అసంఘటిత కార్మికులు కడుపుకింత తిండి, కట్టుకొనబట్ట కరువై, ఆలోలక్షణా అంటూ,ఎలా బతకాలి అని ఆలోచిస్తూ,బాధపడుతుంటే,అమ్మ పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడి,యీలోకంలోకి వచ్చా. అరువుమీద తెచ్చిన సరుకులతో అమ్మ బువ్వ వొండి వొడ్డించిందే గాని ...తినబుద్ధి కాలే. ఎలాగైనా రేపు పట్నం నుంచ్చి వస్తున్న మావయ్యను కలిసి మాటాడాలి.ఏదో ఒకటి చెయ్యాలి.ఎన్నాళ్లిలా?పంటలు పండక,పనుల్లేక పస్తులతో ఎన్నాళ్ళు?. చదువుకోవాలని వున్నా!! అది నాలాంటి వాళ్లకు జరగని పని!!. అమ్మని, అయ్యని బాధపెట్టకూడదు!! బాగా చూసుకోవాలి అంటే ఇదే మార్గం!!. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా!!మావయ్యని కలుద్దామా!!అన్న ఆలోచనతోనే తెల్లారింది.ఇంటి ముందు ఆగిన అన్ని బస్సుల్నిఅదే పనిగా చూస్తుంటే, ఆ ...