Posts

Image
CHIRU VYAPAARI రోజంతా కష్టపడతాను.అత్యాశకు పోను.పదో పరకో మిగిలితే చాలు, అదే పది వేలనుకుంటాను. ఇంతకీ నేనెవరో చెప్పలేదుకదూ!. ఏదో వున్నదాన్లో ఉన్నంత, కుటుంబసభ్యులను బాగా చూసుకోవాలి అని తాపత్రయ పడుతున్న చిరు వ్యాపారిని. ఎలాగోలా నానా తంటాలు పడి, డబ్బులు పోగు చేసుకొని వ్యాపారం మొదలెడితే నా పాట్లు ఇన్నీ అన్నీనా.అయ్యో! ఇలాంటి వాళ్ళదగ్గరే కొనాలని గాని, వీళ్ళనికూడా ప్రోత్సహించాలనిగాని....అబ్బే! అనిపిస్తేనా! ఊహు!. అవును! మాదగ్గర ఏముంటాయని. ఖరీదైన షాపు, ఏ.సి, పనివాళ్ళు ఇతర ఆర్భాటాలు ఉంటేగా. కనీసం ఆ మాటాడే మాటేనా చేతకాదు. అదే వాళ్ళైతేనా, ఇంగ్లీషులో  స్వాగతము చెబుతారు, వచ్చేస్తుంటే వీడ్కోలు పలుకుతారు, ఫ్రిజ్లో వున్న నీళ్లు తీసుకొచ్చి పెడతారు, చక్కటి కుర్చీలేర్పాటుచేస్తారు. అడుగుపెడితే రావాలినిపించదు. అదే మేమయితేనా!చెమటతో తడిసి ముద్దైన బట్టలు, మోటు మాటలు,కొనండి, కొనండి అంటూ కాళ్ళా వేళ్ళ పడటం కాస్తంత చికాకు కలిగించినా, బాగానే వస్తారు. కాకపొతే వచ్చిన చిక్కంతా బేరాలదగ్గరే. ఏవండీ! తెలీక అడుగుతాను! ఇది ఏమైనా బాగుందా! మేము కూడాఎంతో కష్టపడి కొనుగోలు చేసి తెచ్చినవే కదా! ఎండనక, వాననకా,వొంట్లో బాగాలేకపో...
Image
COLLEGE DAYS హిందీ బడా బడా, నా గుండె దడా దడా అని చిన్నప్పుడు చాలా భయముండేది. కానీ రాను రాను దానిపై ఒకరకమైన ఇంటరెస్ట్ పెరిగి,హిందీ పరీక్షలు రాయాలనే తపనతో రాసి పరీక్షలు పాసవడం జరిగింది.అలాగే లెక్కలంటే పై ప్రాణాలు పైనే పోయేవి.ఎలా ఒడ్డెక్కుతానురా బాబు అని ఒకటే చింత.ఎలాగోలా ఒడ్డెక్కి,ఇంటర్లో  జాయిన్ అవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం అయింది.అక్కడ బై.పీ,సి, ఊహు లాభం లేదు,ఏం.పీ.సి,అమ్మో లెక్కలు, హెచ్.ఈ.సి, ఆ హిస్టరీలు అవి అబ్బే, ఇహ కామర్సు ఒక్కటే మనకు దిక్కు,  చూస్తే,ఓకే అనుకోని జాయిన్ ఐపోయాను.ఇంక చూస్కోండి, నా బాధ వర్ణనాతీతం.ఏంట్రా నాయనా, మళ్ళీ ఇక్కడ కూడా డెబిట్లు, క్రెడిట్లు, లెక్కల్లాగే ఉన్నాయని బెంబేలెత్తిపోయా. దానికి ఎనిమిది గంటలకు ట్యూషను.రోజు తెల్లవారకుండానే రెడీ అయిపోయి, మా ఊరినుంచి  మొదటి బస్సులో బయలుదేరి ప్రయాణం చేసి,ఉదయం ఎనిమిది గంటలకి  ప్రైవేట్ క్లాసులు, ఆ తరువాత టైపురైటింగ్ క్లాసులు,కాలేజీ క్లాసులు. ఆదివారం నాడు ఎన్.సి.సి క్లాసులు. అదిమాత్రం మనకిష్టమైనది.హుషారే హుషార్.భలేవుండేది.ఎంచక్కా క్లాసుకి వెళ్లేముందు ఏవైతే పెట్టారో, అవి లాగించేసి సంబరమే సంబరం. మా క...
Image
Jai Ganesha గణాలకు అధిపతి,అల్పసంతోషి, అడగగానే వరాలిచ్చేవాడు,ఆదిదేవుడు,ఏ శుభకార్యం చేసిన ముందు స్వామివారిని,విఘ్నేశ్వరుడా,వినాయకా, చల్లనివాఁడా, గణాధిపా అని స్మరియించి కొలిచే భక్తుల ఆరాధ్య దైవం,గౌరీపుత్రుని లోకమంతా పూజించే రోజు. అదే వినాయచవితి రోజు. పేదా, ధనికా, ప్రాంతీయం అని లేకుండా అత్యంత వైభవంగా పూజలు చేసి, ఆ లంబోదరుని  సేవలో తరించి మురిసిపోయే రోజు రానే వచ్చిందని చెప్పలేని ఆనందం.మాటలు చాలని మహోత్సవం.కన్నుల వైభవం.పార్వతీదేవి అతి ప్రియంగా, స్వయంగా  తయారుచేసుకుని, ప్రాణ ప్రతిష్ట చేసుకున్నగారాల బిడ్డ పండగ. మహేశ్వరుని ఆగ్రహానికి గురి ఐన తదుపరి, తన ప్రియసఖి పార్వతీదేవి శోకాన్ని చూసి తట్టుకోలేక, జరిగిన వృత్తాన్తమ్ తెలుసుకొని, మరల మహేశ్వరుని ప్రేమను పొంది,ప్రాణప్రతిష్టుడైన గజముఖవదనుని ఘనమైన కడు రమ్యమైన సుదినం. వజ్రవైదూర్య, మరకత మాణిక్యాలనేవి ఆశించనివాడు. అతి తెలివైన వాడు.అందుకే సోదరుడు సుబ్రహ్మణ్య స్వామితో,ప్రపంచం మొత్తం చుట్టి ఎవరు ముందొస్తారో చూద్దాం రమ్మని పందెం కట్టి గెలిచినవాడు. పాపం అమాయకంగా సుబ్రహ్మణ్యుడు ప్రపంచం అంతా చుట్టి వచ్చేసరికి, అక్కడే కొలువుతీరున్న స్వామిని చూసి, ...
Image
Nanamma Vantillu మా నానమ్మ వంటిల్లు ఇప్పుడు తలపుకొస్తే ఎంత ముచ్చటేస్తుందో. భలేగా ఉండేది.గేసుపొయ్యి అంటే చచ్చేంత భయం. వాడేది కాదు.ఎంచక్కా బంకమట్టితో స్వయంగా ఒక మంచి రోజు చూసుకొని,పొయ్యి  వేసుకొని, కొట్టించి షెడ్డులో ఉంచిన కర్రలతో మంట పెట్టి, యిత్తడి గిన్నెల్లో మాత్రమే వంట చేసి,వంట పూర్తవగానే మళ్ళీ ఆవు పేడతో అలికి ముగ్గుపెట్టి ఉంచుకొనేది మర్నాటికి.వంట పూర్తికాగానే మా తాతగారికి ప్రత్యేకమైన పెద్ద పీట వేసి,దగ్గరుండి వడ్డించేది.తాతగారి భోజనమవగానే అదే కంచంలో మా నాన్నమ్మ భోజనం చేసేది.నాన్నమ్మ సంవత్సరానికి సరిపడా, ఆవకాయ, మాగాయ తయారు చేసి పెద్ద పెద్ద గూనల్లో పెట్టి, వాటికింద మట్టు పెట్టి, అటక మీద ఉంచేది.వడ్డనకు కావలసింది చిన్న రాచిప్పలో తీస్తూ ఉండేది. పండించిన పొట్టుమినపప్పు నానేసి, పెద్ద రుబ్బురోల్లో రుబ్బి,నానబెట్టిన బియ్యం పిండి దంచి,అట్లు ఇనప పెనంపై వేస్తె, తింటుంటే తినాలనిపించేలా ఉండేవి. బియ్యంనూకైతే తిరగలిలో మాత్రమే విసిరేది. అడ్డకచ్చా, కాళ్లకు అల్లిక కడియాలు,కుత్తిగంటు, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతోఉండేది.చచ్చేంత మడి. మునసబమ్మ అని పిలిచేవారు అందరు.నేను తాతగారింటికి వెళ్తే తెల్లారేసర...
Image
KATHI MASTER మా ఇంటికి కూతవేటు దూరంలో నాగావళి నది, ఇంటి పక్కనే గాయత్రీ కోవెల. రోడ్డుకి ఆనుకొని మా ఇల్లు. వూరికి కొంచెం దూరంగా ప్రశాంతవాతావరణంలో ఉంటుంది. మా యింటి వీధి మార్గంలో ఇరువైపులా,సుమారు పదిహేను కొబ్బరి చెట్లతో, పెరటిలో నిమ్మ, అరటి, బొప్పాయి, నారింజ, కమల,సంపంగి,మందార,గులాబీ మల్లి,ములగ, గోరింట,కరివేపాకు మొదలగు అనేక రకాల మొక్కలతో,  అలాగే దాన్ని ఆనుకొని పొలం, కళ్ళాలు, నీళ్ల బోరింగులు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంట్టాయి. మా నాన్నగారంటే మా చుట్టుపక్క గ్రామాలవారందరికి ఎంతో అభిమానం, గౌరవం. రాజకీయం నుంచి వ్యవసాయం వారివరకు అందరికి  మంచి సలహాలవి ఇస్తూ, నిజాయితీగా, నిస్వార్ధంగా వుండే వ్యక్తిత్వం అని.అప్పట్లో ఎందరో ప్రభుత్వ ఉద్యోగాలని పట్నాలకి వెళ్లి స్థిరపడినా, ఉన్న వూరిపై మమకారంతో,ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగి,అక్కడే ఉండి, ఉన్న ఊళ్ళోనే సంతోషమని నమ్ముకొని వున్నవారు. తన తమ్ముడు,చిన్నాన్నలు వెళ్ళిపోతూ, నువ్వు కూడా వచ్చేస్తే బాగుండు అన్నా కూడా ఆ విషయాన్నే విస్మరించి, ఉన్న ఊళ్ళోనే స్థిరపడుట జరిగింది.   ఏ విషయమడిగిన చెప్పగల సమర్థులు,లోక జ్ఞానం వున్నవారు. అప్పట్లో హిందీ పరీక్షలు,మునసబు,...
Image
MAA THATHAGARI OORU మా ముత్తాతగారు మునసబు. మా తాతగారు మూడూళ్ళకు మునసబుగా ఉండేవారు. తరతరాలనుంచి మా తాతగార్లది మునసబు గిరి.మా ముత్తాతగారు తవ్వించిన చెరువులు,తోటలు అని యిప్పటికి చెప్పుకుంటుంటారు. అంత మంచి పనులు చేసేవారని పేరు.మా తాతగారికి వ్యవసాయం అంటే వల్లమాలిన ప్రేమ. మా పొలం నాగావళికి ఆనుకొని ఉండేది.తెల్లారి లేస్తూనే పొలానికి వెళ్లి, అక్కడ మొక్కలు పాతడం,గొప్పులు తవ్వడం చేస్తూ వుండేవారు మా తాతగారు. మా ఊరిపక్కనే మా తాతగారి గ్రామం.నేను ఆ వూరికి వెళ్తే,పొలానికి వెళ్లి తాతగారికి బుల్లి ఒంటి కప్పు క్యానుతో( రెండు గ్లాసులు పెద్ద సైజువి) పట్టేవి పాలు తీసుకెళ్లి యిచ్చేదాన్ని.కాఫి, టీలు అస్సలు తాగేవారు కాదు.ఆరడుగుల ఎత్తు ఉండేవారు.ఓ సారి పొలానికి వెళ్ళినప్పుడు పాముని తొక్కేస్తే నా కాలుకి చుట్టేసి కాటు వేస్తె, ఒక్క కేక వేసి భయంతో పాముని లాగి విసిరేసాను. ఆర్మీలో పని చేస్తూ సెలవు మీద వచ్చిన మా చిన్నాన్నగారు చూసి, విషం పాకకుండా వుండాలని అక్కడున్న జనపనార తీసి బిగించి కట్టువేయడం, వైద్యుని దగ్గరకు తీసుకెళ్లడం ఎప్పటికి మరువలేనిది.పొలంలో కూడా తాతగారు రెండు చెరువులు తవ్వించి చుట్టూ గట్లు మీద కొబ్బరి, ఆక...
Image
"లలిత గీతం" "పల్లవి" : మోహన రాగమా నవవసంత గీతమా విరితేనెల మధురిమా నా ప్రేయసి హృదయమా "మోహన" " చరణం" : అరవిరిసిన మందారం నునుసిగ్గుల బంగారం చిరునవ్వుల సింగారం సిరిమువ్వల పదనాట్యం కవినై కమ్మని కావ్యం రాయాలని మది భావం "మోహన" "చరణం" : అలరించిన నీ అందం నాజీవన మకరందం నీ నుదుటను సింధూరం నిలవాలి చిరకాలం వలపై తీయని నాదం పలకాలని మృదుమధురం "మోహన" లలితగీతం, రచన, జయప్రభాశర్మ.