూర్చి మేముంచాము చిమ్మిలి దంచి ఉంచాము చలిమిడి ఉండలు చేసాము నాగులగావంచ తెచ్చాము నాగేంద్ర నీకు మొక్కాము వడపప్పుపానకం నారీకేళము పుట్టనుంచి నిను కొలిచాము నాగేశ్వర నిన్ను తలచాము మా మనమ్మునా నిలిపాము చిన్న పెద్ద తరలొచ్చాము శివాభరణ పూజించాము అగరుబత్తులు సీమటపాసులు కాల్చి మురిసి తరియించాము
Image
ప్రక్రుతి విలయతాండవం,హుదూద్, జె.పీ.ఎస్. సరిగ్గా మూడేళ్ళక్రితం ముచ్చెమటలు పట్టే రోజు గుండె దడ పుట్టే రోజు విశాఖ విల విల లాడే రోజు అర చేతిలో ప్రాణం పెట్టుకున్న రోజు భయాందోళనకు గురి కాబడిన రోజు ప్రక్రుతి తల్లి ఆగ్రహానికి బలి ఐన రోజు అస్తవ్యస్తంగా ఉన్నవిశాఖని చూసి ఏడ్చిన రోజు మళ్ళీ పూర్వ వైభవం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన రోజు ఎప్పుడు విశాఖని ప్రేమగా లాలించే ప్రకృతితల్లి ఎందుకు కోపగించిందో తెలియని పరీస్థితి వాతావరణ శాఖవారి హెచ్చరిక మామూలే అనుకున్నాం ఇస్రో చెప్పినా ఖాతరు చేయకుండా చూసాం కానీ అనుకున్నంతా ఐంది భవంతులు సైతం ఉయ్యాల లూగాయి వందల చరిత్ర మానులు కూకటి వేళ్ళతో నేలకొరిగాయి నిద్రలేదు హారం లేదు పాలులేవు నీళ్లు లేవు విద్యుత్తు సౌకర్యం లేదు సమాచార వ్యవస్థ కనుమరుగు ఏ దిష్టి తగిలిందో అని ఒకటికి పదిసార్లు అనుకున్న రోజు ఆసియాలోనే అభివృద్ధిపథంలో ప్రధమ స్థానం విశాఖ అందం ఆనందం ఆహ్లాదానికి పెట్టింది పేరు విశాఖ సాగర తీరం చల్లనిగాలితో పర్యాటకులను సమ్మోహనపరిచే విశాఖ కానీ! గతం కంటే అందం రెట్టింపని జనం మెచ్చే రోజు! ఈ రోజు మా విశాఖ ఎప్పటికీ ఇలానే వుండాలని కోరుకుంటున్నాము పచ్చని గిరుల మధ్య పదిలంగా ...
Image
జానపద యుగళ గీతం ,రచన జె.పీ.ఎస్. 4 Years back c.d kosamai raasindi  తూటూ పూల రంగు కోకా...... తెచ్చానే నీకు కట్టుకోగా ఉమ్మెత్తా పూల రంగు సొక్కా...... ఏసావంటే పూలరంగా నీ సెవికి కమ్మలు ఎడతా నువ్వు సెప్పినట్టు నేనింటా నా పేనమంటె నువ్వంటా నీ మాట జవదాటనంటా నా నవ్వుల సింగారి ముద్దుల బంగారి నువ్వేను నా జాపత్రి నీ ఏలి పట్టి నే నడుత్తా నీతోనే నాకు లోకమంతా నీ గుండెలోన నిదురపోతా నీ యెంట తోడు నేనంటా ఆ పూలన్ని ఏరీ నీ పాదాల ఏసీ చేస్తాను పూజను ఏటీ