వలస కార్మికుల కష్టాలు రచన:జయప్రభాశర్మ ఉన్నవూరిలో బతుకు భారమై పొట్టకూటికోసం పరరాష్ట్రం పరుగులు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు.కడుపుకింత తిండికోసం అష్టకష్టాలు.ఏదో మా బతుకు మేము బతుకుతున్నాం అనుకుని తృప్తి పడుతున్నతరుణంలో ఎక్కడ్నుంచి ఊడిపడిందో, రాకాసి మహమ్మారి కరోనా అట. మా కడుపు కొట్టి,మా పిల్లాపాపల్ని ఎంత హింసకు గురి చేసిందో చెప్పలేం.మీరు ఇంక పనికి రావద్దు, అని యజమాని చెప్పిన పిడుగులాంటి వార్తతో, ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి.కాలు, చెయ్యాడక, నోటి మాటరాక దీనస్థితి.ఎంత కష్టమైనా, ఇష్టంగా భావిస్తూ, ఇంటివారికి మూడుపూటలా కడుపునిండా అన్నం పెట్టగలుగుతున్నామన్న తృప్తితో జీవిస్తున్న మాకు ఇటువంటి పరీక్ష ఎదురవుతుందని కలలో కూడా వూహించలేకపోయాము.యజమాని ఇచ్చిన షెడ్డుల్లో కొంతమంది ఉంటే,ఇంకొంతమంది ఏ ఫుట్పాత్లమీదో, బషెల్టర్లలోనో కాలక్షేపం చేస్తూ గడుపుకోవడం.అదికూడా ఇప్పుడు లేదు, ఉన్నపళంగా మీ ఊళ్ళు వెళ్లిపోండి అని చెబితే ఎలా వెళ్ళేది. ఏరకమైన వాహనాల జాడ లేదు.నిర్మానుష్యమైన రోడ్లు,మనుష సంచారం లేని నగరాలు.బాధ పంచుకునేందుకు నా అన్నవారు కానరాక, ఆఖరికి ఒకటే నిర్ణయం.ఎంత దూరమైన కా
Posts
Showing posts from May, 2020