Posts

Image
                                            అసంఘటిత కార్మికులు                                                             కడుపుకింత తిండి, కట్టుకొనబట్ట కరువై, ఆలోలక్షణా అంటూ,ఎలా బతకాలి అని ఆలోచిస్తూ,బాధపడుతుంటే,అమ్మ పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడి,యీలోకంలోకి వచ్చా. అరువుమీద తెచ్చిన సరుకులతో అమ్మ బువ్వ వొండి  వొడ్డించిందే గాని ...తినబుద్ధి కాలే. ఎలాగైనా రేపు పట్నం నుంచ్చి వస్తున్న మావయ్యను కలిసి మాటాడాలి.ఏదో ఒకటి చెయ్యాలి.ఎన్నాళ్లిలా?పంటలు పండక,పనుల్లేక పస్తులతో ఎన్నాళ్ళు?. చదువుకోవాలని వున్నా!! అది నాలాంటి వాళ్లకు జరగని పని!!. అమ్మని, అయ్యని బాధపెట్టకూడదు!! బాగా చూసుకోవాలి అంటే ఇదే మార్గం!!. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా!!మావయ్యని కలుద్దామా!!అన్న ఆలోచనతోనే తెల్లారింది.ఇంటి ముందు ఆగిన అన్ని బస్సుల్నిఅదే పనిగా చూస్తుంటే, ఆ ...
Image
మల్లెతీగ ఆక్రోశం.... రచన; జయప్రభాశర్మ నన్ను ఆకలితో మాడ్చి పండగ చేసుకుంటున్నావా!! మావూరంటూ పరుగులెత్తి వెళిపోతావా!! వినోదాలు విందులతో మునిగి తేలుతున్నావా!! పనివాళ్ళకి చెప్పాలే అనుకుంటున్నావా!! వాళ్ళుకూడా నీకుమల్లే పరుగులెత్తి వెళ్లిపోయారు తెలుసా!! దోసెడు నీళ్లు పోసేవారెప్పుడొస్తారా అని చూస్తున్నా!! ఆహ!! ఒక్కరి జాడైనా కనిపిస్తేనా!! అవును!! నా బాధ మీకెలా తెలుస్తుంది!! మీకవసరమైనప్పుడు కనిపిస్తాను తప్పా!! ఇలాంటి తరుణంలో ఏం గుర్తొస్తానులే!! కవి కలానికి నేనే!!చిత్రకారుని కుంచెకు నేనే!! కమ్మని కావ్యానికి నేనే!!చలనచిత్రానికి నేనే!! ప్రశంసలకి నేనే!! పడతి కురుల నేనే!! పుష్పమాలాంకృతులకు నేనే!!పూజకు నేనే!! పుష్ప ప్రదర్శనకి నేనే!!పుష్పగుచ్ఛాన్ని నేనే!! ప్రతి రోజు స్మరణ నేనే!!స్ఫురణ నేనే!! అటువంటి నన్ను ఏడిపించడం భావ్యమా!! అమ్మ నాకు లేదా!!ఆ కళ్ళ నీళ్లు చూడు!! సమ్మోహనభరితురాలివై మైమరచిపోతావా!! నా సువాసనని ప్రశంసిస్తావా!!ఆఘ్రాణిస్తావా!! మల్లంటే మల్లెని ఎగబడి కోస్తావా!! కనిపిస్తే కాడ విరిచి విజృంభిస్తావా!! నేనుంటే గుబాళింపు!!నేనుంటే మైమరపు!! ఇటుపైన క్షోభ పెట్టకు!! ఆవేశానికి గురి చేయకు!! చారెడు నీళ్ల...
Image
భక్తి గీతం: రచన;జయప్రభాశర్మ. విద్యా ప్రసాదినీ దేవి వీణా పుస్తకధారిణీ నిత్య నామ జప వాగ్దేవీ మనసా స్మరామి భారతీ వసంత పంచమి సరస్వతీ సత్వగుణ సదా పూజయామి "విద్యా" అక్షరాభ్యాస ముహూర్తం ఆనందాన భక్తార్పణం సకలలోక సంపూజితం సర్వకాల సంసేవితం శారదామాత జయంతోత్సవం మాఘమాస శొభోత్సవం "విద్యా" అక్షరా ప్రణవస్వరూపం భాసిల్లు బాసర క్షేత్రం వాణీ వసంత ఉత్సవం ప్రకటిత దిన ప్రాముఖ్యం రతీమన్మధుల ప్రేమోత్సవం చిగురు పూతల ప్రకృతోత్సవం "విద్యా"
Image
రైతు వ్యధ జీన్స్ పేంట్లు, టీషర్టులు, కళ్లద్దాలు, షూలు, చేతిలో ఖరీదైన ఫోను మాకు తెలీదు.మాకు తెలిసిందల్లా...మావూరు,మాభూమి,మాగాలి,మానీరు మాత్రమే.మనసు నిర్మలం.మాటల తీపితనం. కష్టనష్టాలెదురైనా నవ్వుతు తిరిగే నైజం. ఉపకారమంటే మేమున్నాం అనే తత్వం. మరి అలాంటి మాకు....ఎంత ఓర్పు వహిస్తున్నా,జరుగుబాటులేని పరిస్థితి. కడుపునిండా తిండి, కట్టుకొన బట్ట ఉంటే చాలనుకున్నా, అదే కరువంటే నమ్ముతారా!!. తాతలనాటి నుంచి మట్టిని నమ్ముకొని బతుకు వెళ్లదీస్తున్న వాళ్ళం.  మాకు హంగులు ఆర్భాటాలు తెలియవు.ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తున్న రైతుబిడ్డలం.ఇంటిల్లిపాది రాత్రనక, పగలనక కష్టపడి, అప్పులు చేసి మదుపు పెట్టి, ఎప్పుడు పంట చేతికొస్తుందా, అని వేయికళ్లతో ఆశగా ఆకాశంవైపు చూస్తుంటే....కరుణించని వరుణుడు.గుండెలో ఒకటే గుబులు. ఆకలివేయక,నిద్రపట్టక రేపన్నది ఎలా గడుస్తుందో తెలియని అయోమయం.వాన చినుకు రాకకై అలుపులేని చూపులు.కనిపించిన దేవుళ్ళకు,మొక్కులు,పూజలు. ఇంటి యిల్లాలు సైతం బిందెలతో నీళ్లు తెచ్చి పంటను తడిపే ప్రయత్నం.అలసట తెలియని కష్టం..వాళ్ళు పడుతున్న యాతన చూస్తే ఒక్కోసారి కళ్లనీళ్లు ఆగవు.ఒడిదుడుకులు తట్టుకొనే ఇల్లాలు,పిల్లలు...
డ్యూయెట్ లిరిసిస్ట్,జె.పీ.ఎస్. అతడు; ఏదోలా వుందే ఏదెదోలావుందే నిను చూసినవేళా నాలో ఇంకేదో అవుతోందే ఆమె; ఏంటో అనుకుందే యింకేంటో అనుకుందే చిరునవ్వులకర్ధం నీలో అది ఏంటో తెలిసిందే చరణం; అతడు; నా తలపుల వలపుల గమకం తియ తియ్యని తేనెల మధురం ఆమె; నా మనసున నిలిచిన ప్రణయం చల చల్లగ తాకిన పవనం అతడు; అనుకోని ఆరాటం అందిస్తా ఆహ్వానం ఆమె; ఇక లేదే ఆషాడం మరి రేపే తాంబూలం '' ఏదోలా' చరణం ఆమె; నా కనులకు కలలకు సాక్ష్యం ప్రేమాంకిత మృధు భావం అతడు; నా తనువుకు తపనకు మూలం నును సిగ్గుల నీ వదనం ఆమె; మది చేసే విన్యాసం మురిపించే రస నాదం అతడు; అరుదెంచే కార్తీకం ఆనందం మన సొంతం 'ఏదోలా'
https://www.facebook.com/prabha.sharma.756412/videos/vb.100008035569571/1991897737754726/?type=3&theater
Image
"VAMMO NORU" ఏదైనా చెయ్యగల సమర్ధత,ఎంతకైనా తెగించే దుడుకు స్వభావం, కత్తికైనా లేని పదును, మాటల తూటాని,మరో ఆయుధాన్ని. దేనికైనా తాళాలు వున్నాయి గాని...మనకి!!అబ్బే!! ఎవ్వరి తరం కాదు!!. నీ వాగుడు వరద ఆపవే బాబు!!నువ్వెవరో చెప్పి ఏడు!!....అదే మరి!!చెబుతున్నా!!వినండి!!మీ నోరుని!!అడ్డు అదుపు లేనిదాన్ని!!.నెలల పిల్ల నుంచి బెంగ పడిపోతూంట్టారు.ఎక్కడ మాటలు రావో అని.వస పోసేసేవాళ్ళు కొందరైతే,వైద్యుల దగ్గరకు మోసుకెలిపేవాళ్లు కొందరు.అమ్మ!!అని పిలుపు వింటే చాలు.ఉత్సాహంతో ఉరుకులు, పరుగులు, అడిగిన వాళ్లకి, అడగనివాళ్ళకి చెప్పుకొని...ఓ..ఎంత మురిసిపోతారో. ఇంక అక్కడ్నుంచి ఉంటాయి  రకరకాల జిమ్మిక్కులు.ఇహ వున్నత స్థానానికి తీసుకెళ్లాలన్న, పతనం చేయాలన్న, మనదే ఆపరేషన్ అంతా.మాట అన్నది మణి మాణిక్యాలకన్నా విలువైనది.మాయల ఫకీరు చిలక ప్రాణంలా మనమే మూల కారణం.పాతాళానికి తోయవేయబడ్డారంటే మనదే ఆ ఘన కార్యం. అందుకే అంటారు నోరా!!తేమాకే వీపుకి!! అని. అయినా విని ఏడిస్తేగా!!. బాధ పడితే గాని బోధపడదని!!.పదిమందిలో మాట్లాడాలంటే మామూలు విషయమా?.....చక్కని పలుకు పలికి,తీయటి మాట్లాడొద్దని అన్నానా?. అయ్యో!!అయ్యో!!ఎంత మాటనేస్...