"Theylu" తేలుకుట్టిన దొంగ!....ఎర్రతేలులా మొహం ఇదీనూ!.....అవునూ! ఎప్పుడు ఏదో ఒకటి వాగడమేనా!...ఇంకేం పని ఉండదా!......మీకో నమస్కారంరా బాబూ!....మీ దగ్గర వున్నన్ని మాటలు!.....ప్రపంచం మొత్తం వెదకినా ఉండవేమో!......ఓమాటడుగుతాను !....సమాధానం చెప్పండి!...మీరే గొప్పనుకుంటున్నారా?.....తప ్పు!......ఆ ఆలోచన మార్చుకోండి!....సృష్టిలో ప్రతీ ప్రాణి గొప్పదే!....ఇంత తెలివితేటలుండీ!.....గుర్తి చరేం!....ఏదో ఒకటి విమర్శిస ్తూనే వుంటారు!....దానికి తోడు సామెతలొకటి!.....అవునండి!.. ...మాకు రూపు లేకపోవచ్చు!....మేము విష పూరితం కావచ్చు!....కానీ!....మేము కుట్టాలని ఎప్పుడూ అనుకోమండి!....ఏదో మా బతుకు మేం బతుకుతాం!.....మీరే చూసుకోకుండా!....మమ్మల్ని తొక్కడం అదీ చేస్తూవుంటారు!.....దాంతో ఆ గాబరాలొ!....అనుకోకుండా కుట్టాల్సి వస్తుంది!....మీరు మాత్రం!.....ఎవరైనా మీ జోలికి!....అనవసరంగా వస్తే! ఏం చేస్తారు!..ఊరుకుంటారా!.... .తాట తియ్యరూ!.......అలాగే మేం కూడా!.....అంతేగానీ హానీ తలపెట్టాలని ఎప్పుడూ అనుకోము!.....అందుకే!.....త ెల్లారి లేచి నరుడి కంట పడకూడదనే!.....దణ్ణం పెట్టుకుంటాం!.....కంట పడినా మీరు వొదలరు గనక!....మ
Posts
Showing posts from 2020
- Get link
- X
- Other Apps
"YO YO YOUTUBE" యూట్యూబునండి బాబూ......యు ట్యూబుని.....మీకు ఏది కావాలంటే అది......ఎప్పుడు కావాలంటే అప్పుడు....అందించే సత్తా గలదాన్ని.....ప్రపంచవ్యాప్త ంగా.....ఎక్కడ ఏది జరిగినా.....బ్రహ్మాండంగా చూపిస్తాను...అంత సమర్ధత వున్నవారు.....ఇంత వరకు ఎవరైనా తారసపడ్డారా.....వుండరు.... .నాకు తెల్సు....నేనెంత గొప్పదాన్నంటే....మీలో ఏ కళ వున్నా.....విశ్వవ్యాప్తంగా తెలియబరుస్తాను.....మీరు చేసే సేవ కార్యక్రమాలకి... .వేదిక నవుతాను.....రూపాయితో పనిలేని దాన్ని.....ఇంత నిజాయితీగా.....ఈరోజుల్లో.. ...ఎవరున్నారు చెప్పండి.....ఉంటే అది నేనే......ఎప్పుడు మీరొచ్చినా.....ఆహ్వానం పలుకుతూనే వుంటాను....నాకు విసుగు, విరామం ఉండదు....విసుక్కుంటే మీరే విసుక్కోవాలి.....వింతలు, విడ్డూరాలు.....ఆధ్యాత్మిక కార్యక్రమాలు......సాంస్కృత ిక కార్యక్రమాలు.....చలన చిత్రాలు.....ప్రముఖుల ప్రసంగాలు.....విద్య బోధనలు.....మీరేదడిగినా.... .సెకెన్లలో అందిస్తాను.....యిలా ఎవ్వరైనా ఉన్నారా....అబ్బే...ఓ పని మీద...మరో పని చేబితేనే....చిర్రు బుర్రులు.....నాకు ఆకలి నిద్ర.....పగలు రాత్రి....కోపాలు, తాపాలు.....యీర్షలు, అసూయలు.....చిన్
- Get link
- X
- Other Apps
గజరాజు ఆత్మ ఘోష ఏనుగమ్మ ఏనుగు... ఏవురొచ్చిందేనుగు...మా ఊరొచ్చిందేనుగు...మంచినీళ్లు తాగిందేనుగు అంటూ ఎంత బాగా లాలిస్తూ మీ బుజ్జి పాపాల్ని ఆడిస్తారో కదా.నోరులేకపోయినా, నేను మీలా పాడలేకపోయినా, నా బిడ్డకోసం ఎన్నో కలలు కన్నా.కానీ కానరాని దూరతీరాలకి నన్ను సాగనంపారు బిడ్డతో సహా.నేనేం చేశానని?.నిండు గర్భిణిని అని చూడకుండా క్రూరాతిక్రూరంగా నన్ను మట్టుబెట్టారు.పండుని ఎర చూపిప్రాణాలు తీశారు. మనసు ఎలా ఒప్పిందో.నేను వస్తే చాలు. దీవెనలందించమంటారు.నన్ను చూస్తే చాలు ముచ్చట పడి , నన్ను అదే పనిగా తడిమి,తడిమి ఎంతో ఆనందపడతారు.నన్ను దైవంశసంభూతురాలిగా కొలుస్తారు.ఆశీస్సులందించటమే కానీ హానీ తలపెట్టని నైజం నాది.అలాంటి నన్ను హతమార్చడం భావ్యమేనా?. ఆనందంగా తిందామన్న పండు ప్రాణం తీస్తుందని తెలిసుంటే,తినేదాన్ని కాదు.బాధతో నరకయాతన పడుతున్నా,ఆలోచిస్తున్నది నా కడుపులో దాగున్న నా బిడ్డకోసం, నా కడుపున ఎందుకు పడ్డావు అని.ఎవరైనా వస్తే బావుండు, రక్షిస్తే బావుండు అని ఒకటే ఎదురుచూపులు.బాధని తట్టుకోలేక నీళ్లమడుగులో దిగి శోకసంద్రంలో మునిగిపోయిన నాకు.నా వేదన అరణ్యరోదనగా మిగిలిపోయింది.నాడు విష
- Get link
- X
- Other Apps
వలస కార్మికుల కష్టాలు రచన:జయప్రభాశర్మ ఉన్నవూరిలో బతుకు భారమై పొట్టకూటికోసం పరరాష్ట్రం పరుగులు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు.కడుపుకింత తిండికోసం అష్టకష్టాలు.ఏదో మా బతుకు మేము బతుకుతున్నాం అనుకుని తృప్తి పడుతున్నతరుణంలో ఎక్కడ్నుంచి ఊడిపడిందో, రాకాసి మహమ్మారి కరోనా అట. మా కడుపు కొట్టి,మా పిల్లాపాపల్ని ఎంత హింసకు గురి చేసిందో చెప్పలేం.మీరు ఇంక పనికి రావద్దు, అని యజమాని చెప్పిన పిడుగులాంటి వార్తతో, ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి.కాలు, చెయ్యాడక, నోటి మాటరాక దీనస్థితి.ఎంత కష్టమైనా, ఇష్టంగా భావిస్తూ, ఇంటివారికి మూడుపూటలా కడుపునిండా అన్నం పెట్టగలుగుతున్నామన్న తృప్తితో జీవిస్తున్న మాకు ఇటువంటి పరీక్ష ఎదురవుతుందని కలలో కూడా వూహించలేకపోయాము.యజమాని ఇచ్చిన షెడ్డుల్లో కొంతమంది ఉంటే,ఇంకొంతమంది ఏ ఫుట్పాత్లమీదో, బషెల్టర్లలోనో కాలక్షేపం చేస్తూ గడుపుకోవడం.అదికూడా ఇప్పుడు లేదు, ఉన్నపళంగా మీ ఊళ్ళు వెళ్లిపోండి అని చెబితే ఎలా వెళ్ళేది. ఏరకమైన వాహనాల జాడ లేదు.నిర్మానుష్యమైన రోడ్లు,మనుష సంచారం లేని నగరాలు.బాధ పంచుకునేందుకు నా అన్నవారు కానరాక, ఆఖరికి ఒకటే నిర్ణయం.ఎంత దూరమైన కా
- Get link
- X
- Other Apps
కొరోనా హైరానా రచన,ప్రభాశర్మ. ఒడ్డున పడ్డ చేపపిల్లలా!! ఎందుకలా గింజుకుంటున్నావు గిల గిలా!! కొన్నాళ్ళు ఓర్మి వహించి చూడు!! ఆపైన సంతోషం నీ సొత్తు ఆలోచించు!! రాకాసి కొరోనా కాటువేయుటకు!! మాటు వేసి ఉందని గమనించు!! సరదాల కన్నా శ్వాస గొప్పదని తెలుసుకో!! నిర్లక్ష్యాన్నివిడనాడి నీ లక్ష్యాన్ని గుర్తుచేసుకో!! నీ ఇల్లే సరిహద్దని విసుగు చెందమాకు!! కరిగిపోయే కాలాన్ని ఒడిసిపట్టె వీలులేదు!! అరనిమిషం జారనీక ఆనందం పట్టుకో!! ఉరుకు పరుగు జీవితాన విశ్రాంతికి దూరం!! అనురాగపు ఊయలలో ఊగులాడు అవకాశం!! వదులుకోకు సంతసాన్ని ఇది నీ క్షేమం కోసం!! కబళించే కొరోనాకి చెప్పాలి గుణపాఠం!! అందుకే మనముండాలి ఇంటికే పరిమితం!! సమర్థతతో సాధించు కబళించే కొరోనాని!! గజ గజ వణుకుతు పోదా కొరోనా మన దేశాన్ని!! హమ్మయ్య అని చేస్తావులే సంబరాన నాట్యాన్ని!!
- Get link
- X
- Other Apps
ఏందిది కొరోనా రచన,ప్రభాశర్మ. సినిమాటిక్గా రాసి ట్యూన్ చేసుకున్న సాంగ్. పల్లవి; ఇంటిపట్టునే ఉండాలంటే బోరుకొట్టుతోందే బయటికెళ్ళి తిరిగొద్దామంటే భయము పుట్టుకుందే కనిపించనట్టి కొరోనా కనిపిస్తే నన్ను చుట్టేనా కొరోనా కొరోనా ఏందిదీ కొరోనా చరణం;హర్రి వర్రిగా పరుగులిడుతు అః పనులు అసలు లేవు స్వీటు హాటులు బెటెరుఆఫు ఇహ కొసరి కొసరి వడ్డించు ఏదైన మంచికని తలచు మరి అప్పుడే హేపినెస్సు ఏమైన మనకొరకె బాసు హెచ్చరించె మనకు ఎక్సులెంటు నాకెందుకింత హైరానా ముప్పూట తింటు పడుకోనా 'ఇంటి' చరణం; నీ చేతి డబ్బులు పెట్టమంటు ఇబ్బంది పెట్టనే లేదు గొడ్డు చాకిరీ చెయ్యమంటు నీ ఊసుకసలు రాలేదు బుర్ర నోరు మొత్తుకుంటూ బాగుండమంటు పోరేరు బలదూరు తిరుగులొద్దంటు ఎహె భద్రతంటు చాటారు నీ వొంటికెక్కితే దెఖోనా మటుమాయమౌనులే కొరోనా 'ఇంటి'
- Get link
- X
- Other Apps
నేనే కొరోనా రచన, ప్రభాశర్మ. ఎన్ని దేశాలు తిరిగానో,ఎంతమందిని పొట్టన పెట్టుకున్నానో, పిట్టలు రాలినట్టు రాలుతుంటే, ఏమానందించానో, మరణమృదంగం మోగించిన ఘనత నాది.వామ్మో!! ఈ భారతదేశంలో మాత్రం నా పప్పులుడకటం లేదు.ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.వీళ్ళ శుభ్రతలేంటి, వీళ్లేంటీ, నాతరం కావడం లేదమ్మా. అడుగడుగునా నీళ్ళంటారు, చెయ్యి కడిగితే నీళ్లు,ఒళ్ళు కడిగితే నీళ్లు,మల,మూత్ర విసర్జనకు నీళ్లు. అరె!!వీళ్ళకి టిష్యులు గిష్యులతో పనిలేదు.పోనీ!! ఆ మందు, చిందులుంటాయా అంటే అబ్బే!! వాటి పొడ అంటే గిట్టని వా ళ్ళు ఎంతమందో. మాంసాహారులకంటే,శాఖాహారుల శాతమే అత్యధికంగా కనబడుతున్నారు. ఇహ మనమేం చెయ్యగలం.అప్పటికీ అల్లుకుపోదామని, ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నించా.ఫలించేటట్టులేదు.నాకు తెలుసు!!భారతీయుల సంగతి.వద్దనుకుంటునే ఈ దేశంలో అడుగు పెట్టేసా.అమ్మో!! అమ్మో!! వీళ్ళ పూజలు బంగారం కాను!!రామాయణాలట,భారతాలట, పవిత్రజలాలట, పుణ్యభూమిఅట, పుణ్యదేశమట.ఆ సమైఖ్యత,ఆ సఖ్యత చూస్తుంటే గుండె గుబులు పుడుతోంది.నన్ను వెంటతగిలేదాకా నిద్రపోరని నాకు తెలిసిపోయింది.భారతదేశ ప్రధానమంత్రి శ్రీ.మోదీగారు కంటిమీద కునుకు లేకుండా దేశప్రజల రక్షణ కోసమై పరితప
- Get link
- X
- Other Apps
రచన; ప్రభాశర్మ. పల్లవి; కదనరంగం రణరంగం కొరోనాతోయుద్ధం కబళించే కొరోనాను తరిమి తరిమి కొడదాం మన లక్ష్యం సాధించగ భరతదేశ ధీరులమై ప్రతివారొక సైనికులై కొరోనరహిత జనహితులై మోదీజీ సూచనలను ఆచరణలో పెడదాం విజయగర్వాన ఖ్యాతి దశదిశలకు చాటుదాం చరణం; ఎంతకాలమనికాదు ఎంతైనా భరిద్దాం ఎవరికోసమో కాదు మనకోసం తలుద్దాం బాహ్యప్రపంచం మరచి భాద్యతగాభావించి విసుగుమరచి విశ్వమంత ఆదర్శంగా నిలిచి భరతదేశ కొరోనా గెలుపు జెండ ఎగరేద్దాం చరణం; అవిశ్రాంత సైనికులై వైద్యసేవ పోరాటం కొరోనయుద్ధప్రేమికులై రక్షకభట ఆరాటం సామాజిక సేనలకు గౌరవించి స్పందించి కొరోనా శత్రువుని పారద్రోల దీక్షబూని సాధిద్దాం జయంనిజం మనది పుణ్యదేశం
- Get link
- X
- Other Apps
వామ్మో కరోనా రచన,ప్రభాశర్మ.. పల్లవి; ఎక్కడో పుట్టావు ఎక్కడో పెరిగావు ఇక్కడికి వచ్చితివి చైనా ఇది నీకు తగునా కరోనా చరణం; గబ్బిలాల సూపు లొట్టలేసుకు తాగి గబ్బు జబ్బంటించే చైనా ఇల పేరు మోగే కరోనా చరణం; కంటి కునుకూ కరువు కడుపు తిండీ మరపు నూటొకటి కొట్టించే చైనా రాకాసి నీవే కరోనా చరణం;పోలీసు అన్నలకు వైద్యులా సేవలకు విశ్రాంతి కరువులే చైనా బాగుంద ఏమే కరోనా చరణం;శానిటైజర్లంటవ్ మాస్కులనిఅంటావు ఈ బాదుడేంటే చైనా దొరక్క హైరానా కరోనా చరణం;కాళ్ళకీ బంధాలు ఇంటిలో కలహాలు పితలాటకం పెట్టె చైనా సరదాలు దూరం కరోనా చరణం;మమ్మేలు మారాజు మా మోదీసారంట మాదన్నుగా నిలిచె నాయనా మాయమవుతావే కరోనా