Posts

Showing posts from January, 2018
Image
భక్తి గీతం: రచన;జయప్రభాశర్మ. విద్యా ప్రసాదినీ దేవి వీణా పుస్తకధారిణీ నిత్య నామ జప వాగ్దేవీ మనసా స్మరామి భారతీ వసంత పంచమి సరస్వతీ సత్వగుణ సదా పూజయామి "విద్యా" అక్షరాభ్యాస ముహూర్తం ఆనందాన భక్తార్పణం సకలలోక సంపూజితం సర్వకాల సంసేవితం శారదామాత జయంతోత్సవం మాఘమాస శొభోత్సవం "విద్యా" అక్షరా ప్రణవస్వరూపం భాసిల్లు బాసర క్షేత్రం వాణీ వసంత ఉత్సవం ప్రకటిత దిన ప్రాముఖ్యం రతీమన్మధుల ప్రేమోత్సవం చిగురు పూతల ప్రకృతోత్సవం "విద్యా"
Image
రైతు వ్యధ జీన్స్ పేంట్లు, టీషర్టులు, కళ్లద్దాలు, షూలు, చేతిలో ఖరీదైన ఫోను మాకు తెలీదు.మాకు తెలిసిందల్లా...మావూరు,మాభూమి,మాగాలి,మానీరు మాత్రమే.మనసు నిర్మలం.మాటల తీపితనం. కష్టనష్టాలెదురైనా నవ్వుతు తిరిగే నైజం. ఉపకారమంటే మేమున్నాం అనే తత్వం. మరి అలాంటి మాకు....ఎంత ఓర్పు వహిస్తున్నా,జరుగుబాటులేని పరిస్థితి. కడుపునిండా తిండి, కట్టుకొన బట్ట ఉంటే చాలనుకున్నా, అదే కరువంటే నమ్ముతారా!!. తాతలనాటి నుంచి మట్టిని నమ్ముకొని బతుకు వెళ్లదీస్తున్న వాళ్ళం.  మాకు హంగులు ఆర్భాటాలు తెలియవు.ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తున్న రైతుబిడ్డలం.ఇంటిల్లిపాది రాత్రనక, పగలనక కష్టపడి, అప్పులు చేసి మదుపు పెట్టి, ఎప్పుడు పంట చేతికొస్తుందా, అని వేయికళ్లతో ఆశగా ఆకాశంవైపు చూస్తుంటే....కరుణించని వరుణుడు.గుండెలో ఒకటే గుబులు. ఆకలివేయక,నిద్రపట్టక రేపన్నది ఎలా గడుస్తుందో తెలియని అయోమయం.వాన చినుకు రాకకై అలుపులేని చూపులు.కనిపించిన దేవుళ్ళకు,మొక్కులు,పూజలు. ఇంటి యిల్లాలు సైతం బిందెలతో నీళ్లు తెచ్చి పంటను తడిపే ప్రయత్నం.అలసట తెలియని కష్టం..వాళ్ళు పడుతున్న యాతన చూస్తే ఒక్కోసారి కళ్లనీళ్లు ఆగవు.ఒడిదుడుకులు తట్టుకొనే ఇల్లాలు,పిల్లలు. కన