Posts

Showing posts from 2018
Image
పెళ్లి విందు మన ఇంటి పెళ్లి విందు అదిరిపోవాలి!! చూసినవాళ్లంతా ముక్కుమీద వేలేసుకోవాలి!!లేకపోతె ...మొన్నామధ్య మన పక్కింటివాళ్ళు చూడు!!ఓ!! ఇరవై రకాల స్వీట్లు పెట్టామా!!అన్ని కూరలు పెట్టామా!!ఇన్ని కూరలు పెట్టామా!! అంటూ ఏవిటా బిల్డప్పు!! చెవులు చిల్లులు పడిపోయాయనుకో!!వినలేక చచ్చేమ్!! మనం ఓ అరవై రకాలైన పెట్టాలి సుమా!!ఎవ్వరు ఇంతవరకు ఇలా చేయలేదని చెప్పుకోవాలి!! నా సామిరంగా ...వాళ్ళు కుళ్లిపోతుంటె చూడాలి!!ఏవనుకుంటున్నారో మనమంటే!!అలా చేస్తేనే తెలిసేది మనమేంటో!! చాలా చోట్ల జరిగేది ఇదే!!ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ....అదీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఖర్చుతో కూడినది ఈ పెళ్లి విందు.పెళ్లి అనగానే విందు భల్ పసందుగా వుండాలని అనుకోవటం...అతిదులను ఆనందపరచాలని భావించటం మన హిందూ సంప్రదాయం.కానీ!! మరీ రెట్టించే ఉత్సాహం మోతాదుమించి చేయాలనుకోవడం!! అనవసరపు వ్యయం!! బంధుమిత్రులను ఆహ్వానించి ...సంతృప్తిపరచడంలో తప్పులేదు.మనం శుభలేఖల్లోనే ...మా విందు ఆరగించి, తాంబూలం స్వీకరించి, మామ్మానందింపచేయ ప్రార్ధన అంటాము.అది మన మర్యాద.ఏది తినాలో అర్ధంకాని రీతిలో విస్తరి నిండుకోవడమే కాక....వేరే మళ్ళీ సలాడ్లు ,ఐస్క్రీములు, డ
Image
వృద్ధాప్యం   ఈ అందం, ఈ బింకం, ఈ ఆరోగ్యం ఈ వయసు శాశ్వతమా!!ఊహు!! అందరం వృద్దాప్యం అనుభవించాల్సిందే.తప్పదు. కానీ!! వృద్ధులనేసరికి వాళ్లకి ఆసరాగా నిలిచేవాళ్ళెంతమంది వున్నారు!!మంచి మాటలాడి....మంచి మనసుతో ఆదరించి అక్కున చేర్చుకున్న నాడు పసిపిల్లలై ఎంత పొంగిపోతారో!! అబ్బే!! వాళ్ళు మాట్లాడితే విసుగు, వాళ్ళ చేతలు విసుగు, వాళ్ళు చేసే ప్రతీ పనికి విమర్శలు. ఎంత చిన్నబోతారో కదా!!వృద్ధులు చిన్నపిల్లలతో సమానమంటారు. వాళ్ళని అర్ధం చేసుకొని బాగా  చూసివుంటే ఈనాడు వృద్ధాశ్రమం అన్న పేరే వినిపించకపోనేమో!!ఎక్కడో పుట్టి పెరిగిన కోడలు,అభం శుభం తెలియని మనుమలు, విసుక్కున్నా అర్ధముందేమో కానీ కన్న కొడుకులే ..కఠిన పాషాణ హృదయులైనప్పుడు...ఎవరికి చెప్పుకోవాలి వారి ఆవేదన...ఆ బాధ వర్ణనాతీతం.మనసులో కుమిలిపోతూ,  కడుపు తీపి మమకారం,ఎవరికి అంతుపట్టని ఒక కావ్యం.ప్రేమావాత్సల్యపు సాగరం.ఎంత దుఃఖాన్నైనా భరించే శక్తి ఆ భగవంతుడు ఒక్క తల్లి తండ్రులకు మాత్రమే ఇచ్చాడనుటలో ఏ మాత్రం సందేహం లేదు!!                        పిల్లలే లోకంగా జీవించి, ఆశల కలలు కంటూ,  వారి భవిత బంగారం కావాలని ఆసిస్తూ, కష్టనష్టాల ఎదురీతలో కొట్టుమిట్టాడుతూ, కం
Image
                                            అసంఘటిత కార్మికులు                                                             కడుపుకింత తిండి, కట్టుకొనబట్ట కరువై, ఆలోలక్షణా అంటూ,ఎలా బతకాలి అని ఆలోచిస్తూ,బాధపడుతుంటే,అమ్మ పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడి,యీలోకంలోకి వచ్చా. అరువుమీద తెచ్చిన సరుకులతో అమ్మ బువ్వ వొండి  వొడ్డించిందే గాని ...తినబుద్ధి కాలే. ఎలాగైనా రేపు పట్నం నుంచ్చి వస్తున్న మావయ్యను కలిసి మాటాడాలి.ఏదో ఒకటి చెయ్యాలి.ఎన్నాళ్లిలా?పంటలు పండక,పనుల్లేక పస్తులతో ఎన్నాళ్ళు?. చదువుకోవాలని వున్నా!! అది నాలాంటి వాళ్లకు జరగని పని!!. అమ్మని, అయ్యని బాధపెట్టకూడదు!! బాగా చూసుకోవాలి అంటే ఇదే మార్గం!!. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా!!మావయ్యని కలుద్దామా!!అన్న ఆలోచనతోనే తెల్లారింది.ఇంటి ముందు ఆగిన అన్ని బస్సుల్నిఅదే పనిగా చూస్తుంటే, ఆ పక్కనే ఆగిన లారీలోంచి దిగాడు మావయ్య.ఆప్యాయంగా పలకరించి,హత్తుకొని ఇంటిలోకి తీసుకెళ్లి,మావయ్యకిష్టమైనవి చేసిపెట్టి, దగ్గరుండి తినిపించి,కొసరి కొసరి వడ్డించి  ఎంతో పొంగిపోయింది అమ్మ. అమ్మ చూపించిన అభిమానానికి,తెగ సంబరపడిపోయి,అయ్య ఏసిన నులకమంచం మీద నడుం వాల్చి, మాట్లాడుతుం
Image
మల్లెతీగ ఆక్రోశం.... రచన; జయప్రభాశర్మ నన్ను ఆకలితో మాడ్చి పండగ చేసుకుంటున్నావా!! మావూరంటూ పరుగులెత్తి వెళిపోతావా!! వినోదాలు విందులతో మునిగి తేలుతున్నావా!! పనివాళ్ళకి చెప్పాలే అనుకుంటున్నావా!! వాళ్ళుకూడా నీకుమల్లే పరుగులెత్తి వెళ్లిపోయారు తెలుసా!! దోసెడు నీళ్లు పోసేవారెప్పుడొస్తారా అని చూస్తున్నా!! ఆహ!! ఒక్కరి జాడైనా కనిపిస్తేనా!! అవును!! నా బాధ మీకెలా తెలుస్తుంది!! మీకవసరమైనప్పుడు కనిపిస్తాను తప్పా!! ఇలాంటి తరుణంలో ఏం గుర్తొస్తానులే!! కవి కలానికి నేనే!!చిత్రకారుని కుంచెకు నేనే!! కమ్మని కావ్యానికి నేనే!!చలనచిత్రానికి నేనే!! ప్రశంసలకి నేనే!! పడతి కురుల నేనే!! పుష్పమాలాంకృతులకు నేనే!!పూజకు నేనే!! పుష్ప ప్రదర్శనకి నేనే!!పుష్పగుచ్ఛాన్ని నేనే!! ప్రతి రోజు స్మరణ నేనే!!స్ఫురణ నేనే!! అటువంటి నన్ను ఏడిపించడం భావ్యమా!! అమ్మ నాకు లేదా!!ఆ కళ్ళ నీళ్లు చూడు!! సమ్మోహనభరితురాలివై మైమరచిపోతావా!! నా సువాసనని ప్రశంసిస్తావా!!ఆఘ్రాణిస్తావా!! మల్లంటే మల్లెని ఎగబడి కోస్తావా!! కనిపిస్తే కాడ విరిచి విజృంభిస్తావా!! నేనుంటే గుబాళింపు!!నేనుంటే మైమరపు!! ఇటుపైన క్షోభ పెట్టకు!! ఆవేశానికి గురి చేయకు!! చారెడు నీళ్ల
Image
భక్తి గీతం: రచన;జయప్రభాశర్మ. విద్యా ప్రసాదినీ దేవి వీణా పుస్తకధారిణీ నిత్య నామ జప వాగ్దేవీ మనసా స్మరామి భారతీ వసంత పంచమి సరస్వతీ సత్వగుణ సదా పూజయామి "విద్యా" అక్షరాభ్యాస ముహూర్తం ఆనందాన భక్తార్పణం సకలలోక సంపూజితం సర్వకాల సంసేవితం శారదామాత జయంతోత్సవం మాఘమాస శొభోత్సవం "విద్యా" అక్షరా ప్రణవస్వరూపం భాసిల్లు బాసర క్షేత్రం వాణీ వసంత ఉత్సవం ప్రకటిత దిన ప్రాముఖ్యం రతీమన్మధుల ప్రేమోత్సవం చిగురు పూతల ప్రకృతోత్సవం "విద్యా"
Image
రైతు వ్యధ జీన్స్ పేంట్లు, టీషర్టులు, కళ్లద్దాలు, షూలు, చేతిలో ఖరీదైన ఫోను మాకు తెలీదు.మాకు తెలిసిందల్లా...మావూరు,మాభూమి,మాగాలి,మానీరు మాత్రమే.మనసు నిర్మలం.మాటల తీపితనం. కష్టనష్టాలెదురైనా నవ్వుతు తిరిగే నైజం. ఉపకారమంటే మేమున్నాం అనే తత్వం. మరి అలాంటి మాకు....ఎంత ఓర్పు వహిస్తున్నా,జరుగుబాటులేని పరిస్థితి. కడుపునిండా తిండి, కట్టుకొన బట్ట ఉంటే చాలనుకున్నా, అదే కరువంటే నమ్ముతారా!!. తాతలనాటి నుంచి మట్టిని నమ్ముకొని బతుకు వెళ్లదీస్తున్న వాళ్ళం.  మాకు హంగులు ఆర్భాటాలు తెలియవు.ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తున్న రైతుబిడ్డలం.ఇంటిల్లిపాది రాత్రనక, పగలనక కష్టపడి, అప్పులు చేసి మదుపు పెట్టి, ఎప్పుడు పంట చేతికొస్తుందా, అని వేయికళ్లతో ఆశగా ఆకాశంవైపు చూస్తుంటే....కరుణించని వరుణుడు.గుండెలో ఒకటే గుబులు. ఆకలివేయక,నిద్రపట్టక రేపన్నది ఎలా గడుస్తుందో తెలియని అయోమయం.వాన చినుకు రాకకై అలుపులేని చూపులు.కనిపించిన దేవుళ్ళకు,మొక్కులు,పూజలు. ఇంటి యిల్లాలు సైతం బిందెలతో నీళ్లు తెచ్చి పంటను తడిపే ప్రయత్నం.అలసట తెలియని కష్టం..వాళ్ళు పడుతున్న యాతన చూస్తే ఒక్కోసారి కళ్లనీళ్లు ఆగవు.ఒడిదుడుకులు తట్టుకొనే ఇల్లాలు,పిల్లలు. కన