Posts

Showing posts from October, 2017
Image
మెట్టు భూమి, రచన జె.పీ.ఎస్. వానతల్లి నీకు దండమే కరుణించి చల్లగ కురియవే జోరువాన నీకోసమే పడిగాపులూ పడుతున్నమే పరుగులెత్తి మాకోసమే కురిసి పచ్చని పంటలనివ్వవే భూమి తల్లినీ నమ్మినం చెమట ధారపోసి బతికినం కన్నీళ్ల కష్టాన్ని చూసినం కడుపుకింత తిండి మరిచినం బీటలోరి భూమి బద్దలై బాధఒడిసిపట్టి మరి ఏడ్సినం ఉన్నఊరినీ వదిలినం తప్పదంటు పట్నమెల్లినం మెట్టభూమికి దండమెట్టినం మెతుకుకోసమై వెతికినం మల్లి రావాలంటు మొక్కినం ఇహ కాని వూరు బండి ఎక్కినం
Image
నాగులచవితి,రచన,జె.పీ.ఎస్. కార్తీక మాసం వచ్చింది కన్నుల్లో వెలుగు తెచ్చింది నాగన్న పండగ వచ్చింది నాగులచవితి రోజు ఇది తొలి ఝామునే నిద్ర లేచాము తలార స్నానం చేసాము ముంగిట కళ్ళాపి చల్లాము ముత్యాల ముగ్గులు పెట్టాము పూలు ఫలములు పూజాద్రవ్యాలు ఏరికూర్చి మేముంచాము చిమ్మిలి దంచి ఉంచాము చలిమిడి ఉండలు చేసాము నాగులగావంచ తెచ్చాము నాగేంద్ర నీకు మొక్కాము వడపప్పుపానకం నారీకేళము పుట్టనుంచి నిను కొలిచాము నాగేశ్వర నిన్ను తలచాము మా మనమ్మునా నిలిపాము చిన్న పెద్ద తరలొచ్చాము శివాభరణ పూజించాము అగరుబత్తులు సీమటపాసులు కాల్చి మురిసి తరియించాము
Image
ప్రక్రుతి విలయతాండవం,హుదూద్, జె.పీ.ఎస్. సరిగ్గా మూడేళ్ళక్రితం ముచ్చెమటలు పట్టే రోజు గుండె దడ పుట్టే రోజు విశాఖ విల విల లాడే రోజు అర చేతిలో ప్రాణం పెట్టుకున్న రోజు భయాందోళనకు గురి కాబడిన రోజు ప్రక్రుతి తల్లి ఆగ్రహానికి బలి ఐన రోజు అస్తవ్యస్తంగా ఉన్నవిశాఖని చూసి ఏడ్చిన రోజు మళ్ళీ పూర్వ వైభవం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన రోజు ఎప్పుడు విశాఖని ప్రేమగా లాలించే ప్రకృతితల్లి ఎందుకు కోపగించిందో తెలియని పరీస్థితి వాతావరణ శాఖవారి హెచ్చరిక మామూలే అనుకున్నాం ఇస్రో చెప్పినా ఖాతరు చేయకుండా చూసాం కానీ అనుకున్నంతా ఐంది భవంతులు సైతం ఉయ్యాల లూగాయి వందల చరిత్ర మానులు కూకటి వేళ్ళతో నేలకొరిగాయి నిద్రలేదు హారం లేదు పాలులేవు నీళ్లు లేవు విద్యుత్తు సౌకర్యం లేదు సమాచార వ్యవస్థ కనుమరుగు ఏ దిష్టి తగిలిందో అని ఒకటికి పదిసార్లు అనుకున్న రోజు ఆసియాలోనే అభివృద్ధిపథంలో ప్రధమ స్థానం విశాఖ అందం ఆనందం ఆహ్లాదానికి పెట్టింది పేరు విశాఖ సాగర తీరం చల్లనిగాలితో పర్యాటకులను సమ్మోహనపరిచే విశాఖ కానీ! గతం కంటే అందం రెట్టింపని జనం మెచ్చే రోజు! ఈ రోజు మా విశాఖ ఎప్పటికీ ఇలానే వుండాలని కోరుకుంటున్నాము పచ్చని గిరుల మధ్య పదిలంగా
Image
జానపద యుగళ గీతం ,రచన జె.పీ.ఎస్. 4 Years back c.d kosamai raasindi  తూటూ పూల రంగు కోకా...... తెచ్చానే నీకు కట్టుకోగా ఉమ్మెత్తా పూల రంగు సొక్కా...... ఏసావంటే పూలరంగా నీ సెవికి కమ్మలు ఎడతా నువ్వు సెప్పినట్టు నేనింటా నా పేనమంటె నువ్వంటా నీ మాట జవదాటనంటా నా నవ్వుల సింగారి ముద్దుల బంగారి నువ్వేను నా జాపత్రి నీ ఏలి పట్టి నే నడుత్తా నీతోనే నాకు లోకమంతా నీ గుండెలోన నిదురపోతా నీ యెంట తోడు నేనంటా ఆ పూలన్ని ఏరీ నీ పాదాల ఏసీ చేస్తాను పూజను ఏటీ
Image
అలంపురం జోగులాంబ, భక్తి గీతం,లిరిక్, జె.పీ.ఎస్. సి.డి.కోసం రాసినది. రససిద్ధుడు కట్టించిన దేవాలయం అలరారుతున్న మన అలంపురం తపసు చేయ సిద్ధుడొచ్చె ఈ క్షేత్రం  కాశీ విశ్వేశ్వరుని ప్రేరణం బ్రహ్మెశ్వర శిరసు నుండి జోగులాంబ నోటినుండి గణపతయ్య బొడ్డునుండి ఇచ్చినారు ఒక రసము పరసవేదిని చేసి ఆలయాలు కట్టించి పరమపావనంగ చరితలోన నిలిచీ దండెత్తగా వచ్చాడు విలసద్రాజు పరసవేదినీ కోసం ఆ మహారాజు అసంపూర్తి నిర్మాణం ఆలయంలో ప్రవేశం సిద్ధుడు అయినాడు బ్రహ్మస్వరునిలో లీనం కలతచెంది సిద్ధుడు పెట్టినాడు శాపం రాజ్యం పోగొట్టుకొని కష్టాలను అనుభవించి పొందినాడు జింకచేత ఉపదేశం చివరికి చేరాడు రాజు శివసాన్నిధ్యం
Image
రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్ ,పేరడీ సాంగ్ లిరిక్,జె.పీ.ఎస్. ఎప్పసుగొచ్చిందీ సైకిల్ ఎక్సుప్రెసు అనుకున్నా బైస్కిల్ ఈల వేసి నే తీసే టైముకి టపాసుల పేలె సూపర్ ఒక చక్రం పక్కింటోడిది మలి చక్రం ఎదిరింటోడిది బెల్లేమో మీదింటోడిది బ్రేకేమో బెస్ట్ ఫ్రెండుది పార్టులు అన్నీ........ పార్టులు అన్నీ ఏకం చేస్తే షేపుకి వచ్చిన సైకిల్ ఒక టైరుకి ట్యూబే పోయే ఒక టైరుకి గాలే వొదిలే బెల్లేమో మోగదు ఆయే బ్రేకేమో ఆగదు ఆయే బటానోడికీ............... బటానోడికీ యిచ్చే పార్టులు తెచ్చినందుకే తిప్పల్
Image
లలితగీతం,రచన,జె.పీ.ఎస్. ఎందుకమ్మ కోయిలమ్మ అంత స్వరం నీకు ఎంత విన్నాగాన తనివి తీరదు నాకు భగవంతుడు నీకిచ్చిన మా గొప్ప వరమమ్మా బాధ్యతగా శిరసావహించావు నీవమ్మా అలసటంటు మరిచావు ఆనందం పంచావు ఆమని కోయిల అంటు బిరుదును పొందావు చిగురు తొడిగిన కొమ్మల తీయని రాగాలు తీయ కమ్మగ ఆస్వాదించి అభివాదము చేయా అభినందన వెల్లువా విన సొంపుగ గీతికా ఆభేరి రాగాన అందుకొ ప్రియ మాలికా