పెళ్లి విందు మన ఇంటి పెళ్లి విందు అదిరిపోవాలి!! చూసినవాళ్లంతా ముక్కుమీద వేలేసుకోవాలి!!లేకపోతె ...మొన్నామధ్య మన పక్కింటివాళ్ళు చూడు!!ఓ!! ఇరవై రకాల స్వీట్లు పెట్టామా!!అన్ని కూరలు పెట్టామా!!ఇన్ని కూరలు పెట్టామా!! అంటూ ఏవిటా బిల్డప్పు!! చెవులు చిల్లులు పడిపోయాయనుకో!!వినలేక చచ్చేమ్!! మనం ఓ అరవై రకాలైన పెట్టాలి సుమా!!ఎవ్వరు ఇంతవరకు ఇలా చేయలేదని చెప్పుకోవాలి!! నా సామిరంగా ...వాళ్ళు కుళ్లిపోతుంటె చూడాలి!!ఏవనుకుంటున్నారో మనమంటే!!అలా చేస్తేనే తెలిసేది మనమేంటో!! చాలా చోట్ల జరిగేది ఇదే!!ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ....అదీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఖర్చుతో కూడినది ఈ పెళ్లి విందు.పెళ్లి అనగానే విందు భల్ పసందుగా వుండాలని అనుకోవటం...అతిదులను ఆనందపరచాలని భావించటం మన హిందూ సంప్రదాయం.కానీ!! మరీ రెట్టించే ఉత్సాహం మోతాదుమించి చేయాలనుకోవడం!! అనవసరపు వ్యయం!! బంధుమిత్రులను ఆహ్వానించి ...సంతృప్తిపరచడంలో తప్పులేదు.మనం శుభలేఖల్లోనే ...మా విందు ఆరగించి, తాంబూలం స్వీకరించి, మామ్మానందింపచేయ ప్రార్ధన అంటాము.అది మన మర్యాద.ఏది తినాలో అర్ధంకాని రీతిలో విస్తరి నిండుకోవడమే కాక....వేరే మళ్ళీ సలాడ్లు ,ఐస్క్రీములు, డ
Posts
Showing posts from October, 2018
- Get link
- X
- Other Apps
వృద్ధాప్యం ఈ అందం, ఈ బింకం, ఈ ఆరోగ్యం ఈ వయసు శాశ్వతమా!!ఊహు!! అందరం వృద్దాప్యం అనుభవించాల్సిందే.తప్పదు. కానీ!! వృద్ధులనేసరికి వాళ్లకి ఆసరాగా నిలిచేవాళ్ళెంతమంది వున్నారు!!మంచి మాటలాడి....మంచి మనసుతో ఆదరించి అక్కున చేర్చుకున్న నాడు పసిపిల్లలై ఎంత పొంగిపోతారో!! అబ్బే!! వాళ్ళు మాట్లాడితే విసుగు, వాళ్ళ చేతలు విసుగు, వాళ్ళు చేసే ప్రతీ పనికి విమర్శలు. ఎంత చిన్నబోతారో కదా!!వృద్ధులు చిన్నపిల్లలతో సమానమంటారు. వాళ్ళని అర్ధం చేసుకొని బాగా చూసివుంటే ఈనాడు వృద్ధాశ్రమం అన్న పేరే వినిపించకపోనేమో!!ఎక్కడో పుట్టి పెరిగిన కోడలు,అభం శుభం తెలియని మనుమలు, విసుక్కున్నా అర్ధముందేమో కానీ కన్న కొడుకులే ..కఠిన పాషాణ హృదయులైనప్పుడు...ఎవరికి చెప్పుకోవాలి వారి ఆవేదన...ఆ బాధ వర్ణనాతీతం.మనసులో కుమిలిపోతూ, కడుపు తీపి మమకారం,ఎవరికి అంతుపట్టని ఒక కావ్యం.ప్రేమావాత్సల్యపు సాగరం.ఎంత దుఃఖాన్నైనా భరించే శక్తి ఆ భగవంతుడు ఒక్క తల్లి తండ్రులకు మాత్రమే ఇచ్చాడనుటలో ఏ మాత్రం సందేహం లేదు!! పిల్లలే లోకంగా జీవించి, ఆశల కలలు కంటూ, వారి భవిత బంగారం కావాలని ఆసిస్తూ, కష్టనష్టాల ఎదురీతలో కొట్టుమిట్టాడుతూ, కం