Posts

Showing posts from June, 2020
Image
                               గజరాజు ఆత్మ ఘోష ఏనుగమ్మ ఏనుగు... ఏవురొచ్చిందేనుగు...మా ఊరొచ్చిందేనుగు...మంచినీళ్లు తాగిందేనుగు అంటూ ఎంత బాగా లాలిస్తూ మీ బుజ్జి పాపాల్ని ఆడిస్తారో కదా.నోరులేకపోయినా, నేను మీలా పాడలేకపోయినా, నా బిడ్డకోసం ఎన్నో కలలు కన్నా.కానీ కానరాని దూరతీరాలకి నన్ను సాగనంపారు బిడ్డతో సహా.నేనేం చేశానని?.నిండు గర్భిణిని అని చూడకుండా క్రూరాతిక్రూరంగా నన్ను మట్టుబెట్టారు.పండుని ఎర చూపిప్రాణాలు తీశారు. మనసు ఎలా ఒప్పిందో.నేను వస్తే చాలు. దీవెనలందించమంటారు.నన్ను చూస్తే చాలు ముచ్చట పడి , నన్ను అదే పనిగా తడిమి,తడిమి ఎంతో ఆనందపడతారు.నన్ను దైవంశసంభూతురాలిగా కొలుస్తారు.ఆశీస్సులందించటమే కానీ హానీ తలపెట్టని నైజం నాది.అలాంటి నన్ను హతమార్చడం భావ్యమేనా?. ఆనందంగా తిందామన్న పండు ప్రాణం తీస్తుందని తెలిసుంటే,తినేదాన్ని కాదు.బాధతో నరకయాతన పడుతున్నా,ఆలోచిస్తున్నది నా కడుపులో దాగున్న నా బిడ్డకోసం, నా కడుపున ఎందుకు పడ్డావు అని.ఎవరైనా వస్తే బావుండు, రక్షిస్తే బావుండు అని ఒకటే ఎదురుచూపులు.బాధని తట్టుకోలేక నీళ్లమడుగులో దిగి శోకసంద్రంలో మునిగిపోయిన నాకు.నా వేదన అరణ్యరోదనగా మిగిలిపోయింది.నాడు విష