Posts

Showing posts from April, 2020
కొరోనా హైరానా రచన,ప్రభాశర్మ. ఒడ్డున పడ్డ చేపపిల్లలా!! ఎందుకలా గింజుకుంటున్నావు గిల గిలా!! కొన్నాళ్ళు ఓర్మి వహించి చూడు!! ఆపైన సంతోషం నీ సొత్తు ఆలోచించు!! రాకాసి కొరోనా కాటువేయుటకు!! మాటు వేసి ఉందని గమనించు!! సరదాల కన్నా శ్వాస గొప్పదని తెలుసుకో!! నిర్లక్ష్యాన్నివిడనాడి నీ లక్ష్యాన్ని గుర్తుచేసుకో!! నీ ఇల్లే సరిహద్దని విసుగు చెందమాకు!! కరిగిపోయే కాలాన్ని ఒడిసిపట్టె వీలులేదు!! అరనిమిషం జారనీక ఆనందం పట్టుకో!! ఉరుకు పరుగు జీవితాన విశ్రాంతికి దూరం!! అనురాగపు ఊయలలో ఊగులాడు అవకాశం!! వదులుకోకు సంతసాన్ని ఇది నీ క్షేమం కోసం!! కబళించే కొరోనాకి చెప్పాలి గుణపాఠం!! అందుకే మనముండాలి ఇంటికే పరిమితం!! సమర్థతతో సాధించు కబళించే కొరోనాని!! గజ గజ వణుకుతు పోదా కొరోనా మన దేశాన్ని!! హమ్మయ్య అని చేస్తావులే సంబరాన నాట్యాన్ని!!
Image
ఏందిది కొరోనా  రచన,ప్రభాశర్మ. సినిమాటిక్గా రాసి ట్యూన్ చేసుకున్న సాంగ్. పల్లవి; ఇంటిపట్టునే ఉండాలంటే బోరుకొట్టుతోందే బయటికెళ్ళి తిరిగొద్దామంటే భయము పుట్టుకుందే కనిపించనట్టి కొరోనా కనిపిస్తే నన్ను చుట్టేనా కొరోనా కొరోనా ఏందిదీ కొరోనా చరణం;హర్రి వర్రిగా పరుగులిడుతు అః పనులు అసలు లేవు స్వీటు హాటులు బెటెరుఆఫు ఇహ కొసరి కొసరి వడ్డించు ఏదైన మంచికని తలచు మరి అప్పుడే హేపినెస్సు ఏమైన మనకొరకె బాసు హెచ్చరించె మనకు ఎక్సులెంటు నాకెందుకింత హైరానా ముప్పూట తింటు పడుకోనా 'ఇంటి' చరణం; నీ చేతి డబ్బులు పెట్టమంటు ఇబ్బంది పెట్టనే లేదు గొడ్డు చాకిరీ చెయ్యమంటు నీ ఊసుకసలు రాలేదు బుర్ర నోరు మొత్తుకుంటూ బాగుండమంటు పోరేరు బలదూరు తిరుగులొద్దంటు ఎహె భద్రతంటు చాటారు నీ వొంటికెక్కితే దెఖోనా మటుమాయమౌనులే కొరోనా 'ఇంటి'
Image
నేనే కొరోనా రచన, ప్రభాశర్మ. ఎన్ని దేశాలు తిరిగానో,ఎంతమందిని పొట్టన పెట్టుకున్నానో, పిట్టలు రాలినట్టు రాలుతుంటే, ఏమానందించానో, మరణమృదంగం మోగించిన ఘనత నాది.వామ్మో!! ఈ భారతదేశంలో మాత్రం నా పప్పులుడకటం లేదు.ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.వీళ్ళ శుభ్రతలేంటి, వీళ్లేంటీ, నాతరం కావడం లేదమ్మా. అడుగడుగునా నీళ్ళంటారు, చెయ్యి కడిగితే నీళ్లు,ఒళ్ళు కడిగితే నీళ్లు,మల,మూత్ర విసర్జనకు నీళ్లు. అరె!!వీళ్ళకి టిష్యులు గిష్యులతో పనిలేదు.పోనీ!! ఆ మందు, చిందులుంటాయా అంటే అబ్బే!! వాటి పొడ అంటే గిట్టని వా ళ్ళు ఎంతమందో. మాంసాహారులకంటే,శాఖాహారుల శాతమే అత్యధికంగా కనబడుతున్నారు. ఇహ మనమేం చెయ్యగలం.అప్పటికీ అల్లుకుపోదామని, ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నించా.ఫలించేటట్టులేదు.నాకు తెలుసు!!భారతీయుల సంగతి.వద్దనుకుంటునే ఈ దేశంలో అడుగు పెట్టేసా.అమ్మో!! అమ్మో!! వీళ్ళ పూజలు బంగారం కాను!!రామాయణాలట,భారతాలట, పవిత్రజలాలట, పుణ్యభూమిఅట, పుణ్యదేశమట.ఆ సమైఖ్యత,ఆ సఖ్యత చూస్తుంటే గుండె గుబులు పుడుతోంది.నన్ను వెంటతగిలేదాకా నిద్రపోరని నాకు తెలిసిపోయింది.భారతదేశ ప్రధానమంత్రి శ్రీ.మోదీగారు కంటిమీద కునుకు లేకుండా దేశప్రజల రక్షణ కోసమై పరితప
Image
రచన; ప్రభాశర్మ. పల్లవి; కదనరంగం రణరంగం కొరోనాతోయుద్ధం కబళించే కొరోనాను తరిమి తరిమి కొడదాం మన లక్ష్యం సాధించగ భరతదేశ ధీరులమై ప్రతివారొక సైనికులై కొరోనరహిత జనహితులై మోదీజీ సూచనలను ఆచరణలో పెడదాం విజయగర్వాన ఖ్యాతి దశదిశలకు చాటుదాం చరణం; ఎంతకాలమనికాదు ఎంతైనా భరిద్దాం ఎవరికోసమో కాదు మనకోసం తలుద్దాం బాహ్యప్రపంచం మరచి భాద్యతగాభావించి విసుగుమరచి విశ్వమంత ఆదర్శంగా నిలిచి భరతదేశ కొరోనా గెలుపు జెండ ఎగరేద్దాం చరణం; అవిశ్రాంత సైనికులై వైద్యసేవ పోరాటం కొరోనయుద్ధప్రేమికులై రక్షకభట ఆరాటం సామాజిక సేనలకు గౌరవించి స్పందించి కొరోనా శత్రువుని పారద్రోల దీక్షబూని సాధిద్దాం జయంనిజం మనది పుణ్యదేశం
Image
వామ్మో కరోనా  రచన,ప్రభాశర్మ.. పల్లవి; ఎక్కడో పుట్టావు ఎక్కడో పెరిగావు ఇక్కడికి వచ్చితివి చైనా ఇది నీకు తగునా కరోనా చరణం; గబ్బిలాల సూపు లొట్టలేసుకు తాగి గబ్బు జబ్బంటించే చైనా ఇల పేరు మోగే కరోనా చరణం; కంటి కునుకూ కరువు కడుపు తిండీ మరపు నూటొకటి కొట్టించే చైనా రాకాసి నీవే కరోనా చరణం;పోలీసు అన్నలకు వైద్యులా సేవలకు విశ్రాంతి కరువులే చైనా బాగుంద ఏమే కరోనా చరణం;శానిటైజర్లంటవ్ మాస్కులనిఅంటావు ఈ బాదుడేంటే చైనా దొరక్క హైరానా కరోనా చరణం;కాళ్ళకీ బంధాలు ఇంటిలో కలహాలు పితలాటకం పెట్టె చైనా సరదాలు దూరం కరోనా చరణం;మమ్మేలు మారాజు మా మోదీసారంట మాదన్నుగా నిలిచె నాయనా మాయమవుతావే కరోనా